స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణలోని పోలీసులకు కేంద్రం గురువారం అవార్డులను ప్రకటించింది. 15 మందికి రాష్ట్రపతి పోలీసు శౌర్య సేవా పతకాలు,
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణలోని పోలీసులకు కేంద్రం గురువారం అవార్డులను ప్రకటించింది. 15 మందికి రాష్ట్రపతి పోలీసు శౌర్య సేవా పతకాలు, 163 మందికి శౌర్య పతకాలు, 82 మందికి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, 659 మందికి పోలీసు మెరిటోరియస్ సేవా పతకాలను అందజేయనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇద్దరికి పోలీసు శౌర్య, ముగ్గురికి రాష్ట్రపతి పోలీసు సేవా పతకాలు, 26 మందికి పోలీసు మెరిటోరియస్ సేవా పురస్కారాలు అందుకోనున్నారు.
పోలీసు శౌర్య సేవా పతకం: వై.అప్పల నాయుడు(జూనియర్ కమాండో), డి.రమేష్(సబ్ ఇన్‌స్పెక్టర్). రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం: ఎ.బి. వెంకటేశ్వరరావు, డీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్), ఉమేష్ షరీఫ్, అడిషనల్ డీజీపీ, జి. దయానంద్, అసిస్టెంట్ కమాండెంట్.