పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఏడుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఏడుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటోను వంగూరు క్రాస్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని జీపు వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్పంగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఏలూరు ఆస్పత్రికి తరలించారు. బాధితులు లింగపాలెం మండలం సింగగూడెం గ్రామానికి చెందిన వారు. వీరంతా ఏలూరులో జరిగే వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.