సిలిండర్ పేలిన ఘటనలో చికిత్స పొందుతూ ముగ్గురి మృతి | 3 people died in gas cylinder explosion | Sakshi
Sakshi News home page

సిలిండర్ పేలిన ఘటనలో చికిత్స పొందుతూ ముగ్గురి మృతి

Nov 19 2013 9:12 AM | Updated on Sep 2 2017 12:46 AM

కృష్ణాజిల్లా కైకలూరులో ఈ నెల 11న గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిలో ముగ్గురు ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు.

కృష్ణాజిల్లా కైకలూరులో ఈ నెల 11న గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిలో ముగ్గురు ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తోట నాగరాజు, అడపా సుబ్బలక్ష్మీ, సరోజినిలు మృతి చెందారు.

 

ఈ నెల11వ తేదీన కైకలూరులో వంట వండుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి సిలండర్ పేలింది. ఆ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలన నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో వారిని వైద్య సహయం కోసం విజయవాడ తరలించగా, అక్కడ చికిత్స పొందుతు మంగళవారం తెల్లవారుజామున మరణించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement