సీఎం వైఎస్‌ జగన్‌: ఆర్టీసీ వీలీనంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | AP Govt Appointed Special Working Group to Merge APSRTC - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ వీలీనంపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

Oct 24 2019 9:16 PM | Updated on Oct 25 2019 11:28 AM

AP Government Appointed Working Group On APSRTC Merging - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీఎస్‌ఆర్టీసీ వీలీనంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ  వర్కింగ్‌ గ్రూప్‌లో ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయశాఖకు చెందిన ఏడుగురు అధికారులు ఉన్నారు. ప్రజా రవాణాశాఖ, పోస్ట్‌లు, డిజిగ్నేషన్ల ఏర్పాట్లపై ఈ వర్కింగ్‌ గ్రూప్‌ దృష్టి  సారించనుంది. జీతాల చెల్లింపులు, పేస్కేల్‌ వంటి అంశాల్లో విధివిధానాలు ఖరారు చేయనున్నారు. వచ్చే నెల 15నాటికి పూర్తి నివేదిక ఇవ్వాలని వర్కింగ్‌ గ్రూప్‌కు ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement