సీఎంతో భేటీ అయిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు | apngo president ashok babu meets kiran kumar reddy | Sakshi
Sakshi News home page

సీఎంతో భేటీ అయిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు

Aug 22 2013 5:45 PM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్ కుమార్‌రెడ్డితో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు గురువారం సమావేశమైయ్యారు.

హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్‌రెడ్డితో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు గురువారం సమావేశమైయ్యారు. సీమాంధ్రలో చోటు చేసుకుంటున్న పరిస్థితులను ఆయనకు వివరించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26,27,28 తేదీల్లో ఢిల్లీ వెళ్తామని అశోక్ బాబు తెలిపారు. ఢిల్లీలో జాతీయ నేతలను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతామని పేర్కొన్నారు. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రతను వివరిస్తామన్నారు. గతంలో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించాలని కోరతమన్నారు.
 

సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలను కోరినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న ఏపీ ఎన్జీవోలు తాము హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెబుతున్నారు. హైదరాబాద్లోనూ భారీ సంఖ్యలోనే సీమాంధ్ర ప్రాంత వాసులు ఉన్నారని, వాళ్ల ప్రయోజనాలను సైతం కాపాడాలని అంటున్నారు. ఇప్పటివరకు విద్యుత్ సౌధ, జలసౌధ లాంటి ప్రాంతాల్లో ఏపీ ఎన్జీవోలు - టీఎన్జీవోల మధ్య పలు సందర్భాల్లో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement