breaking news
-
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్లు కథలు చెబుతున్నారా? ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారా? వీరికన్నా ఐపీఎస్‌లే మెరుగ్గా ఉన్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్లో అర్థమేమిటి? ప్రతిగా కలెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తామని అనడం పరోక్షంగా ఎద్దేవా చేసినట్లా?. ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం కొత్త కాదు. కానీ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే అందులో ఆయన సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటారు. తనకు అన్ని అంశాలపై అపారమైన పట్టు ఉందని అనిపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ఎక్కువ సార్లు ఇవి కాలక్షేపం సమావేశాలుగా మిగిలిపోతున్నాయన్న భావన అధికార వర్గాలలో ఉంది. .. కొద్ది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి ఉపన్యాసాలు చెప్పవద్దని అనడం. ప్రజెంటేషన్స్ ఇవ్వద్దని సూచించడం విశేషం. నిజానికి ఇలాంటి వాటిల్లో చంద్రబాబు ఒక ప్రత్యేకత సాధించారని అంటారు. ఉపయోగం ఉన్నా.. లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఇచ్చినన్ని అంకెల ప్రజెంటేషన్లు మరెవ్వరూ ఇచ్చి ఉండకపోవచ్చు. వాటిలో ఎక్కువ భాగం కాకి లెక్కలే. పొంతన లేకుండా అంకెలు చెప్పేస్తూంటారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని కాదు కానీ ప్రజలను గందరగోళపరిచి తను రాజకీయంగా లబ్ది పొందడం లక్ష్యంగా ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ధోరణి అలాగే ఉంటుంది. 👉మంచి జరిగితే తన ఖాతాలోకి, తప్పు జరిగితే అధికారుల అకౌంట్లలోకి జమ చేయడం ఆయన వైఖరి. కావచ్చు. కొన్ని జిల్లాల తలసరి ఆదాయం బాగోలేదని అంటూ కోనసీమ గురించి ప్రస్తావించారు. ఏలూరు జిల్లా తలసరి ఆదాయం బాగుందట. నిజంగానే అక్కడ అభివృద్ది జరిగి ఆదాయం పెరిగిందా? లేదంటే చంద్రబాబుకు నచ్చుతుంది కనుక ఆ విధంగా అంకెలు తయారు చేశారా? అనేది చెప్పలేం. చంద్రబాబు మాట్లాడితే వృద్ది రేటు అని అంటారు. అదేమిటో మామూలు ప్రజలకు అర్థం కాదు. కానీ పదే, పదే వాడడం ద్వారా ఏదో జరుగుతోందన్న భావన కలిగించడం ఆయన లక్ష్యం. పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తేనే సంక్షేమం, అభివృద్ది చేయగలుగుతామని చంద్రబాబు చెప్పారు. అది నిజమే అనుకుందాం. కానీ ఇంత సీనియర్ అయిన చంద్రబాబుకు ఎన్నికల ముందు ఆ విషయం తెలియదా? ఇష్టం వచ్చిన రీతిలో హామీలు అడ్డగోలుగా ఎలా ఇచ్చారు? అనే ప్రశ్నకు ఏనాడైనా జవాబు ఇచ్చారా? కలెక్టర్లకు ఆ విషయం తెలియదా? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలు ఎన్ని కథలు చెప్పింది వారు కూడా వినే ఉంటారు కదా? ఇప్పుడు దాన్నంతా కలెక్టర్ల మీద తోసేసి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదా?.👉ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక, వండర్ పుల్ సర్, మిరాకిల్ సర్ అని వారు చెప్పవచ్చు. అనవచ్చు. కాని అర్థం చూస్తే అవేవో జరగడం సాధ్యం కాని అద్భుతాలు అన్నమాట. వాటిపై సీఎం కథలు చెబుతూ తమను అలా అంటారేమిటని కలెక్టర్లు అనుకోకుండా ఉంటారా! కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సైతం గత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, తోచినన్ని అబద్దాలు చెప్పడం, చివరికి వివేక హత్య కేసు వంటివాటిని కూడా అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన యత్నించారు. కలెక్టర్లు మెదడుకు పదును పెట్టాలని అంటున్నారు. ఎక్కువ సందర్భాలలో కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికే టైమ్ చాలదు. అందులోను మారిన రాజకీయ వాతావరణంలో కూటమి నేతల పైరవీలను తట్టుకోవడమే కలెక్టర్లకు ఇతర అధికారులకు పెద్ద సవాల్ అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 👉ఆయా చోట్ల అధికారులపై దురుసుగా వ్యవహరిస్తున్న కూటమి ఎమ్మెల్యేలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. వాటిపై స్పందించలేని నిస్సహాయ స్థితిలో కలెక్టర్లు ఉంటున్నారు. లేకుంటే ఒక తెలుగుదేశం పత్రిక కొందరు ఐఎఎస్‌ల భార్యలు స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారని, ఆయా పనులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక కథనాన్ని ఇస్తే.. ఐఎఎస్ అధికారుల సంఘం కనీసం ఖండించినట్లు లేదు. చంద్రబాబు కార్యాలయం దానిపై స్పందించలేదు. దీన్ని బట్టే ఐఎఎస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్(Red Book) పిచ్చిగోలకు భయపడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే కొందరు ఐఎఎస్, ఐపిఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా, ఎదురు కేసులు పెడుతూ, సస్పెన్షన్లు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న తీరు ఎదురుగా కనిపిస్తున్నప్పడు వారు మాత్రం ఏమి చేస్తారు?. ప్రజా ప్రతినిధులను కలుపుకుని వెళ్లండి, సొంతంగా ఆలోచించండి, సమస్యలు పరిష్కరించి క్రెడిట్ రాజకీయ నేతలకు ఇవ్వండని చంద్రబాబు అంటున్నారు. అంటే గతంలో చెప్పిన రాజకీయ పాలనను పరోక్షంగా మరోసారి చెప్పడమే కదా! కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కలెక్టర్లను సొంతంగా పని చేసుకోనివ్వడం లేదని ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. 👉ఉదాహరణకు.. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఎక్సైజ్ కార్యాలయంలో తిష్టవేసి నిరసన చెబితే అధికారులు ఏమీ చేయలేకపోయారు. అసెంబ్లీలో సీఎం ఆఫీస్ వద్దే విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అధికారులపై దూషణలకు దిగినా అదేమిటని ప్రశ్నించ లేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఐఏఎస్‌లకన్నా ఐపీఎస్‌లు నచ్చారట. అవును..నిజమే.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను సంతోషపెడుతున్నందున బహుశా వారే బాగా నచ్చారేమో!. 👉ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వంపై అప్పుల విషయంలో ఎన్ని అసత్యాలు చెప్పారో అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చాక సైతం అవే అబద్దాలను కొనసాగిస్తున్నారు. సంపద సృష్టిస్తానని, అప్పులు చేయనని చెప్పేవారు. కాని ఇప్పుడు ఏమంటున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలుకు కొంతమేర అప్పులు చేస్తామని చెబుతున్నారు. కలెక్టర్లు, ఐఏఎస్‌లు దీనిని గమనించలేనంత అమాయకులా?. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తిడుతుంటే దానికి కలెక్టర్లు ఎలా జవాబుదారి అవుతారు?. ఎన్నికల సమయంలో చెప్పిన హామీల అమలుకు నిధులు కేటాయించి, వాటిని విడుదల చేస్తే, అప్పుడు అమలు చేయకపోతే కలెక్టర్లు బాధ్యులవుతారు తప్ప, నిధులు ఇవ్వకుండా సీఎం అది చేయండి.. ఇది చేయండి అని చెబితే వారు కూడా ఎస్ సార్ అంటూ వినయం నటించక తప్పదు కదా!. గతంలో జగన్ టైమ్‌లో హామీలు, స్కీమ్‌ల వారీగా సమీక్షలు చేసేవారు ఎన్నికల మానిఫెస్టోని వారి ముందు పెట్టి ఏ మేరకు అమలు చేయగలిగాం.. ఎంత ఖర్చు అయింది? ఎంత డబ్బు అవసరం అన్నదానిపై చర్చించి విడుదల చేసేవారు. అలా సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికను అధికారులకు ఇచ్చి అమలు చేయాలని చెప్పే సాహసం చంద్రబాబు చేయగలరా?. మాట్లాడితే అధికారుల ఆలోచన తీరు మారాలని చెబుతారు?. అదేమిటో చెప్పరు! పడికట్టు పదాలు వాడి ప్రసంగం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. తల్లికి వందనం కింద మే నెలలో డబ్బులు ఇస్తామని అంటున్నారు. అది ఇప్పుడు గడచిపోయిన సంవత్సరానికా? లేక వచ్చే సంవత్సరానికా అని జనం అడిగితే అధికారులు ఏమి చెప్పాలి? పైగా స్కూళ్లు తెరవక ముందే పిల్లలందరికి డబ్బులు ఇస్తామని అనడంలో మతలబు ఏమిటి? జూన్ లో కొత్తగా నమోదయ్యే పిల్లలకు కూడా ఇస్తారా? ఇవ్వరా? ఇలాంటి వాటిపై కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఇదే సమస్య అన్నదాత సుఖీభవ స్కీముకు కూడా వస్తుంది కదా?. 👉అమరావతి నిర్మాణంపై కూడా పాత అసత్యాలే మళ్లీ చెప్పినట్లు అనిపిస్తుంది. ఒకపక్క బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు పెట్టి, రూ.31 వేల కోట్ల వరకు అప్పు తెచ్చి వ్యయం చేస్తున్నా, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో రోడ్లు తదితర నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నట్లుగా ఉంది. కలెక్టర్లు.. అధికార దర్పం వద్దని చంద్రబాబు అన్నారట. అంటే ఏమిటి? మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని వచ్చినా, టీడీపీ ఐడీ కార్డులు పెట్టుకుని వచ్చినా, వారికి ఎదురేగి స్వాగతం పలకాలని సూచించడమా? లేక వైఎస్సార్సీపీ అభిమానులు ఎవరైనా తమ సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వారికి ఏమీ చేయవద్దని చెప్పడమా? ఆయన మనసులోని మాటను గుర్తెరిగి అధికారులు వ్యవహరిస్తే సరిపోతుందా? ఏపీలో మాట ఇచ్చినట్లే మంచి పాలన జరుగుతోందని చంద్రబాబు అన్నట్లుగా ఎల్లో మీడియా బానర్ కథనాలు ఇచ్చినంత మాత్రాన వాస్తవాలు అధికారులకు తెలియకుండా ఉంటాయా? నిజమే..అధికారులు క్షేత్ర స్థాయిలో బాధ్యతగా ఉండాలి. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చాలి. అంతవరకు చంద్రబాబు అయినా, మరెవరైనా చెప్పడం తప్పు కాదు. కాని తాము ఇచ్చిన హామీలన్నిటికి ఐఏఎస్ అధికారులు జవాబుదారులు అయినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను వారిపైకి నెట్టివేస్తే, అర్థం చేసుకోలేని అమాయకులుగా అధికారులు ఉండరు కదా! కాకపోతే ఇప్పటికైతే ప్రభుత్వ పెద్దలు చేసే అవమానాలను మౌనంగా భరించక తప్పదేమో!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పోలీసుపై రెడ్ బుక్ రూల్
టీడీపీ కూటమి పెద్దల పైశాచికత్వం..శాంతిభద్రతలు అస్తవ్యస్తం ఓవైపు వేటు వేసి.. మరోవైపు కొత్తవారు కావాలంటూ కేంద్రానికి లేఖలు ‘రెడ్‌బుక్ కుట్ర’కు సెల్యూట్ చేస్తేనే పోస్టింగ్... నిబంధనలు పాటిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్’ తాము చెప్పినవారిని వేటాడితేనే పోస్టింగ్.. విధులు నిక్కచ్చిగా నిర్వర్తిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్.. పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తామంటేనే పోస్టింగ్.. ఖాకీ చొక్కా వేసుకున్నాం కదా .. చట్టం ముందు అందరూ సమానం అంటే మాత్రం నో పోస్టింగ్..ఇదీ పోలీసు శాఖపై చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తున్న దుర్నీతి. సాక్షి, అమరావతి: సీనియర్ అధికారులను.. వెంటాడి వేటాడి పోస్టింగ్‌లు ఇవ్వకుండా మనో వ్యథకు గురిచేస్తూ.. మంచి అధికారులను కుట్రలు చేసి పక్కనపెట్టి పాలన సాగిస్తూ.. ఉన్న అధికారులను రెడ్ బుక్ రూల్ కోసం వాడుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. శాంతిభద్రతల పరిరక్షణకు ఉద్దేశించిన పోలీసు వ్యవస్థతో ఆడుకుంటోంది. రాజకీయ స్వార్థంతో భ్రషు్టపట్టిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉందన్నదీ సంబంధం లేకుండా విధులు నిర్వర్తించే పోలీసులపై కక్ష కట్టి వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల తర్వాత కూడా రాష్ట్రంలో ఏకంగా 199 మంది పోలీస్ అధికారులకు పోస్టింగులు లేవంటే రెడ్ బుక్ కుట్ర ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. ⇒ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే పోలీస్ శాఖలో హోదా ఉన్న అధికారే. అయితే, చంద్రబాబు ప్రభుత్వ వేధింపులకు బలైనవారిలో అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులే కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే నలుగురు ఐపీఎస్‌లు, నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలు ఉండడం గమనార్హం. వీరందరికీ పోస్టింగులు ఇవ్వలేదని సాక్షాత్తు రాష్ట్ర శాసనసభకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఇంతమంది పోలీసు అధికారులను వెయిటింగ్లో ఉంచడం దేశ చరిత్రలోనే లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక కక్షపూరితంగా ఐదుగురు ఐపీఎస్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది కూడా.వెయిటింగ్లో నలుగురు ఐపీఎస్‌లు2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యలకు తెగించింది. 24 మంది ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. అధికారంలో ఉన్న పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ విధానాలను అమలు చేసే ఐపీఎస్‌పై ప్రతాపం చూపించింది. ఐదు నెలల తరువాత దశలవారీగా కొందరు ఐపీఎస్‌లకు అదీ అప్రాధాన్యమైన పోస్టింగులు ఇచ్చింది. కానీ, నేటికీ నలుగురిని వెయిటింగ్‌లోనే ఉంచింది. సీనియర్ ఐపీఎస్‌లు కొల్లి రఘురామ్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, జాషువాలు అందుబాటులో ఉన్నా సరే వారి సేవలను వినియోగించుకోవడం లేదన్నది సుస్పష్టం.కుట్ర పన్ని.. కక్షకట్టి రెడ్‌బుక్ కుట్రతో ఐదుగురు ఐపీఎస్‌లపై చంద్రబాబు ప్రభుత్వం కక్షకట్టింది. సీనియర్ ఐపీఎస్‌లు పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్‌కుమార్, ఎన్.సంజయ్, టి.కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేసింది. వలపు వల విసిరి బడా బాబులను బ్లాక్‌మెయిలింగ్ చేయడమే పనిగా పెటు్టకున్న కాదంబరి జత్వానీ అనే ముంబై మోడల్‌తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేయడం అందర్నీ విస్మయపరిచింది. ⇒ చంద్రబాబు రాజగురువు రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను వెలికితీశారనే కక్షతోనే ఎన్.సంజయ్‌పై అక్రమ కేసులు బనాయించి సస్పెండ్ చేశారు. కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కళ్లల్లో ఆనందం చూడడం కోసం డీజీ పీవీ సునీల్‌కుమార్‌ను వివరణ కూడా కోరకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించిన అభియోగాలపై ఆయనను సస్పెండ్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం.తమ కుట్రల అమలు కోసం కేంద్రానికి లేఖలు ఉన్న అధికారులనేమో వేధిస్తూ.. తమకు మరో ముగ్గురు ఐపీఎస్‌లు కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. మరీ ముఖ్యంగా యూపీ కేడర్‌లో పనిచేస్తున్న అధికారి కోసం పట్టుబడుతోంది. ఆయనైతే తమ కుట్రల అమలుకు, ప్రత్యర్థులను వేటాడేందుకు సమర్థంగా ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. అయితే, డిప్యూటేషన్ నిబంధనలు అనుమతించకపోవడంతో కేంద్రం నుంచి స్పందన రాలేదు. కీలకమైనప్పటికీ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే క్షేత్రస్థాయి పోలీసులను కూడా చంద్రబాబు సర్కారు వేధిస్తోంది. నాన్ క్యాడర్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు కలిపి మొత్తం 195 మందికి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి పోస్టింగులు ఇవ్వకపోవడమే దీనిని నిదర్శనం. పాలనాపరమైన అంశాలతో నలుగురైదుగురిని స్వల్ప కాలం వెయిటింగ్లో ఉంచడం సాధారణం. తర్వాత ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సద్వినియోగం చేసుకోవడం రివాజు. ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసింది. ఇలా పక్కనపెట్టినవారిలో నాన్ క్యాడర్ ఎస్పీలు పి.సత్తిబాబు, పి.వెంకటరత్నం, బి.లక్ష్మీనారాయణ, ఎ.సురేశ్‌బాబు ఉన్నారు. 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలనూ వెయిటింగ్లో పెట్టింది.జీతాలివ్వకుండా ‘పచ్చ’ పైశాచికత్వం ఏకంగా 199 మంది పోలీసులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. వెయిటింగ్లో ఉన్నారని చెప్పి వీరికి 10 నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఆర్ధికంగా పోలీసు అధికారులు ఇబ్బందులు పడుతూ ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీసు అధికారులు ఇంతటి దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
పోలీసులు పచ్చచొక్కాలు తొడుక్కున్నారు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం మేయర్ పదవిని అడ్డదోవలో దక్కించుకునేందుకు కూటమి పార్టీలు చేస్తున్న కుట్రలకు పోలీసులు పావులుగా మారుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం సందర్బంగా పోలీసులతో వైఎస్సార్సీపీ కార్పోరేటర్లను ప్రలోభపెట్టడం, భయపెట్టడానికి తెలుగుదేశం నేతలు చేస్తున్న ప్రయత్నాలపై వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.అనంతరం కలెక్టరేట్ బయట గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ అధికారులు పచ్చచొక్కాలు వేసుకున్నట్లుగా రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను అతిక్రమించి పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ కార్పోరేటర్ల ఇళ్ళకు అర్ధరాత్రి సమయాల్లో వెళ్ళి మహిళలను బెదిరించడం దారుణమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి అరాచకాలకైనా పాల్పడవచ్చుననే ధీమాతో కూటమి నేతలు ఉన్నారు. వైఎస్సార్సీపీ మేయర్‌పై తెలుగుదేశం పార్టీకి మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోయినప్పటికీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన కొందరిని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకున్నారు. ఎన్ని చేసినప్పటికీ వైఎస్సార్సీపీకి చాలా స్పష్టమైన మెజారిటీ ఉంది. అయినా కూడా ఏదో ఒకటి చేసి మేయర్ పదవిని చేజిక్కించుకోవాలనే కుట్రతో కూటమి పార్టీలు పనిచేస్తున్నాయి.ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ కార్పోరేటర్లను బెదిరిస్తున్నారు. నిన్న ఒక కార్పోరేటర్ ఇంటికి రాత్రి సమయంలో పోలీసులను పంపి, వారి కుటుంబసభ్యులను బెదిరించారు. మహిళలను పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఒత్తిడి చేశారు. పోలీసులు చట్టాలను కాపాడటానికి ఉన్నారా? తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేందుకు ఉన్నారా? ఖాకీ దుస్తులు తీసేసి, పచ్చచొక్కాలతో తెలుగుదేశం పార్టీకి సెక్యూరిటీ ఏజెన్సీగా పనిచేస్తున్నారా? దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం.సత్తా ఉంటే అవిశ్వాసంలో బలం నిరూపించుకోవాలిఅవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం తమ బలం ఏమిటో నిరూపించుకోవాలి. భయపెట్టి, పోలీసులతో బెదిరింపులకు గురి చేసి పదవులను దక్కించుకోవాలని అనుకుంటున్నారు. ఎల్లకాలం పరిస్థితులు ఇలాగే ఉంటాయని అనుకోవద్దు. రాజకీయాల్లో మార్పు సహజం. అధికార యంత్రాంగం పనిచేయాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదు. అంబేద్కర్ రాజ్యాంగం పరిధిలో పనిచేస్తారా? లేక లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం కోసం పనిచేస్తున్నారా?విలువైన భూములను ప్రైవేటుపరంవిశాఖలోని విలువైన పదిహేను వందల కోట్ల రూపాయల భూములను లులూ సంస్థకు ఏకంగా తొంబై తొమ్మిది సంవత్సరాలకు నామమాత్రపు లీజుకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే? ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంలో మీకున్న ప్రయోజనాలు ఏమిటీ? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పీ4 అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. -
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
సాక్షి, గుంటూరు: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గుండె నొప్పితో బాధపడుతున్నారని.. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని.. ఈ వ్యవహారాన్ని టీడీపీ ట్రోల్ చేస్తూ వికృత ఆనందాన్ని పొందుతుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఆయన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్‌లో ఆపరేషన్ చేస్తే ఒత్తిడి పెరుగుతుందని భావంతో ఆయన్ను ముంబైకి తీసుకువెళ్లారని అంబటి వివరించారు.‘‘కొడాలి నానికి ఆపరేషన్ చేసే డాక్టర్ రమాకాంత్ పాండే సర్జరీలు చేయడంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. మా అమ్మ కూడా అక్కడే ఆపరేషన్ చేయించాం. ఇవాళో, రేపో నాని పరిస్థితిని పరిశీలించి డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి డేట్ ఇస్తారు. ఆయన సంతోషంగా ఇంటికి వస్తారు.. అందులో ఎటువంటి సందేహం లేదు. టీడీపీ చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.‘‘జైల్లో ఉన్న వంశీ జుట్టుకు రంగు వేయటం మానేశారు. దీంతో ఆయన ఏదో దిగులు పడిపోయినట్టు, కృంగిపోయినట్టు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ధైర్యం కోల్పోయే వ్యక్తులు కాదు. వాళ్లిద్దరూ క్షేమంగా వస్తారు.. టీడీపీని ఎదురిస్తారు. వాళ్ళిద్దరిని ట్రోల్ చేస్తూ టీడీపీ శ్రేణులు పైశాచిక ఆనందం పొందుతున్నాయి.’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
ప్రధాని, హోంమంత్రికి వైఎస్సార్సీపీ ఎంపీ లేఖ
సాక్షి, ఢిల్లీ: తిరుమలలో వరుసగా జరుగుతున్న భద్రత వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ.. ప్రధానమంత్రి, హోం మంత్రి, హోంశాఖ కార్యదర్శికి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ‘‘వైకుంఠ ఏకాదశి రోజున ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. అన్నదానం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులను నియంత్రించలేక తొక్కిసలాట జరిగింది. నాన్ వెజ్ పదార్థాలను కొండపైకి తీసుకెళ్లి తిన్న ఘటనలు జరిగాయి’’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు.‘అలిపిరి చెక్ పాయింట్‌ను దాటుకుని సులభంగా గంజాయి, ఆల్కాహాల్ తీసుకెళ్తున్నారు. పవిత్రమైన పాప వినాశనం డ్యామ్‌లో నిబంధనలకు విరుద్ధంగా బోట్లను తిప్పారు. మార్చి 31న మతిస్థిమితం లేని వ్యక్తి బైక్‌పై తిరుమల కొండపైకి చేరుకున్నాడు. టీటీడీ పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. దానివల్లే సమన్వయ లోపం, భద్రత లోపం తలెత్తింది. తిరుమల జాతీయ ప్రాధాన్యత కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం. వరుసగా జరుగుతున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. -
బలవంతపు వాంగ్మూలంతో కాకాణిపై అక్రమ కేసు: పర్వతరెడ్డి
సాక్షి, నెల్లూరు: టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు పరాకాష్టగా తప్పుడు వాంగ్మూలంతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉగాది పండగ కోసం తన కుటుంబంతో కలిసి కాకాణి గోవర్థన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లినప్పుడు, కావాలనే ఆయన ఇంటికి నోటీసు అంటించి మర్నాడే విచారణకు రమ్మనడం అత్యంత హేయమని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రెస్మీట్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:నెల్లూరులో ఎప్పుడూ చూడని వికృత రాజకీయం:నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ చూడని విధంగా సీనియర్ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ వికృత రాజకీయాలు చూసి అన్ని వర్గాల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కాలని కూటమి ప్రభుత్వం ఈ వికృత రాజకీయాలకు పాల్పడుతోంది.డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టి మళ్లించాలని ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, వారి ప్రజా వ్యతిరేక పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతుంటే ఓర్చుకోలేక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కాకాణి గోవర్దన్‌రెడ్డి కుటుంబం దశాబ్ధాలుగా నెల్లూరు రాజకీయాల్లో ఉంటోంది. అలాంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తోంది.మూడు నెలలుగా ప్రయత్నం:పొదలకూరు మండలంలో క్వార్ట్›్జ మైనింగ్‌లో మాజీ మంత్రి కాకాణిని ఎలాగైనా ఇరికించి జైల్లో నిర్బంధించాలనే కుట్రతో మూడు నెలలుగా ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. వారం క్రితం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతన్ని బెదిరించి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. దాని ఆధారంగా కాకాణిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పైగా ఆయనకు బెయిల్ రాకుండా ఉండేందుకు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.దీనిపై కాకాణి గోవర్థన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో, ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ ఉన్న నేపథ్యంలో ఎక్కడ క్వాష్ అవుతుందోననే భయంతో ఆయనపై ఈరోజు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. ఇంకోపక్క గోవర్ధన్‌రెడ్డి రోజూ పార్టీ ఆఫీసుకే వసున్నా, పరారైపోయారని మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. ఏరోజుకారోజు ఈరోజే అరెస్ట్ చేస్తారని కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.దురుద్దేశంతోనే నోటీసుల ప్రహసనం:ఉగాది పండుగను కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు కాకాణి గోవర్థన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, కావాలనే పండగ రోజు, ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో నెల్లూరులో ఆయన ఇంటికి వెళ్లారు. నోటీస్ ఇచ్చే నెపంతో తాళాలు పగలగొట్టి, ఇంటి గోడలు దూకే ప్రయత్నం చేశారు. చివరికి ఇంటి గోడలకు నోటీస్ అంటించి, మర్నాడు (సోమవారం) ఉదయం విచారణకు హాజరు కావాలని అందులో నిర్దేశించారు.నిజానికి శనివారం వరకు ఆయన ఇక్కడే ఉన్నా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులకు తీరిక లేదు. కావాలని పండగ రోజు ఆయన్ను ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే హడావుడి చేసి వెళ్లారు. కాకాణి పారిపోయాడని ప్రచారం చేసుకుంటున్న కూటమి నాయకుల నోళ్లు మూయించడానికి ఆయన హైదరాబాద్‌లో కుటుంబంతో కలిసి పండగ చేసుకుంటున్న ఫొటోలను 7.30 గంటలకు అన్ని మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో హైదరాబాద్ వెళ్లిన పోలీసులతో బుధవారం తనకి వేర్వేరు పనులున్నాయని, గురువారం వస్తానని చెప్పినా వినుకోకుండా 24 గంటల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వచ్చారు.నోటీసులు గురించి కాకాణిగారితో మాట్లాడినప్పుడు బుధవారం సాయంత్రానికి లేదా గురువారం ఉదయం కల్లా నెల్లూరులో అందుబాటులో ఉంటానని స్పష్టంగా చెప్పారు. కావాలంటే పోలీసులు గురువారం నెల్లూరు రావొచ్చని చెప్పారు. ఇలా అక్రమ కేసులు బనాయించి వైయస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకోవాలని చూడటం అవివేకమే అవుతుంది. కాగా, తాము ఇలాంటి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
తాడేపల్లి : రాష్ట్రంలోఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీ విజయానికి సహకరించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను వైఎస్ జగన్ స్వయంగా కలవనున్నారు. వీరితో రేపు(బుధవారం) ప్రత్యేకంగా సమావేశమై.. వారిందరికీ అభినందనలు తెలపనున్నారు వైఎస్ జగన్. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్షన్ సభ్యులు హాజరవుతారు. ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజాస్వామిక పరిణామాలు చర్చించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపైనా సమావేశంలో పార్టీ అ«ధ్యక్షుడు దిశా నిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతిని«ధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’ -
సంపద సృష్టించడం అంటే అబద్ధాలు చెప్పడమేనా బాబూ?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ప్రతినెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఒక పబ్లిసిటీ ఈవెంట్‌లా నిర్వహిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిస్సిగ్గుగా అదే పనిగా అబద్ధాలు చెప్పడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని అన్నారు. అప్పులపైనా, మెగా డీఎస్సీపైనా, స్టీల్‌ప్లాంట్‌పైనా చంద్రబాబు చెప్పిన, మాట్లాడిన అబద్ధాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని జూపూడి అన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:ఈవెంట్‌కు.. డీబీటీకి పోలికా!సీఎం చంద్రబాబు ఈనెల పెన్షన్ల కార్యక్రమాన్ని పర్చూరు నియోజకవర్గంలోని ఒక ఇంట్లో ప్రారంభించారు. నెలనెలా ఏదో ఒక ఊరికి వెళ్ళడం.. పెన్షన్లు పంచుతూ సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు. ఒక కుటుంబానికి ఇల్లు కట్టిస్తారు. ఒకరికి ఆటో కొనిపెడతారు. వాటిని చూపుతూ రాష్ట్రం అంతా అలాగే ఇస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుంది. తన వల్లే మొత్తం రాష్ట్రంలోనే పేదల జీవితాలు బాగుపడిపోతున్నాయన్నట్లుగా బిల్డప్ ఇస్తారు.ఈ రోజు చంద్రబాబు దాదాపు గంటన్నర ప్రసంగంలో అన్నీ అబద్ధాలు, తనను తాను పొగుడుకోవడమే. జగన్‌గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో బటన్ నొక్కుడు కన్నా, తాను పంపిణీ చేస్తున్న పెన్షన్లు ఎక్కువంటూ చులకన చేశారు. ‘అయ్యా, చంద్రబాబుగారూ, తన 5 ఏళ్ల పాలనలో జగన్‌గారు బటన్ నొక్కి అంటే, డీబీటీ ద్వారా నేరుగా పేదల ఖాతాలకు జమ చేసిన మొత్తం అక్షరాలా రూ.2.72 లక్షల కోట్లు. కానీ, ఆయన ఏనాడూ మీ మాదిరిగా ఇలా పబ్లిసిటీ ఈవెంట్స్ నిర్వహించలేదు. ప్రచార ఆర్భాటం అంతకన్నా చేసుకోలేదు. ప్రతి ఇంటికి తెల్లవారుజామునే వెళ్ళి వృద్దులకు పెన్షన్‌ను అందించే గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ వ్యవస్థనూ నీరుగార్చారు. అయినా మీరు, పెన్షన్ల పంపిణీ ఈవెంట్‌ను, డీబీటీతో ఎలా పోలుస్తున్నారో అర్థం కావడం లేదు’.పండుటాకులపై చంద్రబాబు పగ:ఇప్పుడే కాదు 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెన్షన్ల విషయంలో వృద్థుల పట్ల ఆయన ఏనాడూ మానవత్వంతో వ్యవహరించలేదు. ఆనాడు చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు నెలకు కేవలం రూ.1000 చొప్పున మాత్రమే పెన్షన్ ఇచ్చారు. అప్పుడు పెన్షన్ల కోసం నెలకు చేసిన ఖర్చు రూ.400 కోట్లు మాత్రమే. ఆ 5 ఏళ్లలో, టీడీపీ పాలనలో పెన్షన్ల కోసం చేసిన వ్యయం రూ.27,687 కోట్లు మాత్రమే. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్సార్ సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచాం. అందుకోసం నెలకు సగటున దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇవన్నీ వాస్తవాలు. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పెన్షనర్ల కోసం ఏదో చేస్తున్నాను అని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు.ఇప్పటికే 3 లక్షల పెన్షన్ల తొలగింపు:వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2024 మార్చిలో ఇచ్చిన మొత్తం పెన్షన్లు 66,34,742. కూటమి ప్రభుత్వం ఈ నెల పింఛన్లు విడుదల చేసిన లబ్ధిదారుల సంఖ్య 63.59 లక్షలు. అంటే మూడు లక్షల పెన్షన్లను తొలగించారని అర్థమవుతూనే ఉంది. పెన్షన్ల కోసం 2025–26 ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.2,719.50 కోట్ల చొప్పున, ఏడాదికి రూ.32,634 కోట్లు చెల్లించాలి. కానీ బడ్జెట్లో పింఛన్లకు ఈప్రభుత్వం కేటాయించింది రూ.27,518 కోట్లు మాత్రమే. ఇది కావాల్సిన నిధుల కన్నా ఏకంగా రూ.5 వేల కోట్లు తక్కువ. ఈ గణాంకాల ప్రకారం ఏకంగా పది లక్షల పింఛన్లకు కటింగ్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. దివ్యాంగ పింఛన్ల పైన కూడా ప్రభుత్వం కక్ష కట్టింది. ఈ తొమ్మిది నెలల్లోనే 15 వేల పెన్షన్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంది. జీవిత చరమాంకంలో ఉన్న పండుటాకులపై చంద్రబాబుకు ఎందుకు ఇంత పగ ఉందో అర్థం కావడం లేదు.స్టీల్‌ప్లాంట్‌పై మీ వైఖరి ఏమిటి బాబూ?:విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను గాడిలోపెట్టానని చంద్రబాబు చెబుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో 40వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. 5వేల మంది సీనియర్ ఇంజనీరింగ్ అధికారులను బలవంతంగా బదిలీ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభలో ఉక్కు మంత్రిత్వశాఖ మంత్రి మాట్లాడుతూ కేబినెట్ కమిటీ ఆఫ్ ఎకనమిక్స్ అఫైర్స్ రిపోర్ట్ ప్రకారం స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని సిఫార్సు చేసిందని ప్రకటించారు. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు దీనిని గురించి ఎందుకు మాట్లాడటం లేదు. ఒకవైపు కేంద్రం పెట్టుబడుల ఉపసంహకరణ అని చెబుతుంటే తాను గాడిలో పెట్టానని ఎలా అబద్దాలు చెప్పగలుగుతున్నారు?మెగా డీఎస్సీ అంటూ మరోసారి పచ్చి మోసం:మెగా డీఎస్సీ పై తొలిసంతకం అంటూ గతంలో నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు మరోసారి కొత్త నాటకం ప్రారంభించారు. తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్‌లో ఇచ్చి, మే నెలలో పరీక్ష, జూన్ నెలలో ఫలితాలు విడుదల చేస్తానని ప్రకటించారు. ఏ నమ్మకంతో చంద్రబాబు చెప్పిన మాటలను నిరుద్యోగులు పరిగణలోకి తీసుకోవాలి. తొమ్మిది నెలల కిందట డీఎస్సీపై పెట్టిన తొలి సంతకానికే ఇప్పటి వరకు దిక్కులేదు. ఇప్పుడు నోటిఫికేషన్ అంటూ చంద్రబాబు చెప్పే మాటలు ఆచరణకు సాధ్యమేనా? నిరుద్యోగులను మోసం చేయడానికే, వారిని ఆశపెట్టడానికే చంద్రబాబు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా నిరుద్యోగుల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు. హామీలు అమలు చేయలేక అప్పులంటున్నారు:ఎన్నికలకు ముందు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసింది, ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తోందని ఇదే చంద్రబాబు ఆరోపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అప్పులు ఒక సారి 12.5 లక్షల కోట్లు అని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అని, ఆ తరువాత రూ.9 లక్షల కోట్లు అని తగ్గించుకుంటూ వచ్చారు. ఒక్కోసారి మీ అబద్దం ఒక్కో అంకెను చెబుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తం అప్పులు చూస్తే రూ.5.62 కోట్లు అని కేంద్రం తేల్చి చెప్పింది. మొత్తం మీద మీరు ఎన్నికలకు ముందు చెప్పిన రూ.14 లక్షల కోట్ల అప్పులు లేవని మీరే అంగీకరించారు.మరి ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే భయమేస్తోంది, రాష్ట్ర అప్పులు చూస్తే ఎలా ఈ పథకాలు ఇవ్వాలో అర్థం కావడం లేదు అంటూ చంద్రబాబు కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయో చాలా స్పష్టంగా తెలిసే కదా మీరు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు. అంతకన్న తక్కువ అప్పులే ఉన్నప్పుడు చాలా సులభంగానే సూపర్ సిక్స్‌ను అమలు చేయవచ్చు కదా? అంటే పేదలకు మేలు చేయాలనే మంచి ఆలోచనకు చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకమే. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు సాకులు వెతుక్కుంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు.ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారు:చంద్రబాబుకు ఒక యువకుడు ఏదో చెప్పుకునేందుకు ముందుకు వస్తే అతడిపై బెదిరింపులకు పాల్పడ్డారు. తాను చెప్పే అబద్దాలను అందరూ వినాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రశ్నించే వారి గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులనే విషయాన్ని మరిచిపోకూడదు. కూటమి ప్రభుత్వం చెప్పే అబద్దాలను ప్రజలు స్వీకరించడానికి సిద్దంగా లేరు. పెన్షన్ల పంపిణీలో డిప్యూటీ సీఎం ఎమయ్యారు? నిత్యం చంద్రబాబును పొగిడే పవన్ ఎందుకు కనిపించడం లేదు? చంద్రబాబు అబద్దాలను ప్రశ్నించలేక ముఖం చాటేస్తున్నారా?. అని జూపూడి ప్రభాకర్‌రావు నిలదీశారు. -
లింగమయ్య హత్య కేసులో టీడీపీ నేతలు అరెస్ట్
సాక్షి, అనంతపురం: కురుబ లింగమయ్య హత్య కేసులో వైఎస్సార్సీపీ పోరాటం కొంతమేర ఫలించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులు ఆదర్శ్, మంజునాథ్ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు రమేష్, అనుచరులపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇద్దరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడికి పోలీసులు తలొగ్గారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడితో కొందరిని కేసు నుంచి తప్పించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో టీడీపీ నేతలు దాడులు కొనసాగుతున్నాయి. రామచంద్రపురం మండలం రేఖల చేనులో వైఎస్సార్సీపీ కార్యకర్త భూపతిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. తీవ్ర గాయపడిన ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు. వినాయకస్వామి ఆలయం వద్ద టీడీపీ కార్యకర్త లీలా ప్రకాష్ దేవుడు భజన చేస్తుంటే అడ్డుకోవడంతో స్థానికులు, వైఎస్సార్సీపీ కార్యకర్త భూపతి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో అడ్డుకున్న భూపతి రెడ్డిని ఇంటి వద్ద నిద్రిస్తుంటే కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రామచంద్రపురం మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న రామచంద్రపురం మండలంలో రౌడి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
పవన్‌ను వాడుకోవడం.. ఇప్పుడు బీజేపీ వంతు!
అవసరమైతే తమిళనాడుకు కూడా పార్టీని విస్తరిస్తానంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్! వినడానికి బాగానే అనిపించినా ఆయన చెప్పిందైతే వాస్తవం! ఎలాగంటారా? ఏపీలోనే సొంతబలం లేదు కదా? ఇతర రాష్ట్రాలలో ఏం చేయగలుగుతారని మీకు అనిపించవచ్చు. అదే తమాషా రాజకీయం! ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న గేమ్ అని అందులో ఈయన ఒక పావుగా మారుతున్నారని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాల వారైతే బహిరంగంగానే ఈ విమర్శలకు దిగుతున్నారు.రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అనేక రూపాలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయాలను సందర్శించారు. అది కూడా బీజేపీ మాట మేరకే అని ఒక విశ్లేషణ. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం మళ్లీ అన్నా డీఎంకేతో జత కట్టడానికి పావులు కదుపుతోంది. అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఇందుకు దాదాపు సిద్దమవుతున్నట్లుగానే వార్తలు వస్తున్నాయి. డీఎంకే చేపట్టిన హిందీ వ్యతిరేక ఆందోళన, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం కలుగుతున్న అంశాలపై ఆయన వ్యూహాత్మకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వినతిపత్రాలు సమర్పించడానికి ఢిల్లీ వళ్లారు. గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, లోక్‌సభ ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీ చేశారు. కానీ డీఎంకే మొత్తం స్వీప్ చేసింది. ఆ పార్టీ తమిళనాడులో బలంగా వేళ్లూనుకుంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే బలహీనపడింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అన్న భావన అన్నాడీఎంకేలో ఏర్పడిందని చెబుతున్నారు.ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఈ కూటమిలో చేరతారా? లేదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తమ కూటమికి సినీ రంగు అద్దడానికి, తమిళనాడులోని తెలుగు వారిని కొంతమేర ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్‌ను ప్రయోగించాలని బీజేపీ తలపెట్టిందని అంటున్నారు. ఒకప్పుడు కులం ఏమిటి? మతం ఏమిటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతని వేషం కట్టి దక్షిణాది రాష్ట్రాలు తిరిగి వచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం కొద్ది రోజుల క్రితం తమిళ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏపీలో కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చినా, టీడీపీ పొత్తు కారణంగా జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కాపు సామాజిక వర్గం వారు తమ నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఎప్పటినుంచో అభిలషిస్తున్నారు.పవన్ కళ్యాణ్ వారి ఆశలపై నీళ్లు జల్లుతూ చంద్రబాబుకు పూర్తిగా వత్తాసు పలుకుతున్నారు. పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని అంటున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ సీఎం కాకుండా అడ్డుపడడానికే ఈ వాదన చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నా, అవసరమైతే తన పదవి కోసం లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించే అవకాశం ఉంటుందని కొందరి భావన.చంద్రబాబు ఎప్పుడైనా మళ్లీ బీజేపీని వ్యతిరేకించినా, లేక ఏదో ఒక అంశంపై విడిపోవాలని బీజేపీ అనుకున్నా, పవన్ కళ్యాణ్‌ను ప్రొజెక్టు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ఏపీలో పెద్దగా ఓట్లు రాకపోయినా లేకపోయినా, ఆయన సినిమా ఇమేజీని వాడుకుని ఇతర రాష్ట్రాలలో ప్రొజెక్టు చేస్తే దాని ప్రభావం ఏపీపై కూడా ఉండవచ్చన్నది ఒక అంచనా అట.తెలంగాణలో గతంలో బీజేపీ జనసేనతో కలిసి పోటీచేసినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. జనసేన ఒక్క చోట తప్ప పోటీ చేసిన అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కాని సనాతని వేషం కట్టి ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఇప్పుడు తమిళనాడుపై దృష్టి కేంద్రీకరించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు ఒక చెక్ గా పవన్ ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ వారు చెప్పినట్లు ప్రచారం చేసి వారితో ఆయన మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలిగితే సమీప భవిష్యత్తులో లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడం, లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి కుదరకపోవచ్చు. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో చేరినా తమిళనాడులో జనసేన ఎంతవరకు సఫలం అవుతుందన్నది సందేహమే. సినీ నటుడు కూడా కనుక ప్రచారానికి ఈయనను వాడుకోవచ్చు. అందుకే యథా ప్రకారం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాంటి అబద్దాలు ఆడారో, అదే తరహాలో తమిళనాడులో కూడా ట్రయల్ ప్రారంభించినట్లు అనిపిస్తుంది.ఉదాహరణకు ఆయనకు తమిళ కవి భారతీయార్ పై అభిమానం ఉందని చెప్పడం, శివాజీ గణేశన్‌కు అభిమానినని, 1982 నుంచి 1995 వరకు చెన్నైలో ఉన్నానని చెప్పడం, మైలాపూర్ పాఠశాలలో చదువుకున్నానని అనడం, కూరగాయల మార్కెట్ కు వెళ్లి తమిళం నేర్చుకున్నానని వెల్లడించడం చూస్తే వీటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎన్ని అబద్దాలు ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పవన్ తన పుట్టిన స్థలం, చదువు గురించి మాత్రమే కాదు..అనేక అంశాలలో ఎన్ని రకాలుగా మాటలు మార్చింది ఏపీ ప్రజలకు తెలుసు. అన్నాడీఎంకే, బీజేపీ కలిస్తే తప్పులేదని, అన్నా డీఎంకేతో జనసేన పొత్తు పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. ఇక పిఠాపురంలో హిందీకి అనుకూలంగా మాట్లాడి, తమిళ నేతలను పరోక్షంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ మాత్రం మాట మార్చారు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. తద్వారా తమిళ సెంటిమెంట్‌కు అనుకూలంగా మాట్లాడినట్లు కనిపించే యత్నం చేశారన్న మాట.పిఠాపురంలో తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నప్పుడు హిందీని వ్యతిరేకించడం ఏమిటని అన్నారు. హిందీని రుద్దవద్దన్నది మాత్రమే తమిళ పార్టీల డిమాండ్. ఇదే అంశంపై అన్నాడీఎంకే కూడా అమిత్‌షా కు విన్నవించింది. పవన్ కళ్యాణ్ మరో ఆశ్చర్యకరమైన అంశం చెప్పారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటి కనిపించిందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ధైర్యం తప్ప మరేమీ లేవని ఆయన అన్నారు. ఇది సత్య దూరమైందో, కాదో ఆయనే ఆలోచించుకోవాలి. జనసేన పార్టీని స్థాపించడం, ఆ వెంటనే చంద్రబాబు కోరిక మేరకు మద్దతు ఇవ్వడం, కనీసం పోటీ కూడా చేయక పోవడం, తదుపరి టీడీసీ కూటమి ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయడం జరిగాయి. చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా స్పెషల్ విమానాలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి తరలి వెళ్లేవారు. మరి ఇందులో ఆయనకు చీకటి కనిపించడం ఏమిటో తెలియదు. కాకపోతే 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పోటీచేసి ఓటమి చెందినప్పుడు చీకటి కనిపించి ఉండవచ్చు. తన పార్టీ ఒకే సీటు గెలవడం, తనే రెండు చోట్ల ఓడిపోయారప్పుడు. 2019లో కూడా చంద్రబాబుతో పరోక్ష పొత్తు ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై మొదట పార్లమెంటులో మాట్లాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. అంతే తప్ప దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తాను కూడా పోరాడతానని చెప్పలేక పోయారు. అదే టైమ్‌లో దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గవని నమ్ముతున్నట్లు ఆయన చెబుతున్నారు.ఏపీలో పార్టీ విస్తరణకు ప్రత్యేకంగా ఎలాంటి అడుగులు వేయకపోయినా, జనసేన నేతలు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాలలో టీడీపీ వారి పెత్తనం కింద నలిగిపోతున్నా, పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని చెబుతున్నారు. చంద్రబాబుతో కలిసి చేసిన సూపర్ సిక్స్ అనే అబద్దాల వాగ్దానాలను తమిళనాడులో కూడా చెబుతారేమో తెలియదు. ఈ ఇంటర్వ్యూలలో ఆ జర్నలిస్టులు ఏపిలో ఎన్డీయే కూటమి హామీల అమలు తీరుతెన్నుల గురించి ఒక్క ప్రశ్న కూడా వేసినట్లు కనిపించదు. ముందస్తుగా మాట్లాడుకుని ఉంటే ఇబ్బంది లేని ప్రశ్నలే వేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ విప్లవవీరుడు చెగువెరా మొదలు టిడిపి అధినేత చంద్రబాబు వరకు, ప్రధాని మోడీ వరకు ఎన్ని రంగులు మార్చారో ,ఇప్పుడు తమిళనాడులో కూడా ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారో, ఆయనను తమిళ ప్రజలు ఎంతవరకు నమ్ముతారో వేచి చూడాల్సిందే. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వేధింపులకు భయపడేది లేదు.. వైఎస్సార్సీపీని వీడేది లేదు: పేర్ని నాని
కృష్ణా, సాక్షి: ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా.. వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటోందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మండిపడ్డారు. రేషన్ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘మేం ఏపాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమచేశాం. అయినా నా భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.. మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ(Civil Supply Ministry) ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్ కేసులు లేవు. సాక్షాత్తూ సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదు. సీజ్ ద షిప్.. సీజ్ ద గోడౌన్ అన్నా.. ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై, నా భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారు... ఎన్నో జరుగుతున్నా అన్నీ 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ల దిగజారుడుతనం తెలుస్తోంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకు అయినా పోతాం. అంతేగానీ వైఎస్సార్సీపీ(YSRCP) నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎంగడుతూనే ఉంటాం’’ అని పేర్ని నాని అన్నారు. -
పొమ్మనకుండా పొగ.. సీనియర్లకు లోకేశ్ సెగ
టీడీపీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరికీ వరుసగా తలుపులు మూసుకుపోతున్నాయి. మంత్రి లోకేశ్ అభీష్టం మేరకు.. తనకు బాగా సన్నిహితులైనవారిని కూడా సీఎం చంద్రబాబు దూరం పెట్టేస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం సీనియర్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, కంభంపాటి రామ్మోహనరావు వంటి వారిని ఇప్పటికే దాదాపు రిటైర్ చేశారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాగంటి బాబు వంటి పలువురు నేతలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలుగా ఉన్నా కొందరి పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకు పారీ్టలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా ఉన్నారు. – సాక్షి, ప్రత్యేక ప్రతినిధిమిగిలిన సీనియర్లకూ అదే గతి..చంద్రబాబు సమకాలీకుడైన అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారనే సాకుతో ఆయనకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. కేంద్ర మంత్రిగా, రాష్ట్రంలో పలుసార్లు మంత్రిగా పనిచేసిన అశోక్ అనుభవం, రాజకీయ నైపుణ్యాలను పట్టించుకోలేదు. దీంతో ఆయన ఇప్పుడు పారీ్టకి దూరంగా ఉంటున్నారు. అదితి కుమార్తె ఎమ్మెల్యేగా విజయనగరానికి పరిమితమయ్యారు.⇒ కంభంపాటి రామ్మోహనరావు ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు. ఢిల్లీలో చంద్రబాబు తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు అవసరం లేకపోవడంతో కంభంపాటి ప్రాధాన్యత తగ్గిపోయింది. మరోసారి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆయన ప్రయత్నించినా పరిగణనలోకి తీసుకోలేదు.⇒ గోరంట్ల బుచ్చయ్యచౌదరి చిరకాల స్వప్నం మంత్రికావడం. కానీ, క్యాబినెట్లోకి తీసుకోలేదు. సొంత నియోజకవర్గంలో ఆయన చెప్పినవారికి పోస్టింగ్‌లూ ఇవ్వడం లేదు. ⇒ మాజీ హోం మంత్రి చినరాజప్పదీ ఇదే పరిస్థితి. ఉమ్మడి పశ్చిమలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాగంటి బాబుకు అసలు సీటే ఇవ్వలేదు. ఇలా టీడీపీలో చాలామంది సీనియర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ⇒ పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్లకు లోకేశ్ జమానాలో తమకు అవకాశాలు వస్తాయా? అనే అనుమానాలు బలంగా మెదులుతున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో బలమైన హామీలు పొందిన పిఠాపురం వర్మ వంటివారికీ నిరాశా నిస్పృహలు తప్పడం లేదు.యనమల.. సాగనంపారిలా..టీడీపీలో అత్యంత సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. స్పీకర్, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే, ఆయన కుమార్తె, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అవినీతి వ్యవహారాలపై లీకులిచి్చ.. తద్వారా యనమల రాజకీయ భవిష్యతుకు చంద్రబాబు తెరదించారనే తీవ్ర చర్చ పార్టీ ముఖ్యుల్లో జరుగుతోంది. 2 నెలల కిందట రాజ్యసభకు వెళ్లే చాన్స్‌ను, 2 వారాల కిందట ఎమ్మెల్సీగా కొనసాగించడానికి వచి్చన అవకాశాన్ని నిరాకరించి రామకృష్ణుడికి దారులను శాశ్వతంగా మూసేయడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారనేది పరిశీలకుల విశ్లేషణ.తన కూతురు దివ్య, అల్లుడు వెంకట గోపీనాథ్ అవినీతిని సాకుగా చూపి.. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ వ్యూహాత్మకంగా పావులు కదిపారని యనమల తన అంతరంగీకుల వద్ద వాపోతున్నారని సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు ముందు దివ్య, గోపీనాథ్ అవినీతిపై ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. దివ్య తొలిసారి ఎమ్మెల్యే అయినా అవినీతి, అక్రమాలలో స్మార్ట్‌గా దూసుకుపోతూ తన పేరు బయటకు పొక్కకుండా అనుభవజు్ఞరాలిగా సెట్ చేసుకుంటున్నారంటూ పరోక్షంగా రామకృష్ణుడిని తాకేలా తూర్పారపట్టారు. స్వపక్షీయులకు చెందిన మద్యం షాపులు, బెల్టు షాపులు, అనుమతుల్లేని బార్లు, పేకాట క్లబ్బుల నిర్వాహకుల ద్వారా నెలకు రూ.కోటి, మట్టి, గ్రావెల్ దందా ద్వారా రూ.రెండు కోట్లు వెనకేసుకుంటున్నారని, తుని సమీపంలో విమానాశ్రయం ప్రతిపాదనలో భాగంగా 700 ఎకరాలలో సుమారు 300 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్‌కు గాను ఇప్పటికే రూ.12 కోట్లు వెనకేసుకున్నారనేది పబ్లిక్ టాక్. రామకృష్ణుడు, దివ్య ఎక్కడా సీన్లో కనిపించకుండా వారి దగ్గరి బంధువు యనమల రాజేష్ ద్వారా అన్నీ నడిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. హైదరాబాద్‌లో ఐఆర్ఎస్ అధికారైన దివ్య భర్త వెంకట గోపీనాథ్ ప్రతి శని, ఆదివారాలు తునిలో ఉంటూ అవినీతికి మార్గ నిర్దేశం చేస్తున్నారని చెబుతున్నారు. 2014–19 మధ్య డిప్యుటేషన్‌పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పని చేసినప్పుడు నిధులు దారిమళ్లించడంతో పాటు అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. యనమలను పక్కన పెట్టేయడంలో బాబు, లోకేశ్ తప్పులేదని సమర్థించుకునేందుకు ఇప్పటికీ టీడీపీ అనుకూలురు, వారి సోషల్ మీడియాలో పై అంశాలతో కూడిన వీడియోలు హల్చల్ చేయిస్తుండటం గమనార్హం. యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా, మరో కుమార్తె భర్త పుట్టా మహే‹Ùయాదవ్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తుచేస్తూ.. పార్టీ ఏమైనా యనమల కుటుంబ ప్యాకేజీనా అనే కామెంట్లను టీడీపీ వారిచేతే గుప్పిస్తున్నారు. ఇక పార్టీ ఉన్నత స్థాయి ప్రణాళికల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే అనుమానాలు యనమల వర్గీయుల్లో బలంగా ఉన్నాయి. -
‘చంద్రబాబు.. పీ4 పేరుతో బాధ్యతలను విస్మరిస్తారా ?’
తాడేపల్లి: హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా నిర్వహించిన పీ–4 కార్యక్రమం ప్రారంభంతోనే అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ పీ4 ప్రారంభ కార్యక్రమంలో బీసీల పట్ల చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పట్ల చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపేనని మరోసారి నిరూపించుకున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే...పేదల విషయంలో చంద్రబాబుది రెండు నాలుకల దోరణి. చంద్రబాబు పేదల అభ్యున్నతి, సంక్షేమం అంటూ మాట్లాడటమే తప్ప వాస్తవంగా వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ఒక్క కార్యక్రమం కూడా చేపట్టరు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక వర్గం వారి సొంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకి పేదలన్నా, దళితులన్నా, బీసీలన్నా ఎప్పుడూ చులకన భావమే. దళిత కుటుంబంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని బహిరంగంగా వ్యాఖ్యానించిన కుల దురహంకారి. తాజాగా నిన్నటికి నిన్న ఉగాది పండగ రోజున ఆర్భాటంగా నిర్వహించిన పీ–4 కార్యక్రమంలోనూ మళ్లీ ఇదే తరహా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ బడుగు, బలహీన వర్గాల ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడొచ్చారు. సగం మంది వెళ్లిపోయారు. వారి ఆలోచన అంతా.. మీటింగ్ అయింది.. మా పని అయిపోయింది’ అనుకుంటారు.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదలను గొప్పోళ్లను చేస్తానంటూ ఉగాదినాడు ఆర్భాటంగా కార్యక్రమం మొదలుపెట్టి, ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటే, ఆ ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వారిని చూసి చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. వారి పట్ల తన మనసులో ఉన్న మాటను వెళ్లగక్కి బడుగులంటే తనకు ఏమాత్రం గిట్టదని మరోసారి రుజువు చేసుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత, బలహీన వర్గాల నుద్దేశించి అంత దారుణంగా మాట్లాడడం అత్యంత హేయం.ఆది నుంచి ఆయనకు పేదలంటే అలుసేచంద్రబాబుకు ఆది నుంచి పేదలంటే అలుసే. ఆయన దళితులు, బడుగు, బలహీనవర్గాలపై తనకు అలవాటైన రీతిలో మళ్ళీ మళ్ళీ నోరు పారేసుకుంటునే ఉంటారు. బడుగు, బలహీనవర్గాల ఆలోచన ఆ పూట వరకే ఉంటుందని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. పేదలను ధనికులను చేస్తానంటూ జీరో పావర్టీ పీ–4 పేరుతో నిర్వహించిన సభలోనే వారిపై తనకున్న ఏహ్య భావాన్ని చంద్రబాబుగారు బయటపెట్టారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో నాడు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబుగారు బీసీలపై తన అక్కసు వెళ్లగక్కారు. తమ బాధలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను.. ‘మీ తోకలు కత్తిరిస్తా.. ఏం తమాషాలు చేస్తున్నారా? అసలు మిమ్మల్ని ఇక్కడి వరకూ రానివ్వడమే తప్పు..’ అంటూ హూంకరించారు.ఇంకా నేనిచ్చిన బియ్యం తింటున్నారు. నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు. నాకెందుకు ఓటు వేయరు. అంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సమయంలో బ్లాక్మెయిల్ తరహాలో పేదలను బెదిరించారు. నాయకుడి బాటలో నడుస్తున్న టీడీపీ నేతలు కూడా నోరు పారేసుకుంటున్నారు. దళితులు, బీసీల పట్ల తరచూ హీన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు..?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక సభలో ఎస్సీల పట్ల అవమానకరంగా మాట్లాడటం తెలిసిందే. ‘ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వాళ్లు దగ్గరకు వస్తే వాసన వస్తుంది. వాళ్లకి చదువు రాదు..’ అంటూ టీడీపీలో ఉండగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దారుణంగా మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడితే టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకుంటారు. అసలు బీసీలన్నా, దళితులన్నా ఆయనకు పడనే పడదు. వారి కోసం చిత్తశుద్ధితో చేసింది ఒక్కటీ లేదు. ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి, నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేయడం తప్ప. టీడీపీ నుంచి రాజ్యసభకు పంపిన వారిని చూస్తే.. దళితులు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అభిప్రాయం, ఆయన వైఖరి అందరికీ అర్ధమవుతుంది.రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనఇక గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, ప్రతిపక్షంపై దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైయస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగయ్యను దారుణంగా హత్య చేశారు. ఉగాది పండగ రోజున గుడికి వెళ్లొస్తుండగా, దారి కాచిన దుండగులు దారుణంగా హతమార్చారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్యెల్యే పరిటాల సునీత బంధువులే హత్యకు కారణమంటూ, లింగయ్య బంధువులు ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోవడం లేదు. అనుమానితుల పేర్లు చెప్పినా, పోలీసులు ఖాతరు చేయడం లేదు. ఆ దిశలో కేసు దర్యాప్తు చేయడం లేదు. మరోవైపు లింగయ్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతోందా? లేక మంత్రి నారా లోకేష్ పదే పదే చెబుతున్నట్లు రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందా? రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. ఈ పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తోంది. ఇది మంచి సంప్రదాయం కాదని హెచ్చరిస్తున్నాం. చర్యకు అనుగుణంగా ప్రతి చర్య ఉంటుందని గుర్తు చేస్తున్నాం.పీ4 పేరుతో బాధ్యతలను విస్మరిస్తారా?చంద్రబాబు పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో నిరుపదలను ధనవంతులు సహాయం చేయడం ద్వారా వారి పేదరికాన్ని తొలగిస్తానని చెప్పారు. ఆయన బీఆర్ అంబేద్కర్‌ను కోట్ చేశారు. ఆయనకు కూడా ఇలా సహయం అందడం వల్లే ఆయన ఉన్నత చదువులు చదువుకుని, ఉన్నత స్థానానికి చేరుకున్నారని గుర్తు చేశారు. ఇదే అంబేద్కర్ రాజ్యాంగంలో కొన్ని అంశాలను పేదల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనను బాధ్యతగా తీసుకుంటేనే వారు పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. ప్రజలు తాము చెల్లిస్తున్న పన్నులతో నడుస్తున్న ప్రభుత్వం తమకన్నా దిగువన ఉన్న వారికి సంక్షేమం ద్వారా చేయూతను అందించాలని, సమాజంలో అసమానతలను తగ్గించాలని కోరుకుంటారు. కానీ చంద్రబాబు దీనికి భిన్నంగా పీ4 పేరుతో పేదలను ఆదుకునే బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ మౌలిక సూత్రాకుల అనుగుణంగా పాలించాల్సిన వారు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. షెడ్యూల్ కులాలకు ఎస్సీ సబ్‌ప్లాన్, బీసీ కులాలకు బీసీ సబ్ప్లాన్లు ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా సమాజంలోని ధనవంతులు పేదలను దత్తత తీసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుందని చంద్రబాబు సూత్రీకరించారు. మీరు ఈ రాష్ట్రంలో పేదరికం ఉందనే విషయం ఆలస్యంగా అయినా చంద్రబాబు తెలుసుకున్నారు. కరోనా వంటి ప్రపంచ విపత్తు సమయంలోనే రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది, నేను ఏమీ చేయలేనని చెప్పకుండా ఎంతో బాధ్యతగా పేదలకు అండగా నిలిచిన వైయస్ జగన్ గారిని చూసి నేర్చుకోండి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ఖజానాలో ఉన్నది కేవలం రూ.100 కోట్లు మాత్రమే. అలాగే వేలాది కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినా బెంబేలెత్తలేదు. పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఎగ్గొట్టాలని ఏనాడు అనుకోలేదు. పేదల ఇళ్ళలో విద్యాజ్యోతిని వెలిగిస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని ఆనాడు స్వర్గీయ వైయస్ఆర్ ఫీజురీయింబర్స్‌మెంట్‌ను తీసుకువచ్చారు. చంద్రబాబు మాట్లాడితే బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు దృష్టిలో కేవలం కులవృత్తులతోనే బతకాలని అనుకుంటున్నారు. అంతేకానీ బీసీలకు ఉన్నత విద్యను అందించాలని, వారి జీవితాల్లో మార్పులు తేవాలని ఏనాడు ఆలోచన చేయలేదు. -
‘పరిటాల సునీత కనుసన్నల్లోనే లింగమయ్య హత్య’
తాడేపల్లి : ఎమ్మెల్యే పరిటాల సునీత కక్ష సాధింపుతోనే కురబ లింగమయ్య హత్య గావించబడ్డాడని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. సునీత్ డైరెక్షన్, ఎస్పై సుధాకర్ ప్రోత్సాహంతోనే హత్య జరిగిందన్నారు. నిందితులను కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తున్నారని, రామగిరి ఎంపీపీని దక్కించుకోవటానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తోపుదుర్తి ప్రకాస్ రెడ్డి.. ఎస్పై సుధాకర్ తన ఫోన్ నుంచే పరిటాల సునీత, శ్రీరామ్ లకు వీడియో కాల్ చేసి తమ ఎంపీటీసీలను బెదిరించారని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ గూండాలతో తమ ఎంపీటీలసీ కిడ్నాప్ చేయించటానికి ప్రయత్నించారని, దీన్ని అడ్డుకున్నందుకు తమపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. మండలానికొక వైఎస్సార్ సీపీ నాయకుడిని చంపాలని పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టాడని ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటి మీద రెండు రోజుల పాటు దాడులు చేశారన్నారు.‘కురుబ లింగమయ్యను దారుణంగా కొట్టి హతమార్చారు. టీడీపీ గూండాలు ఆదర్శ్, మనోజ్, నర్సింహా, నవకాంత్, రమేష్, సురేష్ లే ఈ దారుణాలకు పాల్పడ్డారు. ఐతే పోలీసులు మాత్రం నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిటాల సునీత కనుసన్నల్లోనే పోలీసులు పని చేస్తున్నారు. చివరికి కోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పాటించటం లేదు’ అని తోపుదుర్తి పేర్కొన్నారు. -
ఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ తీసేయమని బాబుగారికి చెబితే పోలా..!
‘‘ఈరోజు ప్రపంచం ఇలా ఉందంటే అందుకు కారణం నేనే.. మన చేతుల్లో సెల్ ఫోన్ ఉందంటే అందుకు కారణం కూడా నేనే. సెల్ ఫోన్ తో ప్రపంచాన్ని క్షణాల్లో వీక్షించి వస్తున్నామంటే అందుకు కారణమూ నేనే’’ ఈ తరహా గప్పాలు కొట్టుకోవడం మన బాబుగారికి బాగా అలవాటు. ఏదైనా మంచి విషయం వెలుగులోకి వస్తే చాలు అందుకు ఆద్యుడిని తానే అంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబుగారికి చెప్పుకోవడం అలవాటు. ఇది కేవలం బాబుగారికి మాత్రమే చెల్లిన అలవాటు. పొరపాటున కూడా ఆ అలవాటు మార్చుకోరు మన బాబు గారు. లోకేష్‌కు సెల్‌ఫోన్ భయం..మరి ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ కు సెల్ ఫోన్ ను చూస్తే భయవేస్తోందట. ఎవరి చేతుల్లోనైనా సెల్ ఫోన్ చూస్తే అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మన చినబాబు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కార్యకర్తలతో ఈరోజు(సోమవారం) లోకేష్ సమావేశమయ్యారు. వారికి ముందుగా ఒకే ఆజ్ఞ చేశారు చినబాబు. ‘సెల్ ఫోన్ లలో ఏమీ రికార్డు చేయొద్దమ్మా’ అంటూ తన స్టైల్ లో ఆదేశాలిచ్చారు లోకేష్. ఇదంతా ఎందుకంటే తనను ఎవరైనా నిలదీసి అది రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడితే పరిస్థితి ఏమటనే కోణంలోనే లోకేష్ ముందుగా జాగ్రత్తలు పడ్డారు. ఈ భేటీలో సూపర్ సిక్స్ హామీలపై ఎవరైనా నిలదీసి అది సోషల్ మీడియా వరకూ చేరితే ట్రోలింగ్ గురి కావాల్సి వస్తుందని ముందే గ్రహించిన లోకేష్ దీన్ని మాత్రం చక్కగా అమలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా రికార్డింగ్ చేస్తే సెల్ ఫోన్స్ అమ్మి కార్యకర్తల నిధికి ఇచ్చేస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దీనిపై టీడీపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. మన లోకేష్ బాబు ఏంటి.. ఇలా మాట్లాడుతున్నారంటే అనుకోవడం అక్కడకు వచ్చిన కార్యకర్తల వంతైంది.లోకేష్ వ్యాఖ్యలను వినడానికి ఫోటోపై క్లిక్ చేయండి..మరి నాన్నగారైన చంద్రబాబు సెల్ ఫోన్ కు రావడానికి కారణం తానేనని, ఆరోజు అప్పటి ప్రధాని వాజ్ పేయికి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే సెల్ ఫోన్ వచ్చిందని బాబుగారు గర్వంగా చెప్పుకుంటున్నారు ఇప్పటికీ. మామూలుగా ఫోన్ చేసుకోవడానికే కాదు.. డబ్బులు సంపాదించుకోవడానికి సెల్ ఫోన్ అవసరం ఎంతో ఉంది. అదొక నిత్యావసర వస్తువంటూ 2023లో ఓ సందర్భంలో కామెంట్స్ చేశారు చంద్రబాబు. భార్య లేకపోతే భర్త ఉంటాడని, భర్త లేకపోతే భార్య ఉంటుందని, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఎవరూ ఉండరంటూ బాబుగారు తన గొప్పను గొప్పగానే చెప్పుకున్నారు. ఇలా సమయం దొరికినప్పుడల్లా బాబుగారు సెల్ ఫోన్ కు ఎక్కువ ప్రమోషన్ ఇస్తూ.. తనను కూడా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు.కొసమెరుపు: మరి ఇప్పుడు అదే సెల్ ఫోన్ చూసి లోకేష్ భయపడుతున్నారంటే ఏమనాలి. ఇక నుంచి సెల్ ఫోన్ లో రికార్డింగ్ ఆప్షన్ తీసేయమని ఇప్పుడు బాబుగారికి చెబితే బాగుంటుందేమో మరి. -
బెయిల్ రాకుండా.. కాకాణిపై కూటమి ప్రభుత్వం కుట్ర
సాక్షి,నెల్లూరు : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ రాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందా?. నెల్లూరులో కార్యకర్తలతో అందుబాటులో ఉన్నన్ని పోలీసులు నోటీసులు ఇవ్వని పోలీసులు.. కాకాణి హైదరాబాద్‌కు వెళ్లిన వెంటనే నోటీసులు ఎలా ఇస్తారు?.బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగడానికి ఒకరోజు ముందు విచారణకు హాజరుకావాలని పోలీసులు చెప్పడం వంటి పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కాకాణి గోవర్థన్‌రెడ్డి నెల్లూరులోని తన నివాసంలో కార్యకర్తలతో నాలుగైదు రోజులు అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉన్నన్ని రోజులు పోలీసులు నోటీసులు ఇవ్వలేదు. అయితే, ఉగాది పండుగ పర్వదినాన హైదరాబాద్‌లో ఉన్న తన కుటుంబసభ్యులతో గడిపేందుకు వెళ్లారు. కాకాణి నెల్లూరులో లేరని తెలుసుకుని హుటాహుటీనా నివాసానికి వెళ్లి నోటీసులు అంటించారు. ఉగాది రోజు సాయంత్రం ఆరుగంటల సమయంలో కాకాణి నివాసానికి నోటీసులు అంటించారు. దీనిపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. మంగళవారం కాకాణి గోవర్థన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాకాణినికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏపీలో కక్ష రాజకీయాలకు బలవుతున్న బడుగు, బలహీన వర్గాలు
గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ చేస్తున్న అరాచకాలను, అఘాయిత్యాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. మళ్లీ పగడ విప్పిన ఫ్యాక్షన్ రాజకీయానికి.. తాజాగా రాప్తాడులో బలైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య ఉదంతంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏపీలో చట్టబద్ధపాలన లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలమీద, నాయకులమీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయి. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. .. రామగిరి మండల ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. రామగిరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల(TDP Atrocities) దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించారు. అయినా పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ పైగా వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం. లింగమయ్య కుటుంబానికి అండగా.. .. కురబ లింగమయ్య(Kuruba Lingamaiah) హత్యను ఖండిస్తున్నా. అధికారపార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్సార్సీపీకి చెందిన ఓ బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారు. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. కురుబ లింగమయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: హత్య చేయించి పరామర్శకు వస్తారా?.. టీడీపీ ఎంపీకి చేదు అనుభవం -
ఇదేం రాజకీయం?.. ఎంపీ పార్థసారథికి చేదు అనుభవం
అనంతపురం, సాక్షి: రాజకీయ ఆధిపత్యం కోసం కూటమి ప్రభుత్వం అఘాయిత్యాలకు తెగ బడుతోంది. ఈ క్రమంలోనే.. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య(Kuruba Lingamaiah) దారుణహత్యకు గురయ్యారు. అయితే బాధిత కుటుంబానికి పరామర్శ కోసం వెళ్లిన టీడీపీ ఎంపీ బీకే పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. ఓవైపు హత్య చేయించి.. మరోవైపు పరామర్శకు వస్తారా?. టీడీపీ ప్రభుత్వం(TDP Government)లో బీసీలకు రక్షణ లేదా? అంటూ లింగమయ్య కొడుకు మనోహర్ ఎంపీ పార్థసారథి(Bk Parthasarathi)ని నిలదీశారు. దీంతో ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. పరిటాల సునీత నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఈ సందర్భంగా ఎంపీ దృష్టికి తీసుకెళ్లాడాయన. అంతకు ముందు.. ‘‘టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత(Paritala Sunitha) సోదరులే మా నాన్నను హత్య చేశారు. వైఎస్సార్సీపీలో ఉన్నందుకే చంపారు. బీసీ సామాజికవర్గానికి చెందిన తాము రాజకీయంగా ఎదగ కూడదనే హత్య చేశారు’’ అని లింగమయ్య కొడుకులు మనోహర్, శ్రీనివాసులు మీడియా ముందు వాపోయారు.రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది పూట ఘోరం జరిగింది. గుడికి వెళ్లి వస్తుండగా లింగమయ్యపై టీడీపీ నేతలు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆయన.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. పరిటాల సునీత బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ హత్యా రాజకీయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. పరిటాల సునీతకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్సీపీలో లింగమయ్య కీలకంగా ఉన్నందుకే ఈ హత్య చేయించారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు పరామర్శ కోసం వెళ్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకోగా.. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనపై గోరంట్ల మండిపడ్డారు. ఇదీ చదవండి: జగన్ హయాంలో హింసా రాజకీయాలెక్కడివి? -
రాప్తాడులో ఉద్రిక్తత.. గోరంట్ల మాధవ్‌తో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, అనంతపురం: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. రాప్తాడు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు.మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్తున్న గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు పోలీసుల అనుమతి కావాలా అంటూ ఆయన ప్రశ్నించారు. తనును కావాలనే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య దారుణ హత్యను ఖండిస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయి. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ బీసీ నేతలను టార్గెట్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో హింసా రాజకీయాలు లేవు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ మొదలు పెట్టారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం దుర్మార్గం అంటే కామెంట్స్ చేశారు.మరోవైపు.. కురుబ లింగమయ్య దారుణ హత్యను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా తోపుదుర్తి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీలో కీలకంగా ఉన్నందుకే లింగమయ్యను హత్య చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత హత్యా రాజకీయాలు చేస్తున్నారు. పరిటాల సునీతకు పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
Nara Lokesh: కోతి చేతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు..!
తెలుగుదేశం పార్టీ అబద్దాల ఫ్యాక్టరీగానే కాదు.. అహంభావం తలకెక్కిన పార్టీగా మారిపోయిందా! పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు చేసిన ప్రసంగాలు చూస్తే అలాగే అనిపిస్తోంది! అవకాశవాద రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ఏ మాత్రం ఫీల్ కారు. ఇప్పుడు లోకేష్ కూడా అదేబాటలో పయనిస్తూ అబద్దాలు చెప్పడంలో తండ్రితో పోటీ పడుతున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. అబద్దాల వరకైతే ఒక రకంగా సరిపెట్టుకోవచ్చు. కాని తానొక యువరాజు అనుకుని అహంకారంతో నారా లోకేష్(Nara Lokesh) మాట్లాడుతున్న తీరు కచ్చితంగా ఆయన స్వభావాన్ని తెలియచేస్తుంది. చంద్రబాబు నాయుడుకు లోపల అహం ఉన్నా, పైకి కనిపించకుండా నటిస్తూ, రెండు రకాలుగా ఆయనే మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తుంటారు. కానీ లోకేష్ మాత్రం అధికారంతో వచ్చిన కైపుతో మాట్లాడుతున్న వైనం పార్టీలోనే కాదు.. ప్రజలలో కూడా వెగటు పుట్టించే అవకాశం ఉంది. వీరి ఉపన్యాసాలకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ.. చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు చెప్పారని, లోకేష్ అధికార మదంతో మాట్లాడారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో లోకేష్ ఇందుకు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. 👉విశేషం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ(TDP) ఏర్పడినప్పుడు చంద్రబాబు ఆ పార్టీలో చేరనే లేదు. పార్టీలోకి రావాల్సిందిగా మామ ఎన్టీఆర్, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోరినా, అసలు తెలుగుదేశం పార్టీ మనజాలదని చెప్పారు. సినిమా వాళ్లను జనం ఆదరించరని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ (ఐ) ప్రభుత్వంలో మంత్రి. పార్టీ అదేశిస్తే మామపై కూడా పోటీ చేస్తానని బీరాలు పలికిన చరిత్ర ఆయనది. కానీ 1983 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయాయిన వెంటనే ముఖ్యమంత్రి పీఠమెక్కిన మామ పార్టీలోకి రావడం చంద్రబాబుకు ఇబ్బంది రాలేదు. అప్పటి నుంచి పార్టీని ఒక ప్లాన్ ప్రకారం తన గుప్పెట్లోకి తెచ్చుకుని, చివరికి రామారావునే కూలదోసిన సంగతీ తెలిసిందే. 👉చివరి రోజుల్లో ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబును(Chandrababu) విలువలు లేని వ్యక్తి అని చెప్పిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. చంద్రబాబు అంత దుష్టుడు లేడంటూ రామారావే వీడియో విడుదల చేశారు. ఆయన ఆకస్మిక మరణంతో చంద్రబాబు మాట మార్చేసి, ఆయన వారసత్వం తనదేనని ప్రకటించుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలే తమ సిద్దాంతమని, ఆయన యుగపురుషుడు అంటూ కబుర్లు చెబుతూ వస్తున్నారు. కాలం గడిచే కొద్ది ఆ పేరు కనుమరుగవుతూ వచ్చింది. స్వోత్కర్ష పెరిగింది. పార్టీలోని ఇతర నేతలు, క్యాడర్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు టీడీపీని ఒక అబద్దాల కర్మాగారంగా మార్చడంలో విజయవంతం అయ్యారన్న అభిప్రాయం వివిధ వర్గాలలో వ్యక్తం అవుతుంటుంది. ఒక వర్గం మీడియాకు అవసరమైన వనరులను సమకూర్చి దానిని తన చెప్పుచేతలలో ఉండేలా చేసుకున్నారు. చంద్రబాబు చెప్పే అబద్దాలను జనంలోకి తీసుకువెళ్లడంలో ఈ ఎల్లో మీడియా నిరంతరం శ్రమిస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విజయవంతం అయ్యారు. మరికొన్ని సార్లు విఫలం అయ్యారు. వార్షికోత్సవంలో ఒకరినొకరు పొగుడుకుంటే పర్వాలేదు.కాని అదేదో పార్టీలో మొదటి నుంచి తానే ఉన్నట్లు, ఇప్పటికీ ఎన్టీఆర్ కాలం నాటి విలువలు కొనసాగిస్తున్నట్లుగా కబుర్లు చెప్పడమే అతిశయోక్తిగా ఉంటుంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెట్టారు. పేదలను సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకోవాలని భావించేవారు. మాట ఇస్తే సాధ్యమైనంత వరకు ఆచరించి చూపాలని అనేవారు. అబద్దాలు చెప్పడానికి అంతగా ఇష్టపడేవారు కారు. అయితే పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చినప్పటి నుంచి వీటన్నిటికి మంగళం పలికింది కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎన్టీఆర్ ఆత్మగౌరవం కోసం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడితే, చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి 2023 లో నానా తంటాలు పడ్డారు. 2024 ఎన్నికలకు ముందు ఢిల్లీలో రోజుల తరబడి బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి ఎలాగైనా పొత్తు కావాలని కోరిన వైనం, పవన్ కళ్యాణ్‌ను బతిమలాడుకున్న తీరును గమనిస్తే, టీడీపీ ఆత్మగౌరవం ఎలా దిగజారిపోయింది తెలియడం లేదా! తన పార్టీలోకి ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావాలంటే రాజీనామా చేసి రావాలని ఎన్టీఆర్ నియమం పెట్టారు. చంద్రబాబేమో పూర్తిగా అందుకు విరుద్దం. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి తీసుకు వచ్చి, నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఎన్టీఆర్ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా 1994లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మద్య నిషేధం విధిస్తే, చంద్రబాబు ఆయనను పదవీచ్యుతుడిని చేసి మొత్తం రివర్స్ చేశారు. పోనీ వాటికైనా కట్టుబడి ఉంటారా ఉంటే అదేమీ లేదు. ఎన్నికలకు ముందు ఎక్కడలేని అబద్దాలు చెబుతారన్న విమర్శకు ఆస్కారం ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఏ రకంగా ఎగవేయాలన్న దాని కోసం ఎన్ని అసత్యాలైనా చెప్పడానికి వెనుకాడరని అనుభవాలు చెబుతున్నాయి. 2014 టర్మ్‌లో రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి ఏమి చేశారో అందరికి తెలుసు. 2024లో రికార్డు స్థాయిలో అబద్దాలు చెప్పి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారో అంతా గమనిస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్, తదితర హామీలు, అప్పుల గురించి ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారు! ఇప్పుడు ఏమి అంటున్నారు. 👉ఎన్నికలకు ముందు బయట నుంచి చూస్తే సూపర్ సిక్స్ అమలు చేయగలనని అనిపించిందట. అందుకే హామీలు ఇచ్చారట. కాని అధికారం వచ్చాక చేయడం కష్టమని తెలుస్తోందట. పదిహేనేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఈ మాటలు చెబితే ఎవరైనా నమ్ముతారా? ప్రజల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇంకొకటి అవుతుందా? ఒకసారి అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానంటారు. మరోసారి స్కీములన్నీ ఇచ్చేస్తానని అంటారు. వేరొకసారి అప్పులు చేసి స్కీములు ఎలా ఇస్తామని ప్రజలనే ప్రశ్నిస్తారు. ఇలా అన్ని మాటలు ఆయనే చెబుతారు. కక్ష రాజకీయాలు చేయబోమని అంటారు. మళ్లీ ఆయనే తప్పు చేస్తే తాట తీస్తామని చెబుతారు. చంద్రబాబు పైకి కనీసం నటించనన్నా నటిస్తారు. కాని లోకేష్ ఏ మాత్రం మొహమాటం, పద్దతి ఏమీ లేకుండా అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. కేవలం మాటలే కాదు.. ఆయన పనులు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నికలకు ముందు తాను చంద్రబాబు అంత మంచివాడిని కానని కూడా ప్రచారం చేసుకునేవారు. ఆయన కనిపెట్టిన రెడ్ బుక్ అనేది కోతికి కొబ్బరికాయ మాదిరిగా ఉంది. రెడ్‌బుక్ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నది, ఇష్టారాజ్యంగా వైసీపీ వారిపై కేసులు పెడుతున్నది, దౌర్జన్యాలు, విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నది తానేనని లోకేష్ చెప్పకనే చెబుతున్నారు. రెడ్ బుక్ అనగానే ఒకరికి గుండెపోటు వచ్చిందని, ఇంకొకరు బాత్ రూమ్ లో కాలు జారిపడ్డారని.. అర్థమైందా రాజా! అంటూ మాట్లాడిన తీరు ఆయనలోని అహంభావాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారని, మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు. లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు బెయిల్ కోసం ఎన్ని వ్యాధులు ఉన్నాయని కోర్టుకు చెప్పారని ప్రశ్నించారు. కేసులు రాగానే ఎక్కడ లేని వ్యాధులు చంద్రబాబుకు గుర్తుకు వచ్చాయని అంబటి వ్యాఖ్యానించారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఆ స్కామ్‌లో మనీలాండరింగ్ జరిగిందని, చివరికి టీడీపీ ఆఫీస్ ఖాతాకు కూడా డబ్బు చేరిందని, అప్పట్లో సీఐడీ ఆధార సహితంగా చూపితే దానిని ఖండించలేక పోయారే!. దానికి తోడు ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి చంద్రబాబుకు రకరకాల జబ్బులు ఉన్నాయని సర్టిఫికెట్ తీసుకుని బెయిల్ పొందారే! అదే ఆస్పత్రిలో ఇప్పుడు ఎవరైనా వైఎస్సార్సీపీ నేత చేరితే జబ్బు లేకపోయినా చేరినట్లవుతుందా? అదెందుకు!.. .. చంద్రబాబు అరెస్టు అయితే, పాదయాత్ర ఆపేసి మరీ లోకేష్ డిల్లీకి ఎందుకు పరుగులు తీశారు? కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఏమని వేడుకున్నారు? ఇవన్ని వాస్తవాలే కదా. కాని జాక్ పాట్ మాదిరి అధికారం వచ్చింది కదా అని విర్రవీగితే లోకేష్ కే నష్టమని రాంబాబు అన్నారు. అబ్దుల్ కలాంను టీడీపీనే రాష్ట్రపతి చేసినట్లు, ఇలా ఏవేవో డాంబికాలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ రెడ్ బుక్ పేరుతో ప్రజలపైన ,ప్రతిపక్షంపై, ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడతామంటే ఎల్లకాలం వారి ఆటలు సాగవు. ఈ సంగతిని గుర్తు పెట్టుకోకపోతే అదే రెడ్ బుక్ తన మెడకు చుట్టుకుంటుందన్న సంగతి లోకేష్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకే అంత మంచిది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్ అసమర్థుడినని తానే ఒప్పుకున్నాడు: అంబటి
సాక్షి, గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుది అంతా పబ్లిసిటీ స్టంట్. చంద్రబాబు పీ-4 పేరుతో ప్రజలందరినీ అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. సంపద ఏమైంది?. రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు. గత ప్రభుత్వ పథకాలను పాతరేశారు. కొత్త పథకాల ఊసేలేదు. రాష్ట్రంలోని పేద ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతున్నారు. డబ్బులు ఉన్నోడికే మెడికల్ సీట్లు దోచిపెడుతున్నారు. నీతి, నిజాయితీకి మారు పేరు అంటే చంద్రబాబు ఎవరైనా నమ్ముతారా?. బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. పీ-4 అంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. పీ-4 పేరుతో కొత్త నాటకం..చంద్రబాబు నాయుడు పీ-4 పేరుతో కొత్త నాటకాన్ని ప్రారంభించాడు. పీ-4కు మార్గదర్శి బంగారు కుటుంబం అని కొత్త పేరు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు పీ-4 దోహదం చేస్తుందని చంద్రబాబు చెప్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొత్తగా టోల్ గేట్లు పెడతానని చెబుతున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామీణ ప్రాంత రోడ్డును చంద్రబాబు నాయుడు ప్రైవేటుపరం చేస్తున్నాడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో 58 కార్పొరేషన్లను ప్రైవేటీకరణ చేశాడు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్, సంపద సృష్టిస్తానని చెప్పాడు. పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.పేదరిక నిర్మూలన కావాలంటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంతేకానీ కాంట్రాక్టర్లను, డబ్బులు ఉన్నవారిని, బడా బాబుల్ని పీ-4 పేరుతో వేదికపైన కూర్చోబెడితే పేదరికం పోదు. ఈ రాష్ట్రంలో రెండే రెండు బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబుది, రెండోది పవన్ కళ్యాణ్‌ది. ఈ రెండు బంగారు కుటుంబాలే. గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి అన్నాడు.. శ్రమదానం అన్నాడు అవన్నీ పోయాయి. ఇప్పుడు పీ-4 పేరు చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు.చంద్రబాబు నాయుడు నేనేం తప్పు చేయనని డప్పు కొట్టుకుంటున్నాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చేసేవన్నీ తప్పులే. ఎన్టీఆర్ దగ్గర పని చేశారని చంద్రబాబు చెప్తున్నాడు. ఆయన ఇందిరా గాంధీ దగ్గర పని చేశాడు.. ఎన్టీఆర్ పని పూర్తి చేశాడు. లోకేష్ లాంటి అసమర్ధుడిని ప్రజలపై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల మంది వైట్ రేషన్ కార్డులు ఉన్నవాళ్లు ఉన్నారు. ఎనిమిది లక్షల అరవై వేల మంది ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్లని వాళ్లతో ఎలా అనుసంధానం చేస్తాడు?.పవన్ ప్యాకేజీ స్టారే..పవన్ కళ్యాణ్ నేను అసమర్థున్ని అని మనసులో మాట బయటపెట్టారు. పవన్ మాటలను జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఆలోచించాలి. లోకేష్ డబ్బులు వసూలు చేసి పవన్‌కి ప్యాకేజీ ఇస్తున్నాడు. పేదల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు. చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను.. ఐటీ నేనే తెచ్చానని పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నాడు. డబ్బులు కోసం పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశాడు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే చెప్పారు. పోలవరంపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం. చంద్రబాబు వచ్చినా.. ఆయన మంత్రులను పంపించినా చర్చకు నేను సిద్ధం. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని ఎప్పటినుంచో అడుగుతున్నాను. కానీ, తెలుగుదేశం నాయకులు గానీ చంద్రబాబు గానీ.. ఎవరు సమాధానం చెప్పడం లేదు ఎందుకు?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. చంద్రబాబు సర్కార్‌పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి. చంద్రబాబు తెలిపి తక్కువ వల్లే పోలవరం ఆలస్యమైంది. పోలవరంపై చర్చకు ఎప్పుడైనా సిద్దమే. స్పిల్ వే, కాఫర్ డ్యామ్ పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీదే. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ వేస్తారా? అని ప్రశ్నించారు. -
బాబు డబుల్ గేమ్.. సొంత ఇలాకాలో ఊహించని షాక్
చిత్తూరు, సాక్షి: ముస్లింల హక్కుల విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్న నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. చంద్రబాబు నియోజకవర్గంలో, అదీ రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు శాంతియుత నిరసనకు దిగారు. తమ సంక్షేమాన్ని, అభివృద్దిని నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు(Chandrababu).. ఇప్పుడేమో రక్షించేవాడిలా నాటకాలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పం(Kuppam)లో ఇవాళ నిరసన జరిగింది. నల్ల బ్యాడ్జిలు ధరించిన మరీ రంజాన్ ప్రత్యేక ప్రార్థనంలో పాల్గొన్నారు ముస్లిం సోదరులు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం నడుం బిగించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉంటూనే.. వక్ఫ్ సవరణ బిల్లుకు చంద్రబాబు మద్దతు ఇస్తుండడాన్ని వీళ్లంతా ఖండించారు. ఈ బిల్లు గనుక పార్లమెంట్లో పాసైతే ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోతుంది అని ఆవేదన చెందుతున్నారు. ఇదీ చదవండి: వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందేముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Bill) విషయంలో రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరో రకంగా చంద్రబాబు మాట్లాడుతుండడాన్ని రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఈ బిల్లు విషయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నాయి.ఇదిలా ఉంటే.. టీడీపీ మద్ధతు మీదనే కేంద్రం ఆధారపడి ఉందనేది విశ్లేషకుల మాట. అలాంటప్పుడు ఆ బిల్లును ఆదిలోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు జేపీసీ వరకు వచ్చి ఉండేది కాదన అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. మరోపక్క బిల్లుకి మద్దతు ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తున్నామని చెబుతుండడం మోసమేనన్నది కొందరి వాదన. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీశ్ కుమార్లపై మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి వారిని క్షమించబోమంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. -
బీసీల ఆలోచన ఆ పూటకే!
