గోదావరిలో పడవ బోల్తా, ఇద్దరి మృతి | Boat upsets in Godavari, 2 killed | Sakshi
Sakshi News home page

గోదావరిలో పడవ బోల్తా, ఇద్దరి మృతి

Jun 3 2014 7:01 PM | Updated on Apr 3 2019 5:24 PM

గోదావరి నదిలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో తల్లీకూతుళ్లు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.

హైదరాబాద్: విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో తల్లీకూతుళ్లు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో పడవ బోల్తాపడింది.

బలమైన ఈదురు గాలులకు పడవ తిరగబడింది. ఇందులో విహార యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు గల్లంతవుగా, ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. రాష్ట్రంలో పలు చోట్ల బలమైన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement