breaking news
-
కీచకులకు చంద్రబాబు సర్కార్ అండదండలు: కాకుమాను
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మైనర్ బాలికపై లైంగికదాడి జరిగితే, కారకుడైన నిందితుడికి అధికారపార్టీ అండగా నిలవడం దారుణమన్నారు. తమ పార్టీకి చెందిన వ్యక్తులు ఎటువంటి ఘాతుకాలకు పాల్పడినా వారికి రక్షణ కల్పించాలన్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే..సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈనెల 2వ తేదీన 12 ఏళ్ల మైనర్ బాలికపై గిడ్డెగానిపెంట గ్రామానికి చెందిన ఆర్.రమేష్ అనే టీడీపీ కార్యకర్త లైంగిక దాడి చేశాడు. పోలీస్ విచారణలో ఆ బాలికపై నిందితుడు రమేష్ అత్యాచారం చేసినట్టు నిర్ధారణ కావడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వెంటనే అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనితో నిందితుడు పరారయ్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం చూసి రాష్ట్రమంతా నివ్వెరపోయింది.ఈ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని భావిస్తున్న తరుణంలో ఏకంగా కేసును రాజీ కుదిర్చేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. తమ పార్టీకి చెందిన కార్యకర్తను కాపాడుకునేందుకు తెలుగుదేశం నేతలు ఏకంగా బాలిక తండ్రిని బెదిరించి, బలవంతంగా లక్ష రూపాయలకు రాజీకి రావాలని ఒత్తిడి చేశారు. దీనిలో భాగంగా రూ.20 వేలు కూడా అడ్వాన్స్‌గా చెల్లించారు. తన నియోజకవర్గంలోనే ఇటువంటి దారుణం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? అంటే తన పార్టీకి చెందిన వారు ఏది చేసినా అది సమంజసమేనని సమర్థిస్తున్నారా?గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహించే పిఠాపురం నియోజకవర్గంలో బాలికపై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కార్పోరేటర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆడబిడ్డలపై దాడులు చేసే వారికి అదే వారి ఆఖరి రోజు అంటూ గొప్పగా ప్రకటనలు చేసిన చంద్రబాబు తమ పార్టీ వారే కీచకులుగా మారి మహిళలు, బాలికలపై లైంగికదాడులకు పాల్పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మహిళల రక్షణ అంటూ మాట్లాడే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలో జరిగిన ఇటువంటి దారుణాలపై నోరు మెదపడం లేదు.దిశయాప్‌ను నిర్వీర్యం చేశారురాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వ్యవసనాల బారిన పడిన ఆకతాయిలు బాలికలపైనా, మహిళలపైనా దాడులకు తెగబడుతున్నారు. గతంలో మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశయాప్‌ను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎంతో గొప్పగా శక్తీయాప్ను తీసుకువచ్చామని ప్రచారం చేసుకుంది. అయినా కూడా రాష్ట్రంలో ప్రతిచోటా మహిళలపై ఈరకమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని నివారించే చిత్తశుద్ది కూటమి ప్రభుత్వంలో కనిపించడం లేదు -
‘ఆమె రాజకీయాలు కాంగ్రెస్ కోసమా?, బాబు కోసమా?’
తాడేపల్లి: వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మైనార్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీలు తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్. వక్ఫ్ బిల్లు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిలతో ాట్లాడిస్తున్నారన్నారు. ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి మరొక అంశాన్ని పైకి తేవడం చంద్రబాబుకి అలవాటని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయాల్లో ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, డైవర్షన్ చేయడానికి షర్మిలను ఉపయోగించుకుంటున్నారన్నారు. వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయాల్లో ఆమె ఒక భాగంగా మారారన్నారు.‘ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, వారికిచ్చిన మాట తప్పుతూ వక్ఫ్ బిల్లు విషయంలో మైనార్టీలకు చంద్రబాబునాయుడుగారు ద్రోహం చేశారు. ఇప్పుడు వారికి సమాధానం చెప్పలేక టీడీపీ పార్టీ నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా షర్మిలను రంగంలోకి దిగారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. విజయవాడ వరదలు అంశం అయినా, తిరుపతి లడ్డూ విషయం అయినా, ఇప్పుడు వక్ఫ్ బిల్లు విషయం అయినా ఇలా చంద్రబాబుగారి ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా డైవర్ట్ చేయడానికి షర్మిళగారు రావడం, ప్రెస్మీట్లు పెట్టడం అన్నది ఒక రివాజుగా మారింది.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల ప్రభుత్వంలో ఉన్నవారిని నిలదీయాలి, ప్రజల తరఫున ప్రజా సమస్యలపై వారిని ప్రశ్నించాలి. కాని దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షంలో ఉన్నవారిని నిలదీస్తూ ఒక ప్రతిపక్షానికి చెందిన రాష్ట్రశాఖ అధ్యక్షురాలైన షర్మిల రాజకీయాలు చేస్తున్నట్లుంది. రాజకీయాల్లో ఇది వింతగా ఉంది. చంద్రబాబు ఎప్పుడు డైవర్షన్ కావాలనుకుంటే అప్పుడు ఆమె రంగంలోకి దించుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఏం చేస్తున్నారన్నదానిపైనే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.మరి ఆమె చేస్తున్న రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కోసమా? లేక చంద్రబాబుకోసమా?గత ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించడమే లక్ష్యంగా పనిచేశారు. వారికి సంబంధించిన మాధ్యమాల్లో వారు చెప్పినట్టుగానే మాట్లాడారు. ఆమేరకే నడుచుకున్నారు. ఇక్కడే షర్మిల అసలు ఉద్దేశాలు బయటపడ్డాయి’ అని శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్: అంబటి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏపీకి అన్యాయం జరుగుతుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ప్రత్యేక హోదా ఎగిరిపోయింది. ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారు. పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు.‘‘పోలవరం ప్రాజెక్టు 47.72ను ఎత్తు నుంచి 41.15 ఎత్తుకు తగ్గించారు. చంద్రబాబు దీనికి ఒప్పుకున్నాడు. కేంద్ర జల శక్తి వార్షిక నివేదికలో కూడా ఇదే పేర్కొంది. పోలవరాన్ని41.15 తగ్గించి కేంద్రం 25 వేల నుంచి 30 వేల కోట్లు ఎగ్గొడుతుంది. లోకేష్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి చంద్రబాబు దీనికి ఒప్పుకున్నాడు. ఇది దారుణమైన అంశం. వైఎస్సార్సీపీపై విరుచుకుపడి కథనాలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ కథనాన్ని ఎందుకు రాయరు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు.‘‘పోలవరం ఎత్తును తగ్గించారని నేను చెబుతున్న మాటలు తప్పయితే కేంద్ర మంత్రులు గాని రాష్ట్ర మంత్రులు చెప్పాలి. పోలవరం ఎత్తు తగ్గిస్తే మంత్రులు ఎందుకు మాట్లాడలేదు. షర్మిల చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో షర్మిల సింహభాగం పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి, చంద్రబాబుతో కలిసి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతుంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘ఆస్తి తగాదాలుంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలి. చంద్రబాబుకి చెల్లెలు ఉన్నారు. వాళ్లకి హెరిటేజ్‌లో భాగం ఇవ్వమంటే ఇస్తాడా?. వైఎస్ జగన్‌ను దెబ్బతీయడానికి షర్మిలతో మాట్లాడిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ దమ్ము మీకుందా..? టీడీపీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్
తాడేపల్లి : వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ లో తాము(వైఎస్సార్సీపీ) వ్యతిరేకించలేదని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా అంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేయాలని తమ పార్టీ విప్ జారీ చేసిన సంగతిని వైవీ సుబ్బారెడ్డి మరోసారి గుర్తు చేశారు. వక్ఫ్ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించలేదని టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఈ మేరకు ‘ ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు వైవీ సుబ్బారెడ్డి. ‘మేం వ్యతిరేకించామనడానికి లోక్ సభ, రాజ్యసభల్లో రికార్డయిని ఉభయసభల కార్యాకలాపాలే సాక్ష్యం. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై నేను చేసిన ప్రసంగం మరొక ప్రత్యక్ష సాక్ష్యం. బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించలేదని అని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా?, నిరూపించమని సవాల్ విసురుతున్నా. ఫేక్ న్యూస్ ల మీద రాజకీయాలు చేసే అలవాటు మీకు ఎలాగూ ఉంది’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారువక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు: వైఎస్సార్సీపీ@JaiTDP బిల్లును మేం వ్యతిరేకించలేదు అని నిరూపించే దమ్ము మీకు ఉందా? నిరూపించమని సవాల్ విసురుతున్నాం. ఫేక్ న్యూస్‌ల మీద రాజకీయాలు చేసే అలవాటు మీకు ఎలాగూ ఉంది.— Y V Subba Reddy (@yvsubbareddymp) April 4, 2025. -
మైనార్టీలకు చంద్రబాబు వెన్నుపోటు: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మైనార్టీలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. అబద్ధాలు, అవాస్తవాలు లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదని మండిపడ్డారు. ఏరుదాటాక తెప్ప తగలేయడం చంద్రబాబుకు అలవాటే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి మేరుగు నాగార్జున తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్సీపీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. టీడీపీ, ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని ఖండిస్తున్నాం. రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన ప్రసంగం అందరూ చూడండి. దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుకు మేం వ్యతిరేకిస్తున్నామని వైఎస్ అనేక సార్లు చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభ, రాజ్యసభలో ఓటేశాం. ఏరుదాటాక తెప్ప తగలేయడం చంద్రబాబు అలవాటు. మైనార్టీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. ఎన్నికల్లో వాడుకున్నాడు ఇప్పుడు వదిలేశాడు. మైనార్టీలకు అన్యాయం జరిగితే అంగీకరించనని ఎన్నికల సమయంలో చెప్పారు. గుంటూరు జిల్లా ఎంపీ మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామా చేస్తామన్నారు. అందరూ కలిసి మైనార్టీలకు ద్రోహం చేశారు. టీడీపీ, చంద్రబాబు చేసిన మోసంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. దీన్ని తప్పించుకోవడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు.వైఎస్సార్సీపీ రాజ్యసభలో విప్ జారీ చేయలేదని.. బిల్లుకు అనుకూలంగా ఓటేసిందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. టీడీపీ అనుకూల జర్నలిస్టులు, అనుకూల మీడియా ఈ ఫేక్ న్యూస్‌ను నడుపుతున్నారు. అబద్ధాలు, అవాస్తవాలు లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదు. చంద్రబాబు చెబుతాడు.. ఆయన సానుభూతి పరులు ప్రచురిస్తుంటారు. ఎన్టీఆర్ వెన్నుపోటు దగ్గర్నుంచి అప్పుల వరకూ చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పులున్నాయని ప్రచారం చేశారు. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పులున్నాయంటాడు. కానీ, వేటికీ ఆధారాలు చూపించరు. 5 లక్షల 62 కోట్ల రూపాయల అప్పులున్నాయని కేంద్రం చెబుతోంది. పీ-లో భాగంగా పేదలను సంపన్నులను చేస్తానని మభ్యపెడుతున్నాడు. రాష్ట్రంలో పేదలు ఎంత మంది?. ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవారెందరో ప్రజలకు అర్ధమయ్యేట్లు చంద్రబాబు చెప్పాలి. రాష్ట్రంలో కోటి 61 లక్షల కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులున్నాయి. ఈ రాష్ట్రంలో ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేది 8 లక్షల 60 వేల కుటుంబాలు మాత్రమే. చంద్రబాబు చేసిన మోసానికి యావత్ ముస్లిం, నార్టీ లోకం రగిలిపోతోంది. వైఎస్ జగన్ మీద మరక వేయాలని చంద్రబాబు చూస్తున్నాడు. మీరు ఎంత బురద జల్లినా జగన్ కడిగిన ముత్యంలా బయటపడతాడు. తస్మాత్ చంద్రబాబు.. ప్రజలే నీకు బుద్ధి చెబుతారు అంటూ’ ఘాటు విమర్శలు చేశారు. -
నాగబాబు పర్యటనలో రసాభాసా.. తీవ్ర ఉద్రిక్తత
కాకినాడ, సాక్షి: ఎమ్మెల్సీగా జనసేన నేత కొణిదెల నాగబాబు తొలి అధికారిక ప్రకటన ఉద్రిక్తతకు దారి తీసింది. గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్‌ను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. అయితే ప్రారంభ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ‘‘జై వర్మ’’ అంటూ నినాదాలు చేశారు. దీంతో.. తమ్ముళ్లకు కౌంటర్‌గా జనసైనికులు జై జనసేన అంటూ కౌంటర్ నినాదాలు చేశారు. నాగబాబు ప్రారంభ హడావిడిలో ఉండగానే కాసేపు ఆ పోటాపోటీ నినాదాల పర్వం కొనసాగింది. దీంతో ఆయన వాళ్ల వంక ఓ లుక్కేసి.. ఏమీ పట్టనట్లు తన కార్యక్రమంలో మునిగిపోయారు. ఈలోపు బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతపరిచే ప్రయత్నం చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ నెగ్గినప్పటి నుంచి టీడీపీ ఇంఛార్జి వర్మకు రాజకీయ ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో.. ఆ మధ్య వర్మ చేసి, ఆపై డిలీట్ చేసిన ఓ పోస్టు తీవ్ర దుమారం రేపింది. ఈలోపు ఈ మధ్య జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ గెలుపునకు ఎవరూ కారణం కాదని.. అలా ఎవరైనా అనుకుంటే వాళ్ల ‘ఖర్మ’ అని నాగబాబు వ్యాఖ్యానించడం దుమారం రేపింది. టీడీపీ కార్యకర్తలు, వర్మ అనుచరులు నాగబాబును సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ తరుణంలో నాగబాబు తాజా పర్యటనలో జరిగిన పరిణామం ఇరు వర్గాల మధ్య విబేధాలను మరోసారి బయటపెట్టింది. -
‘మిస్టర్ పవన్.. దీపక్ తాట ఎందుకు తీయలేదు?’
సాక్షి, తాడేపల్లి: రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ విద్యార్ధి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది.. చంద్రబాబు ఏం చేశారు?. రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు.. ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.విద్యార్థిని నాగాంజలి మృతిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పందిస్తూ..‘నాగాంజలి మృతి చాలా బాధాకరం. నరరూప రాక్షసుడి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 12 రోజులు మృత్యువుతో పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్లో రాసింది. దీపక్ పనిచేసే కిమ్స్‌లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నుంచి కనీస స్పందించలేదు. వైద్యం అందుతుందో కూడా ఆరా తీయలేదు.పవన్.. కేవలం మాటలేనా?ఆడపిల్లలకు అన్యాయం చేస్తే అదే ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. పోలవరం సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. నాగాంజలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు. నాగాంజలికి అంత అన్యాయం జరిగితే దీపక్ తాట ఎందుకు తీయలేదు పవన్?. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా పవన్. మీ మాటలు చేతలకు పనిచేయవా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని మంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారు. నాగాంజలి 12 రోజులుగా ఆసుపత్రిలో వైద్యం పొందుతుంటే.. వారిని కనీసం పరామర్శించారా?. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలైనా ఇచ్చారా?.ఆడబిడ్డలకు రక్షణ కరువు..ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారా?. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కామెడీ స్కిట్స్ చూసి ఎంజాయ్ చేసే శ్రద్ధ ఆడపిల్లల మీద లేదా?. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడుకుంటున్నారు. ఆడ పిల్లలు, ప్రజల రక్షణపై పోలీసులు దృష్టిపెట్టడం లేదు. ఆడపిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా శిక్షలు పడవనే ధైర్యంతో బరితెగించి రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఏపీలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరందిశ యాప్ కాపీనే శక్తి..గతంలో వైఎస్ జగన్ దిశా యాప్ తెచ్చారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రంతో పొత్తులో ఉన్న మీరు దిశా చట్టాన్ని ఎందుకు ఆమోదించుకోలేక పోతున్నారు?. దిశ యాప్‌పై ఇప్పటి హోం మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తిగా పేరు మార్చారు. మీ శక్తి యాప్ ఏమైపోయిందో హోమ్ మంత్రి సమాధానం చెప్పాలి. శక్తి టీమ్‌లు ఎక్కడికి పోయాయి?. శక్తి యాప్ సరిగా పనిచేసుంటే ఆడపిల్లలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?. అనిత మాటలు చేతల్లో కనిపించవా?. నిందితులు తెలుగుదేశం వారైతే వారికి రక్షణ కల్పిస్తున్నారు. కేసుల నుంచి బయటపడేలా ప్రభుత్వం చూస్తోంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేశామా అనే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇప్పటికైనా మంత్రి మేల్కోవాలి. ఇలాంటి ఘటనలు మరలా పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మహిళల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తున్నాం.బాధితురాలికి న్యాయం జరగాలి..నాగాంజలి మృతిపై మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ స్పందిస్తూ..‘నాగాంజలి మరణం బాధాకరం. బాధితురాలు సూసైడ్ నోట్లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తాం. నాగాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం తమ బాధ్యతగా ఆదుకోవాలి. నిందితుడు నుంచి ఆర్థిక సహాయం బాధితురాలికి అందకుంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. ఈ ఘటనపై హోం మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించక పోవడం బాధాకరం. -
అభిమానుల గుండెల్లో పవన్ గునపాలు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానులతోపాటు కాపు సామాజిక వర్గం వారందరి గుండెల్లోనూ గునపాలు దించేలా మాట్లాడారు. తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకుని వదిలేస్తానని, వారి ఆకాంక్షలకు తగినట్లు పనిచేయడం తన పని కాదన్నట్టుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో డ్రామా ‘పీ-4’ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ తనకు సత్తా లేకపోవడం వల్లనే సమర్థుడు, అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబుకు 2014 నుంచి మద్దతిస్తున్నాని చెప్పడం విని అభిమానులు హతశులయ్యే ఉంటారు.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లకు మాత్రం ఈ మాటలు చెవికి ఇంపుగా అనిపించి ఉండవచ్చు. పవన్ మన చెప్పుచేతల్లోనే ఉంటాడులే అని మనసులో ఉప్పొంగిపోయి ఉండవచ్చు కూడా. కానీ.. పదేళ్లుగా పవన్ ఎక్కడకు వెళ్లినా సీఎం, సీఎం అంటూ నినాదాలు చేసే అభిమానుల మాటేమిటి? వాస్తవానికి ఇలాంటి అభిమానులు పవన్ లాంటి నేతను నమ్ముకోవడం వారి దురదృష్టం. ఒక్కటైతే వాస్తవం.. పవన్ ఏనాడూ నిజాయితీగా, నిబద్ధతతో వ్యవహరించలేదు. అభిమానులకు కష్టంగా ఉండవచ్చు కానీ.. ఆయన కేవలం సినిమా గ్లామర్ మాత్రమే ఆయన్ను ఈ స్థాయికైనా చేర్చింది. కాపు సామాజికవర్గం నేతలు చాలా మంది ఈయన కన్నా బాగా వారికి అండగా నిలబడ్డారు. అయినా ఎందుకో వారికి ఈయనపైన అభిమానం పెరిగింది. బహుశా మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కావడం, ప్రజారాజ్యం పార్టీని పెట్టినా నిలదొక్కుకోలేకపోయారన్న సానుభూతి కావచ్చు. పవన్ కళ్యాణ్ ఆ లోటును తీర్చి తాము కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి అవుతారన్న ఫీలింగ్ కావచ్చు.. వీటన్నిటి రీత్యా వీరంతా మద్దతు ఇచ్చారు.గతంలో కాపు సామాజికవర్గం వైఎస్సార్సీపీకి కూడా బలంగా మద్దతు ఇచ్చినా, 2024లో మాత్రం అత్యధికులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపే మొగ్గారన్నది ఎక్కువ మంది విశ్లేషణ. అందులో వాస్తవం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈయనకు గాలం వేసి తనవైపు లాగడంలో సఫలమయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా 2019లో ఘోర పరాజయం రీత్యా భయపడి, చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు. జాక్ పాట్ తగిలినట్లుగా కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ మంత్రి అయ్యారు. చంద్రబాబు, పవన్లకంటే లోకేశే ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, రెడ్ బుక్ పేరుతో అరాచకాలను ప్రోత్సహిస్తున్నా వీరు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని చాలామంది చెబుతున్నారు.పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో అప్పడప్పుడూ తన శాఖను పర్యవేక్షిస్తూ, మిగిలిన టైమ్ లో సనాతని వేషం కట్టడం, ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఎప్పుడైనా చంద్రబాబుకు అవసరమైతే ఆ పాత్రను పోషించడం, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను నిందించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ మొదటి నుంచి గందరగోళంగానే మాట్లాడుతూ వచ్చారు. ఆయన కావాలని అలా మాట్లాడుతున్నారా? లేక అవగాహన లేక వ్యవహరిస్తున్నారో తెలియదు. గత పదేళ్లలో ఆయన ఎన్ని రకాలుగా మాటలు మార్చారో చెప్పతరం కాదు. తన వ్యక్తిగత జీవితం మొదలు, తన పుట్టిన ప్రదేశం, చదువుకున్న ఊరు, ఇతరత్రా పలు అంశాలపై భిన్నమైన ప్రకటనలు చేసినా ఆయన అభిమానులు, కాపు సామాజికవర్గం వారు ఆదరించారనే చెప్పాలి.పిఠాపురంలో ఎన్నికలకు ముందు టీడీపీ నేత వర్మ చేతులు పట్టుకుని మీరే గెలిపించాలని అన్నారు. గెలిచిన తర్వాత ఆయన దేముందని తన సోదరుడు నాగబాబు అంటే కనీసం ఖండించలేదు. పిఠాపురం సభలో నలభై ఏళ్ల టీడీపీని తానే నిలబెట్టానని చెప్పారు. కాని ఇప్పుడేమో తనకు సత్తా లేదని అంటారు. తన తండ్రి గురించి సైతం రెండు రకాలుగా మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆయన కమ్యూనిస్టు, దీపారాధన దీపం వద్ద సిగరెట్ ముట్టించుకున్నారని ఒకసారి, ఎప్పుడూ రామజపం చేస్తారని మరోసారి చెప్పి విస్మయ పరిచారు. 2017 తర్వాత తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు, లోకేశ్‌లను ఎంత తీవ్రంగా విమర్శించారో, వారిద్దరిని ఎంత అవినీతిపరులుగా చూపారో, ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పొగుడుతున్నారు. వారిలో ఇప్పుడు అవినీతి కనిపించడం లేదు. సమర్దత మాత్రమే కనిపిస్తోంది. చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని అంటున్నా, భవిష్యత్తులో లోకేశ్ సీఎం అయినా కాదనకుండా పవన్ కళ్యాణ్ విధేయుడుగానే ఉంటారన్నది పలువురి నమ్మకంగా ఉంది.చంద్రబాబు, లోకేశ్‌లు కూడా ఆ రోజుల్లో పవన్‌ను బాగానే విమర్శించేవారు. అయినా ఇప్పుడు వారు పొగుడుతున్నట్లు నటిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి పవన్ కళ్యాణ్ నోరు విప్పడం లేదు కనుక వారికి ఆనందంగానే ఉంటుంది. అలా ఉన్నంతకాలం ఆయన మంచి మిత్రుడుగానే కనిపిస్తారు. ప్రశ్నించడానికి పార్టీని పెట్టానని చెప్పిన పవన్ అసలు ప్రశ్న అంటే ఏమిటో మర్చిపోయారు. గతంలో తన తల్లిని, తనను దూషించారని చెప్పిన టీడీపీని భుజాన ఎత్తుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏకంగా తనకు సత్తా లేదని చెప్పడం చూస్తే, ఒకరకంగా నిజం చెప్పారని కొందరు, తమ పరువు తీశారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ ఇంతగా దిగజారిపోతారని తాము ఊహించలేకపోయామని ఆయనకు మద్దతు ఇచ్చినవారు వాపోతున్నారు.కాపు సామాజికవర్గ నేతలు పలువురు ముఖ్యమంత్రి చంద్రబాబుపై హోరాహోరీ పోరాడారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం పెద్ద ఎత్తునసాగింది. అలాంటి వారందరిని కాదని, కాపుల రిజర్వేషన్ గురించి, కాపుల కులభావన గురించి పలుమార్లు మాట మార్చిన పవన్నే ఈసారి కాపు వర్గం వారు ఎంపిక చేసుకున్నారు. సీఎం అని అభిమానులు నినాదాలు ఇస్తుంటే గతంలో ఓటు వేయండి. సీఎం అవుతానని అనేవారు. ఆ తర్వాత టీడీపీతో పొత్తు అనంతరం తమకు సీఎం అయ్యేంత బలం లేదని, ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్యం అన్నట్లు మాట్లాడేవారు. అదే పవన్ కళ్యాణ్ టీడీపీని తానే గెలిపించానని చెబితే టీడీపీ సోషల్ మీడియా ఆయనపై విరుచుకుపడింది. జనసేన మద్దతుదారులను ఒక ఆట ఆడుకుంది. అయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే తీరుతెన్నులపై అక్కడి జనసేన స్థానిక నేత ఆరోపణలు చేస్తే వాటి గురించి వాకబు చేయకుండా, ఆయనకే నోటీసు ఇవ్వడం విశేషం. దీన్ని బట్టి పవన్ పార్టీని బలోపేతం చేసుకోవడం కన్నా, పదవిని ఎంజాయ్ చేయడం, టీడీపీకి సేవ చేయడం ద్వారా తాను కూడా లబ్ది పొందడానికే పరిమితం అయ్యారని అర్థం అవుతోందని అంటున్నారు. చిత్రం ఏమిటంటే ఏపీలో సత్తా లేదని చెబుతున్న పవన్ కళ్యాణ్ కొద్ది కాలం క్రితం తమిళనాడు వెళ్లి అక్కడ జనసేనను విస్తరిస్తానని చెప్పి వచ్చారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుగా ఉందీ వైఖరి. వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని, ఆయన నుంచి వచ్చే ప్రయోజనాల కోసమని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆడినట్లు పవన్ ఆడతారని కొంతమంది అనుకుంటున్నా, ప్రస్తుతానికి చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే ఆయన శాఖలలో వేలాది ఫైళ్లు పెండింగులో ఉన్నట్లు చంద్రబాబు సర్కారే ప్రకటించింది. ఇందులో మొదటి ర్యాంకు ఇచ్చింది. అయినా పవన్ దానిపై పెద్దగా ఫీల్ అయినట్లు లేరు. నిజానికి పవన్ కళ్యాణ్ పెద్దగా చదువుకోలేదు. కానీ, వేల పుస్తకాలు చదువుకున్నట్లు కనిపించాలన్నది ఆయన తాపత్రయంగా కొందరు అభివర్ణిస్తుంటారు. అసలు ఏ మనిషి అయినా ఎనభై వేల పుస్తకాలు చదవడం సాధ్యమేనా అని ఒకరు ప్రశ్నించారు. అదేమిటంటే ఒక మనిషి వందేళ్లు జీవిస్తాడనుకుంటే, అందులో మొదటి పదిహేనేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వరకు విద్యకు కేటాయించవలసి ఉంటుంది. అలాగే చివర ఇరవై ఏళ్లు కూడా పెద్దగా చదవలేని పరిస్థితి రావచ్చు. మనిషి వందేళ్లు జీవించడం అంటే 36500 రోజులు బతకడం అన్నమాట. రోజూ ఒక పుస్తకం చదవడం ఎక్కువ సందర్భాలలో అసాధ్యం. అందువల్ల ఎవరైనా ఏభై వేల పుస్తకాలనో, ఎనభై వేల పుస్తకాలనో, రెండు లక్షల పుస్తకాలనో చదివేశానని చెబితే అదంతా గ్యాస్ అని ఆయన వివరించారు.అంటే ఇదంతా రాజకీయ నేతల హిపోక్రసీ అన్నమాట. ప్రభుత్వపరంగా పెద్దగా పని చేయలేక, ఇటు పార్టీ పరంగా నిర్మాణం చేయలేక, ఏదో పదవిని ఎంజాయ్ చేస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీని నడపడం కన్నా వేరే పార్టీలో విలీనం చేయడం బెటర్ కదా అని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సత్తా ఉపన్యాసాలలో అబద్దాలు చెప్పడంలో మాత్రం బాగానే ఉంది. కానీ, ప్రజలకు ఉపయోగపడటంలో మాత్రం విషయం కొరవడింది. అందుకే ఆయన తనకు సత్తా లేదని అంగీకరించారని అనుకోవచ్చా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!
పిఠాపురం జమీందారుగా మెగా బ్రదర్ నాగబాబుకు పట్టాభిషేకం అయినట్లేనా?.. ఇక ఆ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు శంకు స్థాపనలు .. రివ్యూలు అన్నీ నాగబాబే చూసుకుంటారా? తెలుగుదేశం నాయకుడు వర్మను పూర్తిగా పక్కనబెట్టేసినట్లేనా?. పరిస్థితులు.. పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏ పనుల్లో ఉంటారో కానీ నిత్యం బిజీగా ఉంటారు. అటు సినిమాలు.. వైద్యం చికిత్స.. బిజినెస్ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటారు. గెలిచారే కానీ పిఠాపురం మీద ఏమీ దృష్టి సారించడం లేదు. అక్కడ అభివృద్ధి వంటి పనుల పర్యవేక్షణ.. సమీక్షలకు ఆయనకు టైం చిక్కడం లేదు. పోనీ అలాగని తనను గెలిపించిన తెలుగుదేశం వర్మకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన పరపతి పెరిగిపోతుందని, ప్రజల్లో ఆయన పలుకుబడి ఇనుమడిస్తుంది అని భయం!. అసలే గెలవక గెలవక పవన్ పిఠాపురం(Pithapuram)లో వర్మ పుణ్యమా గెలిచారు. ఇప్పుడు వర్మకు ప్రాధాన్యం ఇవ్వడానికి పవన్ కు ధైర్యం చాలడం లేదు. దీంతో పిఠాపురం బాధ్యతలు చూసేందుకు పవన్ కు ఎలాంటి ఇబ్బంది లేని.. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది..ముప్పు లేని వ్యక్తి కావాలి. సరిగ్గా ఆ ప్లేసులోకి నాగబాబు వచ్చి పడ్డారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలకు ఒక నిర్దిష్ట నియోజకవర్గం ఉంటుంది. ఆ ప్రాంతంలో వారు రాజకీయ కార్యకలాపాలు చేస్తారు కానీ ఎమ్మెల్సీలకు అదేం ఉండదు. దీంతో వాళ్లు తమకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రాజకీయం చేస్తారు.పైగా నాగబాబుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో రాజకీయంగా పట్టుంది అని చెప్పేందుకు అవకాశం లేదు. దీంతో ఆయన ఏకంగా పిఠాపురంలో పాగావేసి తమ్ముడు పవన్ తరఫున పెద్దరికం..పెత్తనం చేస్తారన్నమాట. ఈ మేరకు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు.. సమీక్షలు..అభివృద్ధిపనుల పర్యవేక్షణ కూడా నాగబాబే చేపడతారని పార్టీ ఒక ప్రకటన చేసింది.వాస్తవానికి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించాలంటే ఎమ్మెల్యేలు.. మంత్రులే చేయాలి కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ నాగబాబు చూస్తారని పార్టీ చెబుతోంది. ఇకముందు పిఠాపురంలో నాగబాబు(Naga Babu)కు ప్రాధాన్యం తప్ప ఆ ప్రకటనలో ఎక్కడా వర్మ ప్రస్తావన లేకుండా కుట్ర పన్నారు. అంటే రాజకీయంగా వర్మను ఇక తెరమరుగు చేయడమే లక్ష్యంగా పవన్.. నాగబాబు ముందుకు వెళ్తున్నారు.ఇకక ముందు వర్మ తనవాళ్ళకు ఒక పెన్షన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో ఇటు వర్మ వర్గీయులు లోలోన రగిలిపోతూ బయటకు కక్కలేక.. మింగలేక ఊరుకుంటున్నారు. మున్ముందు వర్మకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం కూడా అనుమానమే. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాము అని ఆనాడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ ఇద్దరూ మాట నిలబెట్టుకున్నట్లయితే నిన్న నాగబాబుతో బాటు వర్మ కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ ఆ ఇద్దరూ నమ్మించి వెన్నుపోటు పొడవడంతో వర్మకు ఆశాభంగం మిగిలింది. ఇక ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించడం ఆయన్ను ప్రాధాన్యమైన పోస్టింగులో ఉంచడం అనేది బ్రదర్స్ కు కూడా ప్రమాదమే. ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి ఆయనకు ఏదైనా పదవి దక్కితే ఆయన దూకుడు వేరేగా ఉంటుంది. ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది. ఇదంతా పవన్ కు, నాగబాబుకు సైతం ఇబ్బందికరమే. అందుకే వర్మకు ఈ ఐదేళ్లలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడం కలలో కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. వర్మ భుజాల మీదుగా నడిచివెళ్ళి అసెంబ్లీలో కూర్చున్న పవన్ ఇప్పుడు వర్మను పూర్తిగా అణగదొక్కేందుకే అన్నయ్య నాగబాబును పిఠాపురంలో ప్రతిష్టించినట్లు వర్మ అభిమానులు లోలోన మధనపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
షర్మిల.. జగనన్నను ఇబ్బందిపెట్టడమే మీ అసలు గమ్యం: రోజా
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ నాయకురాల షర్మిలపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతూ, ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారని అన్నారు. ఈ కేసులో నిర్దోషులను బలిచేయాలన్న ఆరాటం ఎందుకు? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘షర్మిళ ప్రెస్మీట్లో మాట్లాడిన విషయాలు చూశాం. ఒకరిపై అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసే వారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలి?. వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతూ, ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారు. ఒకప్పుడు వేల రూపాయలకూ అప్పులు చేసిన వారు ఇప్పుడు లక్షాధికారులు అయ్యారు – ఇది ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తోంది షర్మిల.వివేకాగారి హత్య జరిగినప్పుడు అధికారంలో చంద్రబాబే ఉన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించమన్నదీ, విచారణను పక్క రాష్ట్రానికి మార్చమన్నదీ మీరే. ఇప్పుడు అధికారంలో మీ చంద్రబాబే ఉన్నా, ఏడుపు మాత్రం మీదే. నిర్దోషులను బలిచేయాలన్న ఆరాటం ఎందుకు?. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలో మీరు ఓ సాధనంగా మారిన మాట వాస్తవం కాదా, షర్మిళగారు? దీని భాగంగానే మీరు నిర్దోషులపై బురదజల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.చంద్రబాబుకు మేలు చేయాలన్న మీ తాపత్రయం, మీ లక్ష్యం, మీ ఉద్దేశం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోంది. చివరికి, మీ అన్నగారిని ఇబ్బందిపెట్టడమే మీ అసలు గమ్యం. బాబు కక్ష రాజకీయాల్లో మీరు మరో కోణంగా మారిన విధానం ప్రజలు గమనిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. షర్మిళగారు ప్రెస్మీట్లో మాట్లాడిన విషయాలు చూశాం...ఒకరిపై అసూయ, ద్వేషంతో @ncbn చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసే వారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలి?వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి…— Roja Selvamani (@RojaSelvamaniRK) April 3, 2025 -
‘రియల్ ఎస్టేట్ వెంచర్లో శ్రీవారి ఆలయమా?’
తిరుపతి: ఓ రియల్ ఎస్టేట్ సంస్ధలో టీటీడీ ఆలయాలు కట్టాలనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చూస్తుంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామిని, టీటీడీని రియల్ ఎస్టేట్ వెంచర్స్ ప్రమోటర్లుగా వాడుకోవడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.‘రియల్’ వెంచర్ లో శ్రీవారి ఆలయమా?రోజూ తిరుమల ప్రక్షాళన గురించి మాట్లాడే చంద్రబాబు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన జీ స్వ్కేర్ వెంచర్ లో టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తే తప్పేంటి అని అనడం దారుణం. కూటమి పాలనలో శ్రీవారి పేరు మీద భవిష్యత్తులో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని భయాందోళనలు కలుగుతున్నాయి.దేశంలో ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలున్నాయి. వారంతా తమ సొంత ఖర్చుతో ఆలయాలు నిర్మిస్తే వాటిని టీటీడీ తీసుకుంటుందా? ఆ వెంఛర్లకు టీటీడీ ప్రమోటర్‌గా ఉంటుందా? శ్రీ వేంకటేశ్వరస్వామిని వెంచర్లకు ప్రమోటర్‌గా చేయడం కాదా ఇది? వెంచర్ల ఆదాయం పెంచడానికి శ్రీవారిని వాడుకోవడం దుర్మార్గం కాదా? దీనికి ఆగమశాస్త్ర పండితులు సలహాలు సూచనలు ఇవ్వాలనడం ఇంకెంత దారుణమైన విషయం?తిరుమలలో వరుస దారుణాలు👉కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ఆలయ ప్రతిష్ట రోజురోజుకీ దిగజారిపోతుందని నెత్తీనోరూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తిరుమలలో జరుగుతున్న వరుస సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి.👉శ్రీవారి లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారం నుంచి మొదలుపెడితే ఆనాటి నుంచి అనేక ఘటనల్లో కూటమి ప్రభుత్వ దుర్మార్గాలు వరుసగా బయటపడుతూనే ఉన్నాయి. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిజమేనని చెప్పడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది.👉చంద్రబాబు అనుమతించిన హోటల్‌కి స్వామీజీలు ధర్నాలు చేస్తే వారిని పోలీసులతో మెడపట్టి గెంటేయించారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చంద్రబాబు వెనక్కి తగ్గి అనుమతులు రద్దు చేయాల్సి వచ్చింది.👉తిరుమలలో జోరుగా మద్యం, మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. కొండపై బిర్యానీలు తింటున్నారు. గంజాయి, మద్యం మత్తులో భక్తుల మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలు కాదు. తిరుమల పోలీసులే ఆధారాలతో సహా పట్టుకున్నట్టు అన్ని మీడియాల్లో ఫొటోలతో సహా ప్రచురితం అయ్యాయి. 👉ఇటీవల ఒక అన్యమతస్తుడు బైకుపై తిరుమలకు వెళితే మానసిక వికలాంగుడు అని ప్రభుత్వం కవర్ చేసుకుంది. పాపవినాశనం జలపాతంలో జరిగిన బోట్ షికారు ఎందుకునే దానిపై ప్రభుత్వ శాఖల నుంచే భిన్నమైన అభిప్రాయాలు చెప్పినా, వాస్తవం ఏంటనేది ఇంతవరకు ప్రభుత్వం నుంచి సరైన వివరణ రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అడుగడుగునా విజిలెన్స్ లోపాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నా ప్రభుత్వం కళ్లుండీ చూసీచూడనట్టు వదిలేస్తుంది.తేడాను ప్రజలే గుర్తించారుతన చేతకానితనాన్ని ఒప్పుకోలేని ప్రభుత్వం భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ తమకుతామే కితాబిచ్చుకోవాల్సి దుస్థితి నెలకొంది. లడ్డూ నాణ్యత పెరిగిందని, అన్న ప్రసాదం బాగుందని తమకు తామే చెప్పుకోవడం తప్పించి, లోపాలు ఆధారాలతో సహా బహిర్గతం అవుతున్నా నష్టనివారణ చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రభుత్వానికి చేతకావడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల వైభవానికి ఇప్పుడు జరుగుతున్న అరాచకాలకు తేడాను పది నెలల్లోనే భక్తులు గుర్తించారు. గత మా ప్రభుత్వంపై బురదజల్లేందుకు తిరుమల కేంద్రంగా జనసేన-టీడీపీ కలిసి చేయించిన దుష్ప్రచారాన్ని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. లోకేష్ పీఏ 12 లెటర్లు పంపుతున్నాడు👉కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలను వీఐపీల అడ్డాగా మార్చేశారు. గత మా ప్రభుత్వ హయాంలో వీఐపీలకు రోజుకు 4 వేలు వీఐపీ టికెట్లు ఇస్తే, ఇప్పుడు రోజుకు 7500 టికెట్లు ఇచ్చి దర్శనం కోసం వస్తున్న సామాన్య భక్తులను గంటలపాటు క్యూ లైన్లలో మగ్గేలా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సమీక్షలో మాత్రం సామాన్యులకు పెద్ద పీట వేస్తామని పచ్చి అబద్ధాలు మాయమాటలు చెప్పుకుంటున్నారు.👉మంత్రికి వీఐపీ బ్రేక్ కోసం రోజుకు ఒక లెటర్ చొప్పున ఆమోదిస్తుంటే, మంత్రి నారా లోకేష్ పీఏ సాంబశివరావు రోజుకు 12 వీఐపీ లెటర్లు పంపుతున్నాడు. అది కూడా పీఎస్ టూ సీఎంఓ పేరుతో సాంబశివరావు పంపుతున్నాడు.👉అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇంతవరకు ఎస్వీబీసీ చైర్మన్‌ను, తిరుమల జేఈవోను, సీవీఎస్వోను, బర్డ్ డైరెక్టర్‌ను నియమించలేకపోయారు. కొండ మీద పాలన పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం’ అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల పవిత్రత కాపాడాంభక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో అలిపిరి వద్ద ధర్మశాలను కట్టాలనే నిర్ణయం కూడా వైఎస్సార్సీపీ హాయాంలో జరిగిందే. అదేదో తామే చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.రాయలసీమకు తలమానికంగా ఉన్న స్విమ్స్ ఆస్పత్రిని కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారు.ఏ విషయంలోనూ వైఎస్సార్సీపీ కన్నా మిన్నగా కూటమి పాలనలో తిరుమలలో ప్రక్షాళన చేశారో చంద్రబాబు చెప్పాలి.ఇన్ని అరాచకాలు జరుగుతున్నా సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్, ఇంకెప్పుడు మాట్లాడతారు? కొండమీద జరుగుతున్న అపవిత్రత గురించి ప్రశ్నించలేరా?చంద్రబాబుకి ఇదే నా సవాల్. టీడీపీ నుంచి ఏ నాయకుడిని పంపినా తిరుమల పవిత్రతపై వారితో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా.తిరుమల కొండ మీద ఏం జరిగిందో తెలుసుకోవాలని కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశిస్తే వారి కాళ్లూ వేళ్లూ పట్టుకుని అడ్డుకున్న సంఘటన కూటమి పాలనలో జరిగిందా? లేదా? ఇలాంటి ఘటనలు ఏనాడైనా వైఎస్సార్సీపీ పాలనలో జరిగినట్టు నిరూపించగలరా?ఏ మతస్తుడైనా హిందువుగా మారడానికి తిరుమలలో ఒక వేదిక ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నది కూడా మా హయాంలోనే అనేది గర్వంగా చెబుతున్నా.గోవింద కోటి రాసిన వారికి కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే. వేంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం కూడా మేం తీసుకున్న నిర్ణయమే.లడ్డూ నాణ్యత మా హయాంలో ఎలా ఉన్నదో ఇప్పుడూ అలాగే ఉన్నది. గడిచిన పది నెలల కూటమి పాలనలో ఒక్క విషయంలోనైనా ప్రక్షాళన జరిగి ఉంటే చూపించాలి. వేంకటేశ్వరుని స్వామిని రాజకీయాలకు వాడుకోవాలనే దురుద్దేశం ఇప్పటికైనా విడనాడాలి. -
