సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

Coronavirus: Huge Donations to AP CM Relief Fund - Sakshi

కరోనా నివారణలో భాగంగా సీఎం సహాయనిధికి సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌కు చెందిన ఆర్‌జే రత్నాకర్‌ రాజు రూ.5 కోట్లు, గ్రీన్‌కో ఎండీ చలమలశెట్టి అనిల్‌ రూ.5 కోట్లు. 
► పెన్నా సిమెంట్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ పెన్నా ప్రతాప్‌రెడ్డి రూ.2 కోట్లు.  
► ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్లు తమ రెండు రోజుల వేతనమైన రూ.1.15 కోట్లు.  
► ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ బి.సాంబశివారెడ్డి, రాష్ట్ర మౌలిక, వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డిలు ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ తరఫున రూ.కోటి.  
► ఆంధ్రా ఆర్గానిక్స్‌ ఎండీ ఎం నారాయణరెడ్డి రూ. కోటి విరాళం.
► కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరులోని దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.35 లక్షలు. 
► చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేతలు రూ.15 లక్షలు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపీ.విజయానందరెడ్డి, ఎస్‌ఆర్‌పురం మండల నాయకుడు గురవారెడ్డిలు కలిసి రూ.15 లక్షలు, సత్యవేడు మండలంలోని సెవెన్‌హిల్స్‌ ఎంటర్‌ప్రైజస్‌ క్వారీ సిబ్బంది రూ.2 లక్షలు, లలిత్‌ రియల్టర్స్‌ సిబ్బంది రూ.లక్ష , వెంకట పద్మావతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ కళాశాల యాజమాన్యం రూ.1.2 లక్షలు, కుప్పం గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (రెస్కో) రూ.20 లక్షలు, శ్రీవాణి విద్యా సంస్థల నిర్వాహకులు, రాష్ట్ర జూనియర్‌ కళాశాలల సంఘం ఉపాధ్యక్షులు క్రిష్ణమూర్తి రెడ్డి రూ.లక్ష. 
► ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)కు చెందిన గుంటూరు జిల్లా నరసరావుపేట వైద్యులు రూ.10.12 లక్షలు. 
► గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థల తరపున రూ.8 లక్షలు 
► మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి తనకు వచ్చే ఏడాది పెన్షన్‌ రూ.3.5 లక్షలను సీఎంఆర్‌ఎఫ్, ప్రధానమంత్రి సహాయనిధికి, సత్యాగ్రూపు విద్యాసంస్థల తరఫున సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.లక్ష , ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.లక్ష , బొత్స గురునాయుడు స్మారక విద్యాసంస్థల తరఫున కలెక్టర్‌ సహాయ నిధికి రూ.లక్ష.  
► కృష్ణా జిల్లా ఆటో ఫైనాన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎస్‌.వీరభద్రరావు, బి.నారాయణరావులు రూ.3 లక్షలు. 
► ఏపీ టెక్స్‌టైల్స్‌ ప్రెసిడెంట్‌ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, ఆయన సోదరుడు వెంకటరెడ్డి కలిసి రూ.2 లక్షలు. 
► గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన పాండురంగ మెడికల్‌ గ్రూప్‌ రూ.2 లక్షలు. 
► ప్రకాశం జిల్లా వేముల గ్రామానికి చెందిన బైలడుగు కృష్ణ పీఎం సహాయ నిధికి రూ.2 లక్షలు, సీఎం సహాయ నిధికి రూ.లక్ష, పుల్లలచెరువు మండలం ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఎంపీడీవో శ్రీనివాసులు రూ.లక్ష, ఎరువుల వ్యాపారి గజ్వల్లి భాస్కర్‌రావు రూ.50 వేలు, మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామానికి చెందిన ఏర్వ శ్రీనివాసరెడ్డి రూ.50 వేలు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top