
ప్రజాసంకల్పయాత్ర బృందం: తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు తాగునీరు కూడా అందించడం లేదన్నా..మా గ్రామంలో సుమారుగా 450 ఇళ్లు ఉండగా గ్రామంలో వాటర్ ట్యాంకు ఉన్నా కుళాయిల నుంచి ఎప్పుడూ తాగునీరు రావడం లేదు. బోరు నీటిపై ఆధారపడాల్సి వస్తుంది. గ్రామ సర్పంచ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని దత్తిరాజేరు మండలం చుక్కపేట గ్రామానికి చెందిన మహిళలు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.