breaking news
time schedule
-
ఉపాధ్యాయులు సమయాన్ని పాటించాలి
జిల్లా విద్యాశాఖాధికారిణి విజయలక్ష్మి రాపూరు: ఉపాధ్యాయులు సమయాన్ని పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారిణి విజయలక్ష్మి సూచించారు. రాపూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయాన్ని పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు సమయాన్ని పాటిస్తే విద్యార్థులు గంట కొట్టకముందే వస్తారన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లకు నీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విలేకరులు ఆమె దృష్టికి తీసుకురాగా, నీటి సదుపాయాన్ని కల్పించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఎస్ఎంసీ ఎన్నికలు పూర్తయితే కమిటీ చైర్మన్ బాధ్యత వహిస్తారన్నారు. కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకురాగా కంప్యూటర్ విద్యను అందిస్తామన్నారు. రాపూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలు మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, కనీసం తలుపులు కూడా సక్రమంగా లేవని, మరమ్మత్తులు చేయించాలని డీఈఓను కోరారు. స్పందించిన ఆమె తలుపులకు వెంటే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. తొలుత పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటినారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి శ్రీనివాసులురెడ్డి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ యథాతథం
విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఎంసెట్ కౌన్సెలింగ్ విషయమై చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినా సరే.. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఆలస్యం చేయడం సరికాదని, అలా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు సమాచారం. ఆలస్యంగా విద్యాసంవత్సరం మొదలైతే.. భవిష్యత్తులో వాళ్ల పీజీ కోర్సుల దగ్గర నుంచి ఉద్యోగ నియామకాల వరకు అన్నింటిలోనూ ఇబ్బంది అవుతుంది. ఈ ఉద్దేశంతోనే కౌన్సెలింగ్ ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని మండలి భావిస్తోంది. సాయంత్రం 5 గంటల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటుచేసి, తెలంగాణ ప్రభుత్వం కూడా కౌన్సెలింగ్‌కు సహకరించాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి కోరనున్నట్లు సమాచారం.