బుర్రాది సాయం చేసే మనసు.. ఉగ్రది జిమ్మిక్కుల రాజకీయం | Burra Madhusudan Yadav Vs Ugra Narasimha Reddy | Sakshi
Sakshi News home page

బుర్రాది సాయం చేసే మనసు.. ఉగ్రది జిమ్మిక్కుల రాజకీయం

Apr 10 2019 11:04 AM | Updated on Apr 10 2019 11:55 AM

Burra Madhusudan Yadav Vs Ugra Narasimha Reddy - Sakshi

బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, ఉగ్ర నరసింహారెడ్డి

సాక్షి, కనిగిరి (ప్రకాశం): కనిగిరి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్‌ యాదవ్, టీడీపీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డిలు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మరో 10 మంది వరకు పోటీలో ఉన్నారు. 
మనసున్న నేత
బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు తొలి నుంచి సౌమ్యుడిగా పేరుంది. 
చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలుకరించేతత్వం ఆయన సొంతం. 
భోళా శంకరుడు. కల్మషం లేని వ్యక్తి 
ఐదేళ్ల నుంచి కనిగిరిలో ఉంటూ అందరి మనిషిగా పేరొందారు. 
పేద, ధనిక తేడా లేదు. గర్వం అనేది ఉండదు. 
అడిగిన వారికి ఎంతో కొంత సాయం చేయాలనే నైజం. 
ముందు ఎదుటి వారి మాట పూర్తిగా విన్న తర్వాత చిరునవ్యుతో స్పందిస్తూ అతనికి సమాధానం చెప్పడం బుర్రా గొప్పతనం. 
ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టడం బుర్రా నైజం. 
సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యవుతారు. 
దివ్యాంగ, అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలన చూస్తూ మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు.
రాజకీయ జిమ్మిక్కులు తెలియవు

ఉగ్రకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం ..
గిట్టని వ్యక్తిపై కక్ష సాధిస్తాడన్న పేరు
మంచితనంగా ఉంటూనే ఇబ్బంది పెడతాడు
రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తాడు 
మాటల్లో ఆప్యాయత, పలకరింపు తక్కువ
బెదిరింపు ధోరణి ఎక్కువగా కన్పిస్తుంది.  
కుల రాజకీయాలు చేస్తాడని పేరు
♦ అవసరాలకు అనుగుణంగా వ్యవహరించడం  
♦ ఎంతటి వారినైనా సమయానుగుణంగా తనవైపు తిప్పు కోవడం
రాజకీయ రంగులు మరుస్తాడన్న పేరు ఉగ్ర నరసింహారెడ్డికి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement