సమ్మెబాటలో జిల్లా అధికారులు | District officers joining in movement | Sakshi
Sakshi News home page

సమ్మెబాటలో జిల్లా అధికారులు

Aug 24 2013 3:24 AM | Updated on Mar 21 2019 8:35 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా అధికారులు నేటి నుంచి సమ్మెబాటపట్టారు. ఈ మేరకు స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ బంగళాలో కలెక్టర్ శ్రీకాంత్‌ను కలిసి సమ్మె నోటీసు అందజేశారు.

నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా అధికారులు నేటి నుంచి సమ్మెబాటపట్టారు. ఈ మేరకు  స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ బంగళాలో కలెక్టర్ శ్రీకాంత్‌ను కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, డీఆర్వో రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ, ఎన్జీఓ, గెజిటెడ్ అధికారులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.
 
 శనివారం 12గంటలకు జిల్లా ప్రజాపరిష త్ కార్యాలయంలో సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమైక్యాంధ్ర నినాదమే కార్యాచరణ ప్రణాళికలో ముఖ్య అంశమని తె లిపారు. ఈ సమావేశానికి ఉపాధ్యాయ, ఎన్జీఓ, గెజిటెడ్, రెవె న్యూ అధికారుల సంఘం నాయకులు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ పెంచలరెడ్డి, ఆర్డీఓలు రమణ, మధుసూదన్‌రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున్, డీఆర్‌డీఏ పీడీ వెంకటసుబ్బయ్య, తెలుగుగంగ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ పద్మావతి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement