
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. ఆయన ఈ నెల 12, 13 తేదీల్లో అక్కడే ఉంటారు. 13వ తేదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమై ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. భేటీ అనంతరం 13వ తేదీ రాత్రికి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.