విజయవాడలో రెచ్చిపోయిన ఆకతాయిలు.. | Brats fires Huts in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో రెచ్చిపోయిన ఆకతాయిలు..

Feb 2 2017 10:44 AM | Updated on Sep 5 2017 2:44 AM

విజయవాడలోని పోస్టల్ కాలనీలో ఆకతాయిలు గుడిసెలకు నిప్పంటించారు.

విజయవాడ : విజయవాడలో అర్ధరాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు. పోస్టల్ కాలనీలోని గుడిసెలకు నిప్పంటించారు. బాధిత కుటుంబాలు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది

కాలనీలోని ఖాళీ ప్రదేశంలో నాలుగు కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుడిసెలకు బయటి నుంచి గడిపెట్టి, పై కప్పుకు నిప్పంటించి పరారయ్యారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు అప్రమత్తమై స్ధానికులను నిద్ర లేపారు. స్ధానికులు తలుపులు తెరవడంతో నాలుగు కుటుంబాలు ప్రాణాలతో బయటపడ్డారు. ఇంటిలోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కొందరు కావాలనే తమ గుడిసెలకు నిప్పంటించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement