బెజవాడ నుంచే చంద్రబాబు పాలన | chandrababu naidu rule from vijayawada from december | Sakshi
Sakshi News home page

బెజవాడ నుంచే చంద్రబాబు పాలన

Sep 12 2014 1:43 AM | Updated on Sep 2 2017 1:13 PM

బెజవాడ నుంచే చంద్రబాబు పాలన

బెజవాడ నుంచే చంద్రబాబు పాలన

సీఎం చంద్రబాబునాయుడు డిసెంబర్ నుంచి వారానికి ఐదు రోజులు విజయవాడ నుంచే పాలన సాగించనున్నారు.

* డిసెంబర్ నుంచి వారానికి ఐదు రోజులు అక్కడే
* రెండ్రోజులు హైదరాబాద్‌లో
 
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబునాయుడు డిసెంబర్ నుంచి వారానికి ఐదు రోజులు విజయవాడ నుంచే పాలన సాగించనున్నారు. మిగిలిన రెండు రోజులు ఆయన హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగిస్తారు. అధికారులు, టీడీపీ నేతలు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని గురువారం పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు రూ. 60 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక పలు దఫాలుగా పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత 3 రోజులు విజయవాడ నుంచి, 2 రోజులు హైదరాబాద్ నుంచి పాలన సాగిస్తానని, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి 2 రోజులు ఢిల్లీలో ఉంటానని చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement