బైక్‌పై వచ్చి.. విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి | Blade Attack on girl student | Sakshi
Sakshi News home page

బైక్‌పై వచ్చి.. విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి

Sep 23 2015 11:33 AM | Updated on Apr 3 2019 3:50 PM

బైక్‌పై వచ్చి.. విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి - Sakshi

బైక్‌పై వచ్చి.. విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి

రాజమండ్రి వీఆర్ పురంలో రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ విద్యార్థిని పై బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు బ్లేడ్ తో దాడి చేశాడు.

రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ విద్యార్థినిపై బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న పత్తి ఐశ్వర్య ఈ దాడిలో గాయపడింది. ఉదయం కళాశాలకు వెళుతుండగా 9.30 గంటల సమయంలో ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి ఆమె చేతిపై బ్లేడ్‌తో కోసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ డి.రామారావు కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. బైక్‌పై వచ్చిన వారిలో ఒకరు హెల్మెట్ ధరించారని, మరొకరు ముఖానికి చేతి రుమాలు కట్టుకుని ఉన్నట్టు విద్యార్థిని తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement