‘మీ నిర్ణయాలతో హిందూమతం నాశనం’ | 'Destroying Hinduism with Your Decisions' says IYR | Sakshi
Sakshi News home page

‘మీ నిర్ణయాలతో హిందూమతం నాశనం’

Aug 17 2017 2:14 AM | Updated on Jul 28 2018 3:41 PM

‘మీ నిర్ణయాలతో హిందూమతం నాశనం’ - Sakshi

‘మీ నిర్ణయాలతో హిందూమతం నాశనం’

అర్చకుల వేతనాల్లో సగం కోత విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాశారు.

సాక్షి, అమరావతి: అర్చకుల వేతనాల్లో సగం కోత విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాశారు. హిందూ మతాన్ని నాశనం చేయడానికి బయట శతృవులు అక్కర్లేదని ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ఒక్క నిర్ణయం చాలని దుయ్యబట్టారు. అర్చకుల వేతనాన్ని రూ.10,000 నుంచి రూ. 5,000కి తగ్గిస్తే గ్రామాల్లో హిందూ మతం కనిపించకుండా పోతుందని లేఖలో పేర్కొన్నారు.

ఆదాయం లేని ఆలయాల్లో అర్చకుల వేతనాలను సగానికి తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధమైన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఐవైఆర్‌ బుధవారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.  కాగా అర్చకుల వేతనాలు తగ్గించారంటూ ఐవైఆర్‌ కృష్ణారావు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో వాస్తవం లేదని బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వేమూరి ఆనంద్‌సూర్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement