బ్రాహ్మణితో మాట్లాడించి.. రోజాకు నిర్బంధమా? | ambati rambabu fires on chandrababu over mla roja detention | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణితో మాట్లాడించి.. రోజాకు నిర్బంధమా?

Feb 11 2017 8:30 PM | Updated on Oct 29 2018 8:08 PM

బ్రాహ్మణితో మాట్లాడించి.. రోజాకు నిర్బంధమా? - Sakshi

బ్రాహ్మణితో మాట్లాడించి.. రోజాకు నిర్బంధమా?

జాతీయ మహిళా సదస్సుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి.. మరీ నిర్బంధించిన ఏపీ ప్రభుత్వం తీరును ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర తప్పబట్టారు.

గుంటూరు: జాతీయ మహిళా సదస్సుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి.. మరీ నిర్బంధించిన ఏపీ ప్రభుత్వం తీరును ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర తప్పబట్టారు. రోజాను ఆహ్వానించి మరీ అవమానించారని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో మహిళా సదస్సులో మాట్లాడించి.. ఎమ్మెల్యే అయిన రోజాను ఎందుకు నిర్బంధించారని ఆయన ప్రశ్నించారు.

ఈ సదస్సు మహిళల గౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడేది కాదని ఈ చర్యతో తేలిపోయిందన్నారు. చంద్రబాబు పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా వాడుకోవడం మంచిది కాదని హితవు పలికారు. వెంకయ్యనాయుడు డోలు నాయుడుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, మోదీ గురించి డోలు కొట్టడమే వెంకయ్య పని అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement