ఎదరురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
విడవలూరు: ఎదరురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామ శివారులో శనివారం జరిగింది. నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రామతీర్థం వెళ్తుండగా.. గ్రామం నుంచి ప్యాసింజర్ ఆటో నెల్లూరు వెళ్తోంది.. గ్రామ శివారుకి రాగానే ఆటో ఒక్కసారిగా బస్సును ఢీకొనడంతో.. ఆటో నుజునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. కాగా.. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.