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడికి షాక్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు కీలక సమావేశం నిర్వహించారు. తిరువూరు టీడీపీ కార్యాలయంలో నాలుగు మండలాల టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ కార్యకర్తల సమావేశంలో ఏపీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారశైలిపై టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్న నాయకులకు గౌరవం, గుర్తింపు లేనేలేదని.. ఎమ్మెల్యేకు ఉన్న అధికారాలు కట్టడి చేసి, పార్టీ ఇంఛార్జిగా మరొకరికి అవకాశం కల్పించాలని కోరారు. 20 ఏళ్ల తర్వాత టీడీపీ గెలిచిందనే సంతోషం కూడా మాకు లేదని.. ఎమ్మెల్యే నుంచి ప్రతీరోజూ అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నామని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తుంది. పార్టీ కార్యకర్తలు పూర్తి నిస్తేజంగా ఉన్నారు. పార్టీ పూర్తిగా దెబ్బతినే పరిస్థితిని ఎమ్మెల్యే కొలికపూడి కల్పించారు’’ అంటూ కార్యకర్తలు మండిపడ్డారు. -
‘చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది’
సాక్షి, కడప: రాజ్యాంగ విరుద్ద ముస్లిం సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా కడప క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదంకు సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ముస్లింలను వాడుకుని, ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. లోక్‌సభలో టీడీపీ, జనసేనల వైఖరితో ముస్లింలను వంచించారన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వక్ఫ్ సవరణ చట్టానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్ధతు ప్రకటించి మైనారిటీలపై వారికి ఉన్న వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నాయి. మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆ రెండు పార్టీలు వాడుకున్నాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు ద్రోహం చేశారు. ఆయన నిజస్వరూపం బయటపడింది. 1995లో బీజేపీతో జతకట్టిన చంద్రబాబు, 2004లో ఓడిపోయిన తర్వాత `నా జీవితంలో చారిత్రాత్మక తప్పిదం చేశానని మైనారిటీలకు క్షమాపణలు చెప్పాడు.ముస్లిం వ్యతిరేక బీజేపీతో భవిష్యత్తులో కలిసేది లేదని బహిరంగ సభలో ప్రకటించారు. కానీ 2014లో అవసరం కొద్దీ అదే ముస్లిం వ్యతిరేక బీజేపీతో జతకట్టి అధికారంలోకి వచ్చి ఒక్క మైనారిటీకి కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదు. రాష్ట్ర చరిత్రలో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర చంద్రబాబుది. మళ్లీ 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు మైనారిటీల ఓట్ల కోసం ఎన్ఎండీ ఫరూక్‌ను మంత్రిని చేసిన మోసగాడు చంద్రబాబు. 2019లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన చంద్రబాబు, మళ్లీ అధికారం కోసం 2024లో బీజేపీతో జతకట్టాడు.ఇప్పుడు ముస్లింల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వక్ఫ్ సవరణ బిల్లుకి మద్దతిచ్చి మైనారిటీలకు వెన్నుపోటు పొడిచాడు. బిల్లును వ్యతిరేకించాలని ఎందరో ముస్లిం మత పెద్దలు చంద్రబాబుని కలిసినప్పుడు వారికి అండగా ఉంటానని, అన్యాయం జరగకుండా చూస్తానని నమ్మించాడు. ఆఖరుకి పవిత్ర రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఇప్తార్ విందులోనూ మైనారిటీలకు అన్యాయం జరగనివ్వనని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తానని మోసపూరిత హామీ ఇచ్చాడు.తెలుగుదేశం పార్టీ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందన్నట్టు నేషనల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించుకున్నాడు. తీరా చూస్తే ఆ పార్టీ ఎంపీలు బిల్లుకు మద్దతు పలికి మైనారిటీలను తీవ్రంగా వంచించారు. టీడీపీ సపోర్టుతో నడిచే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు తలచుకుంటే ఈ బిల్లు చట్టంగా మారే అవకాశమే ఉండేది కాదు. అయినా చంద్రబాబు ముస్లింల మనోభావాలను కాలరాసేలా తన ఎంపీలతో బిల్లుకు మద్దతు పలికారు.మైనార్టీలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చలేదుఈ బిల్లు మైనార్టీలకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు సీఎం అయ్యాక మైనారిటీలకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. మౌజన్లు, ఇమామ్‌లకు ఇవ్వాల్సిన 6 నెలల గౌరవ వేతనాలు పెండింగ్‌లో పెట్టాడు. 50 ఏళ్లు దాటిన మైనారిటీలకు పింఛన్లు ఇస్తానని చెప్పాడు. దుల్హన్ పథకం కింద పెళ్లి కుమార్తెకు రూ.లక్ష సాయం చేస్తానని చెప్పాడు.మైనారిటీలకు రూ.5 లక్షల రుణాలు ఇప్పిస్తానని చెప్పాడు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రూ. లక్ష ఇస్తామని చెప్పాడు. వీటిలో ఏ ఒక్క హామీని కూడా ఈ పది నెలల్లో చంద్రబాబు అమలు చేసిన పాపాన పోలేదు. 2024లో హజ్ యాత్రకు వెళ్లిన ఏ ఒక్కరికీ రూపాయి కూడా సాయం చేయకపోగా విజయవాడ గన్నవరం ఎంబార్కేషన్ సెంటర్ రద్దు చేసేలా చర్యలు తీసుకున్నాడు. మసీదుల నిర్వహణకు నెలకు రూ. 5 వేలు ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.మైనార్టీలకు పెద్దపీట వేసిన వైఎస్సార్సీపీరాష్ట్రంలో మైనారిటీలకు న్యాయం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది దివంగత మహానేత వైఎస్సార్, ఆ తరువాత అదే ఒరవడిని కొనసాగించిన వైఎస్ జగన్ జగన్ మాత్రమే. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలను రాజకీయంగా ప్రోత్సహించింది. నలుగుర్ని ఎమ్మెల్యేలుగా మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా చేసిన ఘనత వైఎస్ జగన్‌దే. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా పదవిని మైనారిటీలకు ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఏనాడూ మండలిలో నలుగురు మైనారిటీలకు అవకాశం ఇవ్వలేదు.జకియా ఖానంను శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. అనేకమందికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టులు, డైరెక్టర్ పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా గత ఐదేళ్ల పాలనలో మైనారిటీల సంక్షేమం కోసం రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. జగన్ హయాంలో మైనారిటీలకు జరిగినంత రాజకీయ లబ్ధి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనారిటీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేసి బయటకు రావాలి. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి ముస్లింల గొంతు కోసిన టీడీపీలో కొనసాగితే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ముస్లిం సమాజం వెలివేస్తుందన్ని హెచ్చరిస్తున్నా.. -
‘మా పార్టీలో మీ పెత్తనం ఏంటి?’.. టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
అనకాపల్లి జిల్లా,సాక్షి: అనకాపల్లి జిల్లా టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల పెత్తనాలు టీడీపీలో ఎక్కువై పోయాయంటూ ఆ పార్టీలోని మరోవర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్ చిచ్చు పెట్టింది. జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీనిపై తాతయ్య బాబు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడి ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. పార్టీలు మారి వచ్చిన వారు పెత్తనం టీడీపీలో ఎక్కువైందని మండిపడ్డారు. అనంతరం, ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఇదే పరిస్థితి ఉంటే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోతుంది’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కొత్త నాటకానికి తెరతీసిన బాబు అండ్ కో!
వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు ఏమైనా చెబుతాడంటారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇది మరింత బాగా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఖాయం చేసిన డైలాగు ‘2029 నాటికి జీరో పావర్టీ’ అంటే మరో నాలుగేళ్లలో ఏపీలో పేదరికం ఉండదన్న మాట. ఇందుకోసం ఆయన పీ-4 అనే విధానాన్ని తెస్తారట. దీని ప్రకారం రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది ధనికులు పేదలను దత్తత తీసుకుని పైకి తీసుకురావాలట. అది సాధ్యమా? కాదా? ఇందుకు ఎన్ని వేల కోట్లు లేదా లక్షల కోట్లు వ్యయం చేయాలి? అన్నది పక్కనబెడితే, ఇదేదో కొత్త ఆలోచన అనుకున్న వారికి దీంతో బుర్ర తిరిగి పోవాల్సిందే.ఇలాంటి దత్తత కార్యక్రమాలు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు తమ ఆర్థిక స్థోమతకు తగ్గట్టు దానధర్మాలు చేస్తుంటారు. మరి కొందరు తమకు తెలిసిన పేదల కుటుంబాలలోని పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేస్తుంటారు. మరికొందరు అనాథ శరణాలయాలకు విరాళాలు ఇస్తుంటారు. దీనికి పీ-4 అని పేరు తగిలించి, వీటన్నింటినీ తన ఖాతాలోకి వేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకోసం రాత్రిళ్లు నిద్ర కూడా పోకుండా ఆలోచించానని చంద్రబాబు చెబితే ఎవరైనా విశ్వసిస్తారా? ఆయనకు నిద్రలేమి సమస్య ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది.పీ-4 కార్యక్రమం కింద పెద్ద పారిశ్రామికవేత్తలు, ధనికులు, వ్యాపారవేత్తలు, అంతా ముందుకు వచ్చి తమ ఆస్తిలో పేదలకు వాటా ఇస్తారు. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా చేసి మార్గదర్శులు అవుతారు అనుకున్న వారూ లేకపోలేదు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఆస్తి సుమారు రూ.900 కోట్లు అని ఏడీఆర్ ప్రకటించింది. దాంట్లో కొంత ఉంచుకుని మిగిలింది పేద కుటుంబాలకు ఇచ్చి వారిని కోటీశ్వరులను చేస్తారని అనుకుంటే ఆ ఊసే ఎత్తలేదని వైఎస్సార్సీపీ నేతలు ఎత్తి పొడుస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొంతకాలం క్రితం బహిరంగ సమావేశాలలో మాట్లాడుతూ తమ హెరిటేజ్ సంస్థ వాటాల్లో రెండు శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని చెప్పారు. అందులో ఏమైనా పేదలకు వాటాలిచ్చి స్థితిమంతులుగా చేస్తారేమో అని కొందరు విశ్లేషకులు ఊహించారు. అవేమీ జరగలేదు.టీడీపీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి సరిపెట్టారు. అది కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలకే కదా!. ఎంతమంది పేదలను ఆ ట్రస్టు ద్వారా కోటీశ్వరులను చేశామని చెప్పగలిగి ఉంటే దానికి ఒక అర్థం ఉండేది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఈ పీ-4 కార్యక్రమం చంద్రబాబు చేస్తున్న మరో మోసం అని వ్యాఖ్యానించారు. ఏపీలో ఆదాయ పన్ను కట్టేవారి సంఖ్య ఎనిమిది లక్షలుగా ఉందని, 90 శాతం మంది వైట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, ఇవేవి తెలియకుండా చంద్రబాబు ప్రజలను తన సూపర్ సిక్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్న మెఘా సంస్థ అధినేత పీవీ.కృష్ణారెడ్డి పీ-4 సభా వేదికపై ఉన్నారు. ఆయన తన సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచుతారేమోనని మరికొందరు అనుకున్నారు. కానీ, ఆయన ఒక విద్యార్ధికి వైద్య విద్య అభ్యసించడానికి సాయం చేస్తారట. ఆయన సొంత మండలం గుడ్లవల్లేరును దత్తత తీసుకుంటారట. అక్కడ ఏ కార్యక్రమాలు చేపడతారో తెలియదు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల నుంచి వాటాలను లాక్కున్నారని ఒక అబద్దం చెబుతూ, తమ ప్రభుత్వంలో ప్రజలకు వాటాలు ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిజంగా స్వచ్చందంగా వేదిక మీద ఉన్న చంద్రబాబు, పవన్‌లతో సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలంతా తమ ఆస్తులలో పేదలకు వాటాలు కల్పిస్తామని ప్రకటించి ఉంటే ఈ కార్యక్రమానికి మంచి గుర్తింపు వచ్చేదేమో!. కానీ, వారెవరూ ఆ పని చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ పేదలకు వాటాలు ఇస్తున్నామని సినిమా డైలాగులు చెప్పారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి అమెరికా ప్రముఖులు తమ ఆదాయంలో కొంత వాటాను విరాళాలుగా ఇచ్చేస్తుంటారు. మరో ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ అయిన చలమలశెట్టి సునీల్ కూడా ఇలాగే మరో విద్యార్ధిని దత్తత తీసుకుంటామని తెలిపారు. గత ఎన్నికలలో ఈయన వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు.వైఎస్ జగన్ పాలన సమయంలో గ్రీన్ కో కంపెనీకి భూమి కేటాయించి, విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే, తెలుగుదేశంతోపాటు, ఎల్లో మీడియా ప్రత్యేకించి ఈనాడు ఎన్ని వ్యతిరేక వార్తలు రాసిందో తెలిసిందే. వైఎస్సార్సీపీ వారికి ఏమీ చేయవద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సునీల్ సేవలను తీసుకోవడం విశేషం. ఒక విద్యార్ధిని మెడికల్ సీట్ ను ఆశిస్తోంది. ఆమెకు ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తే దాతతో పెద్దగా పని ఉండదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన 750 సీట్లను వదలుకుందన్న విమర్శలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వ రంగంలో వైద్య కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే, కూటమి సర్కార్ వాటన్నింటినీ ప్రైవేటు పరం చేస్తోంది. ఇది కూడా పీ-4లో భాగమేమో తెలియదు. ఒకవేళ ప్రైవేటు కాలేజీలో చదివించాల్సి వస్తే ఆ విద్యార్ధినికి దాత రెండో, మూడో కోట్ల రూపాయల డొనేషన్ కట్టడానికి సిద్దపడతారా? అన్నది ఒక డౌటు. చంద్రబాబు నాయుడు ఏ రోజుకారోజు ఏదో ఒక కొత్త డైలాగు తెరపైకి తెస్తుంటారు. తద్వారా అంతకుముందు తాను చెప్పిన డైలాగుల్ని జనం మర్చిపోయేలా చేయాలన్నది ఆయన లక్ష్యం. ఎటూ ఆయన భాజ భజంత్రీలు వాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉండనే ఉంది. కొన్నాళ్లపాటు ఈ పీ-4ను వీరంతా కలిసి ఊదరగొడతారు. ఆ తర్వాత సడెన్‌గా ఏపీలో పేదలు ఎవరూ లేరని ప్రకటించేసినా ఆశ్చర్యం లేదు. లేకుంటే 2029 నాటికి జీరో పావర్టీగా ఉండాలని చంద్రబాబు చెబితే అది అయ్యే పనో, కాదో అందరికీ తెలుసు.