నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని గురుకుల జూనియర్ కళాశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించింది.
నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని గురుకుల జూనియర్ కళాశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో అక్కడి విద్యార్థులు 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ వెంకటగిరిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.