రాజకీయ అనుభవం లేని చిరంజీవికి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట),న్యూస్‌లైన్: రాజకీయ అనుభవం లేని చిరంజీవికి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. స్థానిక 42వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి జలీల్‌ను గెలిపించాలని కోరుతూ బుధవారం ఎంపీ ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌లో ఉంటున్న చిరంజీవి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. జగన్‌పై చిరంజీవి వ్యాఖ్యలను ప్రజలు తిప్పికొడతారన్నారు. మహానేత వైఎస్సార్ సంక్షేమ పథకాలను కొనసాగించడం జగన్‌తోనే సాధ్యమన్నారు.
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 2న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. నగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించాలని కోరారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడిందన్నారు. కార్పొరేషన్‌కు రావాల్సిన రూ.700 కోట్లు నిధులు వెనక్కి వెళ్లడంతో ఆయా డివిజన్లలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ మహానేత వైఎస్సార్, పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిలపై ప్రజలకున్న అభిమానమే వైఎస్సార్‌సీపీని గెలిపిస్తుందన్నారు.
విభజన పార్టీల ప్రభావం వైఎస్సార్‌సీపీపై ఉండదన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌పై వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడటం ఖాయమన్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎస్‌కె. జలీల్‌ను గెలిపించాలని వారు కోరారు.