సాక్షి, అమరావతి: ‘‘ఈ బడుగు, బలహీన వర్గాల ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు... ఇప్పుడొచ్చారు.. సగం మంది వెళ్లిపోయారు. వారి ఆలోచన అంతా.. మీటింగ్ అయింది.. మా పని అయిపోయింది..! అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుబడుతున్నా.. మిమ్మల్ని కాదు.. అదే ఇక్కడున్న వాళ్లంతా ఉన్నారు.. వీళ్లకి ఓపిక ఉంది. బంగారు కుటుంబాలకు ఓపిక లేదు.. మార్గదర్శకులకు ఓపిక ఉంది. అంటే వాళ్లు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి జీవితాల్లో వెలుగులు తెస్తా..!’’ ఈ వ్యాఖ్యలు చూశారా..! 40 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత, బలహీన వర్గాల నుద్దేశించి ఆదివారం నిర్వహించిన పీ 4 సభలో మాట్లాడిన దారుణమైన మాటలివీ!! దళితులు, బడుగు, బలహీనవర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో మళ్లీ నోరు పారేసుకున్నారు. బడుగు, బలహీనవర్గాల ఆలోచన ఆ పూట వరకే ఉంటుందని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు చెప్పినా కూడా ఆలోచించరని నిందించారు. వచ్చాం.. మీటింగ్ అయిపోయింది.. మా పని అయిపోయిందని అనుకుంటూ ఉంటారని.. వాళ్ల ఆలోచనా విధానమే తప్పని వ్యాఖ్యానించారు. పేదలను ధనికులను చేస్తానంటూ జీరో పావర్టీ పీ–4 పేరుతో నిర్వహించిన సభలోనే వారిపై తనకున్న ఏహ్య భావాన్ని ఆయన బయటపెట్టారు. గతంలోనూ చంద్రబాబు పలు సందర్భాల్లో ఎస్సీ, బీసీ వర్గాలను నేరుగా దూషించి వారి పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు. దీనిపై ఎస్సీ, బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. చంద్రబాబుకు దళితులు, బీసీలంటే ఎప్పుడూ చులకన భావమేనని, తమను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేçస్తున్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అని గతంలో వారి పుట్టుకనే హేళన చేసిన హీనమైన భావజాలం చంద్రబాబుదని మండిపడుతున్నారు. నాడు తమ బాధలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను.. ‘మీ తోకలు కత్తిరిస్తా..! తమాషాలు చేస్తున్నారా? మిమ్మల్ని ఇక్కడి వరకూ రానివ్వడమే తప్పు..’ అంటూ హూంకరించిన నిర్వాకం ఆయనదే. నేనిచ్చిన బియ్యం తింటున్నారు. నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు... నాకెందుకు ఓటు వేయరు... అంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సమయంలో బ్లాక్మెయిల్ తరహాలో పేదలను చంద్రబాబు బెదిరించారు. అందుకు అనుగుణంగానే టీడీపీ నేతలు దళితులు, బీసీల పట్ల తరచూ హీన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు..?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక సభలో ఎస్సీల పట్ల అవమానకరంగా మాట్లాడటం తెలిసిందే. ‘ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వాళ్లు దగ్గరకు వస్తే వాసన వస్తుంది. వాళ్లకి చదువు రాదు..’ అంటూ టీడీపీలో ఉండగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దారుణంగా మాట్లాడారు. తాజాగా చంద్రబాబు వారి పట్ల తనకున్న చులకన భావాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. బడుగు, బలహీన వర్గాలకు అసలు ఆలోచనలే ఉండవని, డబ్బులు ఇస్తే మీటింగ్‌కు వస్తారనే రీతిలో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. పేదలను గొప్పోళ్లను చేస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ తన ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వారిని చూసి చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. వారి పట్ల తన మనసులో ఉన్న మాటను వెళ్లగక్కి బడుగులంటే తనకు ఏమాత్రం గిట్టదని మరోసారి రుజువు చేసుకున్నారు.చరిత్రలో ఎవరూ చేయలేదు..పేదరికం లేని సమాజం కోసం పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇది వినూత్న కార్యక్రమమని, కొత్త ప్రయోగమని, ఇంతవరకూ చరిత్రలో ఎవరూ అమలు చేయలేదని తెలిపారు. వెలగపూడి సచివాలయం సమీపంలో నిర్వహించిన సభలో జీరో పావర్టీ పీ–4 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. పథకం లోగో, పోర్టల్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. శాయోజీరావు సహాయం వల్లే అంబేడ్కర్ ఎదిగారని, శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వల్ల అబ్దుల్ కలాం ముందుకెళ్లారన్నారు. కలాంను రాష్ట్రపతిని చేయడంలో తన పాత్ర కూడా ఉందన్నారు. ఎన్టీఆర్ లేకపోతే తాను కూడా అందరిలా మామూలుగానే ఉండేవాడినన్నారు. హైదరాబాద్ దశ, దిశ మారడానికి తాను చేసిన ఆలోచనలే కారణమన్నారు. పీ–4 గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20 శాతం ఉన్నాయని, మార్గదర్శులుగా ఉండేవారు బంగారు కుటుంబాలతో కలసి పని చేయాలన్నారు. తలసరి ఆదాయం 2028–29 నాటికి రూ.5.42 లక్షలు, 2047కి రూ.55 లక్షలు చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. టాప్ టెన్‌లో ఉన్న పది శాతం శ్రీమంతులు అట్టడుగున్న ఉన్న 20 శాతం మందిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పవన్ దొరకడం నా అదృష్టం..2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ 2.0 సాధించడమే తన లక్ష్యమని, పీ–4 అందుకు మార్గదర్శి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి ఈ కార్యక్రమాన్ని ఒక రూపం తీసుకొచ్చి మళ్లీ ఉగాది నాటికి ప్రగతిని ప్రజలకు వెల్లడిస్తామన్నారు. 2029కి రాష్ట్రం జీరో పావర్టీలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ప్రపంచమే ఆచరించే పరిస్థితికి వస్తుందన్నారు. పవన్ కల్యాణ్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని, ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు రెండు మూడు తరాల కోసం ఆలోచిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాగా 20 లక్షల బంగారు కుటుంబాలను పైకి తెచ్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన విధాన పత్రంలో తెలిపింది. సంపన్న కుటుంబాలు పీ 4 ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయి కనీసం ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని మార్గదర్శి కుటుంబంగా నిలవాలని కోరింది. ⇒ మంగళగిరికి చెందిన గొర్రెల పెంపకందారు కడియం నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, విజయవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయేల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా పీ 4 పథకం ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. నరసింహ తన పిల్లల్ని చదివించాలని కోరగా గ్రీన్కో ఎనర్జీ అధినేత చలమలశెట్టి అనిల్‌కుమార్ మార్గదర్శిగా ముందుకొచ్చారు. ఇమ్మాన్యుయేల్ తన కూతుర్ని ఎంబీబీఎస్ చదివించాలని కోరగా మెయిల్ సంస్థల అధినేత మేఘా కృష్ణారెడ్డి వారికి మార్గదర్శిగా ముందుకొచ్చారు. కృష్ణా జిల్లాలోని తన సొంత మండలం గుడ్లవల్లేరు బాధ్యత మొత్తం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఇంత హీనంగా మాట్లాడతారా? పేదల విషయంలో మొదటి నుంచి చంద్రబాబుది ఫ్యూడలిస్టు భావజాలమే. ఎస్సీలు, బీసీల పట్ల ఆయన మాటలు, చేతలు ఎప్పుడూ లోకువగానే ఉంటాయి. బడుగు, బలహీనవర్గాల గురించి అంత హీనంగా మాట్లాడడం సరికాదు. వారికి ఆలోచనలు లేవని చెప్పడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడతారా? ఇప్పుడే కాదు.. అనేక సందర్భాల్లో ఎస్సీలు, బీసీల గురించి తక్కువగా మాట్లాడారు. ఆయనకిది తగదు. వెంటనే దళితులు, బడుగు వర్గాలకు క్షమాపణ చెప్పాలి. – చింతపల్లి గురుప్రసాద్, బహుజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడుబాబులో రెండో వ్యక్తి బయటకొచ్చాడు చంద్రబాబు చేతలకి, మాటలకి పొంతన ఉండదు. పేదలను ఎప్పుడూ అవమానిస్తారు. ఇప్పుడు మరోసారి అవమానించారు. ఎస్సీలు, దళితులంటేనే ఆయనకు పడదు. పేదల కోసమని నిర్వహించిన సభలో జనం వెళ్లిపోతున్నారని సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏమిటి? చంద్రబాబులో రెండో వ్యక్తి బయటపడ్డాడు. ఆయన్ను దళిత, బీసీలు నమ్మకూడదు. ఆయన తన మాటలను ఉపసంహరించుకోవాలి. – నత్తా యోనారాజు మాల మహానాడు నాయకుడుగుణపాఠం తప్పదు పేదలకు మేలు చేయకపోగా వారి గురించి తరచూ అవమానకరంగా మాట్లాడడం చంద్రబాబుకే చెల్లింది. పీ–4 మీటింగ్ అని పిలిచి ఒక్కరికి మేలు చేయకపోగా తిట్లు బహుమతిగా ఇస్తారా? బీసీ, ఎస్సీలను తిట్టడానికి బహిరంగ సభ పెడతారా? పేదల గురించి ఇంత అన్యాయంగా మాట్లాడిన రాజకీయ నాయకుడు దేశంలో మరొకరు లేరు. వారికి ఆలోచనలే లేవని అనడం అహంకారం. త్వరలోనే బీసీలు, ఎస్సీలు ఆయనకు గుణపాఠం చెబుతారు. – ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రిపేదలు తన బానిసలుగా ఉండాలనే ఆలోచన బాబుది పేదలు ఎప్పుడూ తమ బానిసలుగా ఉండాలనే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు. జీరో పావర్టీ పీ–4 సభలో దాన్ని బయటపెట్టారు. ఎస్సీ, బీసీల గురించి అంత నీచంగా మాట్లాడడం దారుణం. గతంలోనూ ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని నీచంగా మాట్లాడారు. పేదలు ఎప్పుడూ తమ కాళ్ల దగ్గరే ఉండాలనే ఆలోచన చంద్రబాబుది. – కైలే అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేఅసలు మనిషి బయటపడ్డాడు.. చంద్రబాబులోని అసలు మనిషి పీ–4 మీటింగ్‌లో బయటపడ్డాడు. వారి కోసమని మీటింగ్ పెట్టి తిట్టడం ఏమిటి? సభకు వచ్చిన జనం వెళ్లిపోతుంటే ఇష్టం వచ్చినట్లు తిడతారా? పేదలు కూడా సంపన్నుల్లా అలోచించాలని చెప్పి వారిని తిట్టడం అన్యాయం. బీసీలు, ఎస్సీలను చంద్రబాబు ఎప్పుడూ గౌరవించలేదు. అనేకసార్లు అవమానించారు. ఇప్పుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. – జోగి రమేష్, మాజీ మంత్రి -
వెలుగులోకి ఎమ్మెల్యే పరిటాల సునీత దాష్టీకం
శ్రీసత్యసాయి: పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్యను దారుణంగా హత్య చేశారు. కురుబ లింగమయ్యపై కర్రలు, రాడ్లతో పరిటాల వర్గీయులు దాడి చేశారు. దాడితో అప్రమత్తమైన కుటుంబసబ్యులు లింగమయ్యను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లింగమయ్య మృతి చెందారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులే చంపారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాళులుకురుబ లింగమయ్య మృతదేహానికి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎమ్మెల్యే పరిటాల సునీత నైతిక బాధ్యత వహించాలి. పరిటాల సునీత హత్యా రాజకీయాలు చేస్తున్నారు.పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా హింసకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
‘మీ అన్నగా చెప్తున్నా’ అన్న పవన్ మాటలు ఏమయ్యాయి?
తాడేపల్లి : గత ఏడాది ఉగాది పండుగనాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ఎన్నో మాయమాటలు చెప్పి వాలంటీర్లను ముంచేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ విమర్శించారు. ఈరోజు(ఆదివారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధానకార్యాలయం నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన పుత్తా శివశంకర్.. గత ఉగాది నాడు చంద్రబాబు, పవన్‌లు ప్రజల్ని ఎలా నమ్మించి మోసం చేశారనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. ఇద్దరూ కలిసి వాలంటీర్లను నిలువునా గొంతుకోసేశారు. గత ఉగాది పండుగ నాడు వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుది. ‘‘ మీ అన్నగా చెప్తున్నా’ ’నంటూ పవన్ సైతం వాలంటీర్లకు పదివేల జీతం హామీ ఇచ్చారు. వారికి లక్ష రూపాయల వరకూ సంపాదించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. మరి ఇప్పుడు ఆ హామీ సంగతిని పక్కన పెడితే.. ఇప్పుడేమో అసలు వాలంటీర్ల వ్యవస్థే లేదంటున్నారు. వాలంటీర్లను విజయవాడ వరదలప్పుడు వాడుకున్నది ఎవరు?, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలన రెండున్నర లక్షల వాలంటీర్ల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. రోడ్డున పడిన వాలంటీర్ల కుటుంబాలను ఆదుకోవాలి’ అని పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు.