గుంటూరు జిల్లాలో ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో 28వ తేదీ తరువాత ప్రభుత్వం భూసేకరణకు చర్యలు తీసుకుంటుందని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు.
రాష్ట్ర మంత్రి నారాయణ
తాడికొండ: గుంటూరు జిల్లాలో ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో 28వ తేదీ తరువాత ప్రభుత్వం భూసేకరణకు చర్యలు తీసుకుంటుందని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో మంగళవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ భూసమీకరణ గడువు పెంపు యోచనే లేదన్నారు.
ఇప్పటివరకు ప్రభుత్వం 24,200 ఎకరాల భూమిని సమీకరించిందన్నారు. భూ సేకరణకంటే భూ సమీకరణతోనే రైతులకు మేలు కలుగుతుందన్నారు. అనంతరం సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలసి స్థానిక రైతులు, నాయకులతో పలు అంశాలపై చర్చించారు.