కొనసాగుతున్న ఎన్‌జీఓల దీక్షలు | AP NGOs Strike for Samaikyandhra | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఎన్‌జీఓల దీక్షలు

Feb 12 2014 2:23 AM | Updated on Sep 2 2017 3:35 AM

సమైక్యాంధ్రకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట ఎన్‌జీఓలు. రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి.

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట ఎన్‌జీఓలు. రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. ఒకవైపు కార్యాలయాల్లో విధులను అడ్డుకుంటూనే...దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. త్యాగాలు చేసి అయినా సమైక్యాంధ్రను కాపాడుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రొంగలి ఎర్రన్నాయుడు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విడదీయాలని చూడడటం దుర్మార్గమన్నా రు. కొన్ని పార్టీల నాయకులు ద్వంద్వ ప్రమాణాలు అవలంభించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.     ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా సమైక్య వాణి విన్పించాలన్నారు. కాగా దీక్షలకు విశాలాంధ్ర మహా సభ నాయకలతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.  
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement