ఏపీ డీజీపీకి మాతృవియోగం | DGP jasti venkataramudu's mother is nomore | Sakshi
Sakshi News home page

ఏపీ డీజీపీకి మాతృవియోగం

Sep 26 2015 8:48 PM | Updated on Sep 3 2017 10:01 AM

ఏపీ డీజీపీకి మాతృవియోగం

ఏపీ డీజీపీకి మాతృవియోగం

ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడుకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి జాస్తి గోవిందమ్మ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు.

తాడిమర్రి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడుకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి జాస్తి గోవిందమ్మ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. మృతదేహాన్ని శనివారం స్వగ్రామం అయిన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్శింపల్లికి తీసుకొచ్చారు. డీజీపీ బంధు, మిత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు తదితర ప్రముఖులు హాజరై సంతాపం తెలిపి నివాళులార్పించారు. సాయంత్రం 5 గంటలకు వారి వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశారు.

అంత్యక్రియలల్లో జిల్లా కలెక్టర్ కోన శశిధర్, అదనపు డీజీపీ ఠాగూర్, ఐజీ గోపాల్‌క్రిష్ణ, డీఐజీ సత్యనారాయణ, కర్నూల్ రేంజ్ డీఐజీ రమణమూర్తి, జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు, జేసీ లక్ష్మీకాంతం, ధర్మవరం, అనంతపురం ఎమ్మెల్యేలు గోనుగుంట్ల సూర్యనారాయణ, ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆర్డీటీ ప్రోగ్రామ్ డెరైక్టర్ మంచూ ఫై, డీఎస్పీ మల్లికార్జున, ఆర్డీవో చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement