చంద్రబాబును అరెస్టు చేయాలి | Chandrababu Naidu to be arrested | Sakshi
Sakshi News home page

చంద్రబాబును అరెస్టు చేయాలి

Jun 27 2015 3:46 AM | Updated on Aug 14 2018 4:34 PM

చంద్రబాబును అరెస్టు చేయాలి - Sakshi

చంద్రబాబును అరెస్టు చేయాలి

స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు...

పుంగనూరు: స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లా పుంగనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు ప్రజల పరువు మర్యాదలను మంటకలిపారని దుయ్యబట్టారు.

తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడం , నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని అభివర్ణించారు. దేశ చరిత్రలో చంద్రబాబులాంటి అవినీతిపరులు ఉండరన్నారు.  ఎన్నికల సమయంలో మాయమాటలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు నేడు ఆ పదవి కాపాడుకోవడం కోసం ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తూ దిగజారుడు విధానాలను అవలంభిస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు అవినీతి ఆరోపణలపై ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లేదంటే చంద్రబాబు అవినీతిపై  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజాపోరాటం చేపడతామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు  బెరైడ్డిపల్లె కష్ణమూర్తి, కొండవీటి నాగభూషణం, సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ ద్వారకనాథరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీలు నరసింహులు, అంజిబాబు, మైనారిటీల నాయకుడు ఫకద్దీన్‌షరీఫ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement