పిట్టల్లా రాలుతున్న జనం


జిల్లాలో వడగాడ్పుల ప్రభంజనం కొనసాగుతోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కళ్లముందే అయినవారు కన్ను మూస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. శనివారం ఒక్కరోజే 16 మంది కన్నుమూశారు.

 

 సారవకోట:

 మండల కేంద్రంలోని కొత్తపేట వీధికి చెందిన  కరిమిల్లి రమణమ్మ(65) ఎండ వేడిని తాళలేక శనివారం మృతి చెందినట్లు కుమారులు కరిమిల్లి రామచంద్రరావు, సూర్యనారాయణలు తెలిపారు. ఉదయం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు వారు తెలిపారు. అలాగే కేళవలస గ్రామానికి చెందిన కల్యాణం శిమ్మమ్మ(63) కూడా వడదెబ్బతో మృత్యువాత పడినట్టు సర్పంచ్ ప్రతినిధి చిన్నాల అప్పన్న తెలిపారు. ఈ మృతులపై తమకు ఫిర్యాదు అందలేదని తహశీల్దార్ ఉమామహేశ్వరరావు తెలిపారు.

 

 పోలాకి: ప్రియాగ్రహారం గ్రామానికి చెందిన పట్నాన జనార్దనరావు (70) ఎండతీవ్రతకు తాళలేక ఇంటివద్ద మృతి చెందినట్లు కుటుంబసభ్యులు సుబ్బారావు, సోములు తెలిపారు. ఉదయం టిఫిన్‌చేసిన తరువాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని, చికిత్స చేయించినా ఫలితంలేకపోయిందని వారు చెప్పారు. విషయాన్ని గుప్పెడుపేట పీహెచ్‌సీ వైధ్యాధికారి బలగమురళి, తహశీల్దార్ జె.రామారావు దృష్టికి తీసుకెళ్లినట్టు సర్పంచ్ లావేటి కృష్ణారావు చెప్పారు.

 

 సరుబుజ్జిలి: వడగాల్పులు తట్టుకోలేక పెద్దపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు మురాల మహాలక్ష్మి(75) చనిపోయినటుట సర్పంచ్ గజ్జన వీరమ్మ తెలిపారు. మద్యాహ్నం 12 గంటలకు బహిర్భూమి కోసం వెళ్లివ

 చ్చిన తరువాత కుప్పకూలిపోయినట్లు పేర్కొన్నారు.

 

 సంతకవిటి :  పనసపేట గ్రామానికి చెందిన పైడి చిన్నమ్మడు (65), గోళ్లవలస పంచాయతీకి చెందిన చింతాడ రామయ్య (70) వడగాడ్పులు తట్టుకోలేక చనిపోయినట్టు వారి కుటుంబీకులు తెలిపారు. పొందూరు: స్థానిక పార్వతీనగర్ కాలనీలో ఉంటున్న చేనేత కార్మికురాలు మానెం సోమమ్మ ఎండ తీవ్రతకు తట్టుకోలేక మృతి చెందింది. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా చేనేత, జౌళీ శాఖ ఏడి గుత్తు రాజారావు శనివారం పరిశీలించారు. వివరాలు సేకరించి కలెక్టర్ లక్ష్మీనరసింహానికి ఫోన్‌లో చెప్పారు. ఆయనతో పాటు సాయిబాబా చేనేత సొసైటీ అధ్యక్షులు అప్పలరాజు, ఈఓ కె.మోహన్‌బాబు, జన్మభూమి కమిటీ సభ్యులు చిగిలిపల్లి రామ్మోహనరావు, వార్డు మెంబర్ అనకాపల్లి నాగమణి ఉన్నారు. చేనేత, జౌళీశాఖ ఏడి గుత్తు రాజారావు వెయ్యి రూపా

 యలను దహన సంస్కార ఖర్చులకు అందజేసారు.  

 

 వీరఘట్టం: స్థానిక గొల్లవీధికి చెందిన వృద్ధురాలు వూళ్ల తవిటమ్మ (65) వడదెబ్బతో మృతి చెందింది.  రెండు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఈమెకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని, శనివారం ఎండతీవ్రత ఎక్కువ కావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

 రాజాం మండలంలో ముగ్గురు

 రాజాం: రాజాంలో శనివారం వడదెబ్బతో  ముగ్గురు మృతి చెందారు. గురవాం గ్రామానికి చెందిన గురవాన సూర్యనారాయణ (65) పొయ్యి కర్రలు తీసుకురావడానికి పొలంలోకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రాజాం పట్టణంలోని మెంతిపేట ఎస్సీ కాలనీలో కంఠా చంద్రుడు(65), అంపోలు సింహాచలం(68) వడదెబ్బకు తాళలేక మృతి చెందారు. సంతకవిటి:  మోదులపేటకు చెందిన లావేటి త్రినాథ(65) వడదెబ్బకు గురై శుక్రవారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం తహశీల్దార్ కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినట్టు ఎంపీటీసీ సభ్యులు కనకం సన్యాసినాయుడు తెలిపారు.  

 

 కోటబొమ్మాళి : రెడ్డిక వీధికి చెందిన కమ్మకట్టు లక్ష్మణరావు (27) వడదెబ్బకు గురై మృతి చెందాడు. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చెరువు వైపు బహిర్భూమికి వెళ్లి స్పృహా తప్పి పడిపోయాడు. వెంటనే స్దానిక సామాజిక హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీఆర్‌ఓ కె.నాగేశ్వరరావు తహశీల్దార్ వై.శ్రీనివాసరావుకు సమాచార మివ్వగా తహాశీల్దార్, ఎస్.ఐ జి.నారాయణస్వామి హాస్పిటల్‌కు చేరుకోని శవపంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మెళియాపుట్టి: భర ణికోట జక్కరవీధి గ్రామానికి చెందిన సవర బాలాజీ(36) వడగాల్పులతో మృతిచెందాడు. శుక్రవారం

 

 అస్వస్థతకు గురైన ఈయన్ని శనివారం ఉదయం వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. తహశీల్దార్ జె.చలమయ్య బాలాజీ మృతదేహాన్ని పరిశీలించారు. నందిగాం: లఖిదాసుపురం గ్రామానికి చెందిన శాసనపురి అప్పలనరసమ్మ (44)  వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఉంటూ ఉక్కపోత, వేడి గాలికి తట్టుకోలేక మృతి చెందినట్లు చెప్పారు. తహళీల్దారుతోపాటు ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ కోదండరావు, ఎస్సై సీహెచ్ ప్రసాద్ గ్రామానికి చేరుకొన్నారు. అయితే ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ కోదండరావు మృతురాలిని పరీక్షించారు. వడదెబ్బతోనే మృతిచెందినట్లు నిర్ధారించారు.పొందూరు: పిల్లలవలస గ్రామానికి చెందిన గురుగుబెల్లి లచ్చన్న(70) వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు.  ఆర్‌ఐ మధు

 సూదనరావు, వీఆర్వో మురళి వివరాలు సేకరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top