ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ నేతలు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. అనంతపురంలో రౌడీ రాజ్యం నడుస్తోందని జిల్లాకు చెందిన బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, ఎన్.టి. చౌదరి అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విష్ణు, చౌదరి విమర్శించారు. బీజేపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.