18న చలో పార్లమెంట్ :కృష్ణయ్య | 18th to parliament : krishnaiah | Sakshi
Sakshi News home page

18న చలో పార్లమెంట్ :కృష్ణయ్య

Feb 10 2014 12:10 AM | Updated on Mar 9 2019 3:34 PM

18న చలో పార్లమెంట్ :కృష్ణయ్య - Sakshi

18న చలో పార్లమెంట్ :కృష్ణయ్య

బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 18న ‘చలో పార్లమెంట్’ చేపడుతున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య వెల్లడించారు.


 హెదరాబాద్, న్యూస్‌లైన్: బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 18న ‘చలో పార్లమెంట్’ చేపడుతున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య వెల్లడించారు. స్థానిక బీసీ భవన్‌లో ఆదివారం జరిగిన సంఘం కోర్ కమిటీ భేటీలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు అన్ని పార్టీలూ అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీలుగా పుట్టడమే పాపమైనట్టుగా ఉందన్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున జాతీయ పార్టీల నాయకులను, ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాను కలిసి డిమాండ్లపై చర్చిస్తామన్నారు. సమావేశంలో జె. శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement