ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
రెండు ఆటోలు ఢీ.. 11 మందికి గాయాలు
Mar 5 2016 1:08 PM | Updated on Aug 30 2018 3:58 PM
మదనపల్లి: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం సర్కారు తోపు వద్ద శనివారం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ప్యాసింజర్ ఆటోలు ఢీకొనడంతో వాటిలో 11 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement