ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్టు వద్ద సోమవారం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాల య్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.