బీజేపీ ఒత్తిడితోనే తెలంగాణ ప్రకటన | bjp played key role to approve telangana as separate state | Sakshi
Sakshi News home page

బీజేపీ ఒత్తిడితోనే తెలంగాణ ప్రకటన

Dec 7 2013 11:52 PM | Updated on Mar 29 2019 9:18 PM

బీజేపీ ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటన చేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.

 ఘట్‌కేసర్ టౌన్, న్యూస్‌లైన్:
 బీజేపీ ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటన చేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంలో శనివారం ఆయన పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు.
 అనంతరం జరిగిన సమావేశంలో అంజన్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పునర్‌నిర్మాణంలో బీజేపీ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. రాబో యే ఎన్నికల్లో నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని సూచించారు. ఈనెల 15న మండల కేంద్రంలో నిర్వహించనున్న ‘యూనిట్ ఫర్ రన్’ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సర్ధార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం గుజరాత్‌లో ఆవిష్కరణను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పార్టీలకతీంగా ప్రజలంతా పాల్గొనే విధంగా కృషిచేయాలన్నారు.
 
 కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు సత్యనారాయణ, యువమోర్చ జాతీయ కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గుండ్ల బాల్‌రాజ్, రాష్ట్ర గిరిజన మోర్చ నాయకుడు బిక్కునాథ్‌నాయక్, రాష్ట్ర నాయకుడు మోహన్‌రెడ్డి, పర్యావరణ రాష్ట్ర కన్వీనర్ నల్ల భాస్కర్‌రెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జి లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రామోజీ, దళిత మోర్చ జిల్లా ప్రధానకార్యదర్శి మారేష్, పార్టీ జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి, మీడియా సెల్ జిల్లా కన్వీనర్ తిరుమలరెడ్డి, మండల అధ్యక్షుడు లోడే చంద్ర య్య, ప్రధాన కార్యదర్శి కర్ణాకర్, కీసర మండల అధ్యక్షుడు అశోక్, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్, మహేందర్, ప్రభాకర్, సత్యనారాయణ, వీరేశం, రజనిరెడ్డి, నర్సింహారెడ్డి ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement