వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం బద్రిపల్లె గ్రామంలో జరుగుతున్ననీరు చెట్టు కార్యక్రమ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది.
చాపాడు: వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం బద్రిపల్లె గ్రామంలో జరుగుతున్ననీరు చెట్టు కార్యక్రమ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో కాల్వలో పూడికతీత పనులు చేస్తుండగా ఓ జేసీబీ బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రాముడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాముడు కర్నూలు జిల్లా ఢోన్ నివాసి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.