విశాఖలో భారీగా గంజాయి పట్టివేత | 424 kgs of marijuana seized | Sakshi
Sakshi News home page

విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

Jul 11 2016 3:16 PM | Updated on Aug 20 2018 3:54 PM

విశాఖ జిల్లాలో అధికారులు పెద్దమొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం మధ్యాహ్నం బొర్రా జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.

అరకు (విశాఖపట్టణం) : విశాఖ జిల్లాలో అధికారులు పెద్దమొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం మధ్యాహ్నం బొర్రా జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హుకుంపేట నుంచి గంజాయిని తరలిస్తున్న లారీ పట్టుబడింది. అందులోని 312 ప్యాకెట్లలో ఉన్న సుమారు 424 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారంతా వరంగల్ జిల్లాకు చెందినవారుగా భావిస్తున్నారు. గంజాయిని లారీ సహా సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై యు.నాగేశ్వరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement