‘కరువు’ మబ్బులు | 'Drought' Clear | Sakshi
Sakshi News home page

‘కరువు’ మబ్బులు

Aug 1 2014 12:38 AM | Updated on Sep 2 2017 11:10 AM

వరుణుడుబెట్టు చేస్తున్నాడు. ఆకాశంమబ్బులు కక్కుతున్నా.. చినుకురాలనంటోంది. ఖరీఫ్‌లో రెండునెలలు గడిచిపోయినా అంతంతమాత్రం వర్షాలు అన్నదాత ఆశలను చిత్తు చేస్తున్నాయి.

కర్నూలు(అగ్రికల్చర్): వరుణుడుబెట్టు చేస్తున్నాడు. ఆకాశంమబ్బులు కక్కుతున్నా.. చినుకురాలనంటోంది. ఖరీఫ్‌లో రెండునెలలు గడిచిపోయినా అంతంతమాత్రం వర్షాలు అన్నదాత ఆశలను చిత్తు చేస్తున్నాయి. 30మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం ఆందోళనకలిగిస్తోంది. జులై నెల కూడాముగియడంతో వివిధ పంటలసాగుకు అదును దాటిపోయింది.పత్తి, కొర్ర, పొద్దుతిరుగుడుపంటలు మాత్రమే ఆగస్టు నెలాఖరు వరకు వేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇప్పటి వరకు సీజన్ సంతృప్తికరంగా ఉన్నా వర్షాలు ఆ స్థాయిలోలేకపోవడంతో వాగులు, వంకలు,చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలతో చుక్క నీరుచేరని పరిస్థితి నెలకొంది.
 
  జూన్‌నెల సాధారణ వర్షాపాతం 77.1మిల్లీమీటర్లు కాగా.. 66.5మి.మీ., మాత్రమే నమోదైంది.గత ఏడాదితో పోలిస్తే వర్షాలుతక్కువగా ఉండటంతో ఖరీఫ్ గట్టెక్కడం అనుమానంగా మారింది.జిల్లాలో 53 మండలాలు ఉండగాసగాని కంటే ఎక్కువ ప్రాంతాల్లోవర్షపాతం అంతంత మాత్రంగానేనమోదైంది. ప్రధానంగా మూడుమండలాల్లో ఖరీఫ్ సీజన్ ప్రశ్నార్థకంగా మారింది. కోడుమూరు,గూడూరు, డోన్, బేతంచెర్ల, వెల్దుర్తి,క్రిష్ణగిరి, ప్యాపిలి, ఓర్వకల్లు,పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ,చాగలమర్రి, దొర్నిపాడు, సంజామల, ఉయ్యాలవాడ, ఆదోని, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల, ఆలూరు, ఆస్పరి,చిప్పగిరి, హాలహర్వి, హొళగుంద,పత్తికొండ, దేవనకొండ, తుగ్గలి,మద్దికెర, శ్రీశైలం మండలాల్లోసాధారణ వర్షపాతం 92 మి.మీ.,కాగా 17.2 మిల్లీమీటర్లకే పరిమితమైంది.

 ఖరీఫ్ సీజన్‌లో జిల్లా సాధారణ సాగు 5,85,351 హెక్టార్లుకాగా.. ఈ పాటికే 4.30 లక్షల హెక్టార్లలో పంటలు సాగవ్వాల్సి ఉంది.ఇప్పటి వరకు 3,49,469 హెక్టార్లలోపంటలు వేయగా.. వరి సాగు నామమాత్రంగా ఉంది. మెట్ట పంటలసాగు ఒక మాదిరిగా ఉన్నా నీటిఆధారం కింద వరి సాగు ముందుకుసాగని పరిస్థితి. ఈ ఏడాది నీటిపారుదల రంగం నిరాశాజనకంగాఉంది. వరి 88,645 హెక్టార్లలోసాగు కావాల్సి ఉండగా.. 3,185హెక్టార్లకే పరిమితమైంది. జులెనైలలో అంతంత మాత్రం వర్షాలుకురవడం.. సగానికి పైగా మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగులో పురోగతిలోపించింది. మరికొద్ది రోజులువర్షాలు కురవకపోతే రైతన్న పరిస్థితిఆందోళనకరం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement