
మంత్రులపై చంద్రబాబు అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ మంత్రుల జిల్లాల పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రుల జిల్లాల పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ ముగ్గురు మంత్రులు జిల్లా పర్యటనలు పూర్తి చేయకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మునిసిపాలిటీలలోని ప్రజాసమస్యలను మంత్రులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. సన్మానాల కోసం వెళ్తున్నారు తప్ప.. మౌలిక సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఇకనైనా సమస్యలు పట్టించుకోవాలని మంత్రులకు తలంటారు.
ఏప్రిల్ 1 నుంచి కుటుంబంలో ఉండే ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జన్మభూమి కమిటీల ద్వారా రేషన్ కార్డులు తనిఖీ చేయించాలని నిర్ణయించారు. పింఛనుకూడా జన్మభూమి కమిటీ ద్వారానే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.