
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ ప్రభుత్వం భద్రతను ఏర్పాటు చేసింది.
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ ప్రభుత్వం భద్రతను ఏర్పాటు చేసింది. పవన్‌కు భద్రతగా ఉండేందుకు నలుగురు గన్‌మెన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు సభ సమయంలో సెక్యూరిటీ కావాలని పవన్ కల్యాణ్ ఏపీ డీజీపీని కోరారు.
దీంతో నలుగురు గన్‌మెన్లను రెండు షిఫ్ట్‌ల్లో ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల గుంటూరులో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ప్రభుత్వంపై పవన్‌కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.