తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి శనివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి శనివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు రాష్ట విభజన అంశాన్ని పరిష్కరించే ఉద్దేశ్యం లేదన్నారు. అటు సీమాంధ్రకు, ఇటూ తెలంగాణాకు అనుకూలంగా చంద్రబాబు వద్ద ఏదైనా ఫార్ములా ఉంటే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కేవలం రాజకీయ లబ్ది కోసమే బాబు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆ యాత్రలో భాగంగా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చిల్చీందని ఆరోపిస్తున్నారని మరి గతంలో ఆయనే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన సంగతిని మరిచిపోయినట్లు ఉన్నారని సుధాకర్రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.