బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరుల త్యాగాలు వృథా కావని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. బషీర్‌బాగ్ మృతులకు నివాళులర్పిస్తూ బుధవారం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నగరంలోని కళాభారతి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు.
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరుల త్యాగాలు వృథా కావని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. బషీర్‌బాగ్ మృతులకు నివాళులర్పిస్తూ బుధవారం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నగరంలోని కళాభారతి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. అమరులు విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి, రామకృష్ణల పేరిట తాత్కాలిక స్థూపం నిర్మించి నివాళులర్పించారు. మర్రి వెంకటస్వామి, తాళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచబ్యాంకు విధానాలను అమలు చేస్తూ రైతులతో కన్నీరు పెట్టించిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. నాడు బాబుకు పట్టిన గతే నేడు కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోయిని అశోక్, అడ్డగుంట మల్ల య్య, పైడిపల్లి రాజు, పం జాల శ్రీనివాస్, బోనగిరి మహేందర్, యుగేందర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు మీ సం లక్ష్మణ్‌యాదవ్, జూ పాక శ్రీనివాస్, రాంప్రసాద్ పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో...
బషీర్‌బాగ్ విద్యుత్ పోరాటంలో అమరులకు సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. నగర కార్యదర్శి వి.శ్రీనివాస్, ఎడ్ల రమేశ్, పి.మల్లయ్య, రవి, మోహన్‌రెడ్డి, స్వామి, సునిత పాల్గొన్నారు.