రాజీనామాలంటూ హడావుడి వద్దు: సీఎం | Don't hurry for resignations, says Kiran kumar reddy | Sakshi
Sakshi News home page

రాజీనామాలంటూ హడావుడి వద్దు: సీఎం

Sep 8 2013 5:01 AM | Updated on Jul 29 2019 5:31 PM

ఏపీఎన్జీవోల డిమాండ్ నేపథ్యంలో రాజీనామాలనో, మరొకటనో హడావుడి పడొద్దని, రాజీనామాలు చేయొద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రులకు సూచించారు.

సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల డిమాండ్ నేపథ్యంలో రాజీనామాలనో, మరొకటనో హడావుడి పడొద్దని, రాజీనామాలు చేయొద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రులకు సూచించారు. రాష్ట్ర విభజన అంత సులభంకాదని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసినా దాన్ని అమలు చేయడం కేంద్రానికి సాధ్యం కాదని చెప్పారు. శనివారం పలువురు మంత్రులు క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలని ఏపీఎన్జీవో వేదిక డిమాండ్ చేసిన అంశంపై వారి మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగానే తెలంగాణ అంశానికి సాంకేతికంగా అనేక చిక్కులు ఉన్నాయని, వాటిని పరిష్కరించడం ఎవరివల్లా అయ్యేదికాదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, టీజీ వెంకటేశ్, ఎరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజుతో పాటు ఎమ్మెల్యేలు జేసీ దివాకర్‌రెడ్డి, వీరశివారెడ్డిలు కూడా కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement