‘సీఎం జగన్‌ విద్యారంగానికి పెద్ద పీట వేశారు’

Deputy Cm Alla nani Attended Teachers day Celebrations In Eluru School - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : ఏలూరు జిల్లా పరిషత్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర​ రేవు ముత్యాలరాజు, డీఈఓ రేణుక పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆ‍ళ్లనాని మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల బడ్జెట్‌లో విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయించారని, అమ్మ ఒడి  వంటి పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నత వర్గాల పిల్లలతో పోటీగా పేద పిల్లలు చదుకునేందుకు అమ్మ ఒడి ఉద్దేశమని తెలిపారు.

ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం రెండు దశల్లో పూర్తి స్థాయిలో అభివృద్థి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఏ నాయకుడు ఇవ్వని విధంగా సీఎం జగన్‌ విద్యారంగానికి పెద్ద పీట వేశారని కొనియాడారు. తమకు చదువు నేర్పిన ఉపాద్యాయుల వల్లే ఈ స్థాయికి వచ్చామని, ఇప్పడు అదే గురువులను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగుల సమస్యలతో పాటు ఉపాద్యాయుల సమస్యలను సైతం పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top