నిజానికి చంద్రబాబు ఎప్పుడూ పేదల పక్షపాతి కాదు. ఆయన 1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం, వేలాది మంది ఉద్యోగులను ఊడపీకడం చేశారు. రైతులు విద్యుత్ భారంతో అల్లాడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచారు. దానిపై పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ టైమ్ లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. దానిని చంద్రబాబు హేళన చేసి మాట్లాడే వారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని అనేవారు. అప్పుడు కూడా విద్యుత్ సంస్కరణల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు ఇస్తానని కబుర్లు చెప్పేవారు. కానీ, ఆ సంస్కరణల వల్ల పేద, మద్య తరగతి వారికి ఒరిగిందీ లేదు. చంద్రబాబు వారికి సాయం చేసింది లేదు.2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఉచితంగా విద్యుత్తు అందించి చూపించారు. ఎన్టీ రామారావు పేదలకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే, చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటన్నిటిని మార్చేశారు. అధికారం లేనప్పుడు, ఎన్నికల ప్రచారాలలో మాత్రం పేదలకు అవి చేస్తా, ఇవి చేస్తానని చెబుతూంటారు ఈయన. వీటిని నమ్మి ఓట్లు వేసి మోసపోయిన ఘట్టాలు ఎక్కువే. 2014లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీతో సహా వందల హామీలు ఇచ్చిన బాబు పవర్ లోకి వచ్చాక అరకొరగా అమలు చేసి రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాలైతే రద్దే చేయలేదు.తాజాగా 2024 ఎన్నికలలో సూపర్ సిక్స్ అంటూ ప్రచారం హోరెత్తించారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు ఇలా పలు హామీలు ఇచ్చారు. పదవిలోకి వచ్చిన తరువాత మాత్రం బడ్జెట్ చూస్తుంటే భయమేస్తోందని హామీలకు మంగళం పాడేశారు. అప్పులు చేసి సంక్షేమం చేయలేమని ఒకసారి, తాను ఎన్నికలకు ముందు ఒకరకంగా అనుకున్నానని, ఇప్పుడు పరిస్థితి అలా లేదని ఇంకోసారి చెప్పడం ఆరంభించారు. అంటే చిత్తశుద్ది లేకుండా కేవలం అధికారమే ఏకైక లక్ష్యంగా ఏ అబద్దాన్ని అయినా ఆడవచ్చన్నది ఆయన నమ్ముతున్నారన్నమాట.ఇప్పుడు ఎవరైనా సూపర్ సిక్స్ అని అడిగితే దానికి ప్రతిగా పీ-4 అమలు చేస్తున్నాం కదా! అని దబాయిస్తారు. ఎవరినైనా ధనికుడిని మీరే వెతుక్కోండి అని పేదలకు చెప్పినా చెప్పవచ్చేమో. పేదల పిల్లలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య తగ్గుతోందని ఎవరైనా అన్నారనుకోండి. పీ-4 తెచ్చాం కదా! ప్రైవేటు స్కూళ్లలో చదువుకోండి అని చెబుతారేమో!. గతంలో విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదు అని చంద్రబాబు అన్నారు. వలంటీర్లు ఎంత పేదలో అందరికీ తెలుసు. వారి సేవలను కంటిన్యూ చేస్తామని, వేతనం రూ.10వేలు చేస్తామని ఉగాది పర్వదినం రోజున ఊరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు ఆ వ్యవస్థనే తీసి వేశారు. ఈసారి ఉగాది నాడు కొత్తగా పీ-4 అన్న నాటకంలో మొదటి అంకం ప్రారంభించారు. ఇందులో ఎన్ని ప్రహసనాలు ఉంటాయో చెప్పజాలం.ఉగాది కల్లా మహిళలకు ప్రీ బస్ స్కీమ్ అమలు చేస్తామని రవాణా మంత్రి రామ్ ప్రసాదరెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఉగాది వెళ్లిపోయింది. ప్రస్తుతం బస్‌లలో ప్రయాణించే వారిలో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి వారేనన్న సంగతి తెలిసిందే. నిజంగానే వీరికి చెప్పిన హామీలు అమలు చేయాలన్న నిజాయితీ ఉంటే, పేదలకు ఉపకరించే ఈ స్కీములను ఈ ఏడాదంతా ఎగవేసి, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తారా?.మరో సంగతి చెప్పాలి.. చంద్రబాబు 2014 టర్మ్‌లో ఐదేళ్ల పాలన తర్వాత ఏపీలో నిరుపేదల శాతం 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందని, అదే జగన్ టైమ్‌లో రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నా నిరుపేదల శాతం 12 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిందని నీతి అయోగ్ నివేదికలు చెబుతున్నాయి. ఇలా ఉంటుంది చంద్రబాబు పాలన తీరు. వైఎస్ జగన్ తన పాలనలో పేదలకు, ప్రత్యేకించి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చితే చంద్రబాబు కూటమి మాత్రం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలిన దాదాపు అన్నిటికి తిలోదకాలు ఇచ్చేసింది. అమరావతిలో వ్యాపారుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్ యాభై వేల మంది పేదల ఇళ్ల స్థలాలు వెనక్కి లాగేసుకుంటోంది. దీనిని బట్టే పేదలపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏమిటో అర్థమవుతుంది.చంద్రబాబు అమరావతికి కూడా ఇలాగే విరాళాలు ఇవ్వండి. ఇటుకలు ఇవ్వండి అంటూ కొంతకాలం తిరిగారు. ఇప్పుడేమో అప్పులు ఇవ్వండని ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. ఏతావాతా పీ-4 కార్యక్రమాన్ని చూస్తే పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు, చంద్రబాబును పవన్ కళ్యాణ్, సభలో పాల్గొన్న ధనికులను చంద్రబాబు, తిరిగి ఆ బడాబాబులు చంద్రబాబును పొగుడుకోవడానికి మాత్రం బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఉపన్యాసాల సోది భరించలేక జనం మధ్యలోనే తిరుగు ముఖం పట్టారు. దీన్ని అర్థం చేసుకోలేని సీఎం యథా ప్రకారం ఆ పేద, బడుగు వర్గాలను అవమానిస్తూ వారిని తప్పుపట్టారు. దీన్ని బట్టే ఈ పీ-4 ఎంత విజయవంతం అయ్యేది అర్థం చేసుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ చంద్రబాబు అలా కాకుండా నేను సీఎంను, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవీ నాకే కావాలి.. ఎవరినైనా నేను భయపెడతా.. కొడతా.. చంపుతా.. ప్రలోభపెడతా..! అనే రీతిలో అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం అంతా చూస్తున్నాం. ఇది ధర్మమేనా? న్యాయమేనా? రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే.. తాను చేసిన మంచి పనిని చూపించి, నేను ఈ మంచి పని చేశానని ప్రజల దగ్గరకు ధైర్యంగా వచ్చి చిరునవ్వుతో వారి ఆశీర్వాదం తీసుకునేలా ఉండాలి. కానీ చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. అవి మోసాలుగా మిగిలాయి మీ జగన్ పాలనలో ప్రతి నెలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు జరిగింది. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేవి. చంద్రబాబు వచ్చిన తర్వాత నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం మాట అటుంచి.. ఉన్న ప్లేటును కూడా తీసేశారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన ప్రజల్లోకి వెళ్లలేడు. తన కార్యకర్తలను పంపించి ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పే పరిస్థితి కూడా లేదు– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రాజకీయాలలో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయత ఉండాలని నేను చాలా గట్టిగా నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటా.. పార్టీ కూడా అలాగే ఉండాలని మొట్టమొదటి నుంచి ఆశించా. కష్టకాలంలో మీ అందరూ చూపించిన తెగువ, స్ఫూర్తికి హ్యాట్సాఫ్..’ అని స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ(YSRCP) ప్రజాప్రతినిధులను పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రశంసించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా.. బెదిరింపులు, అక్రమ కేసులు, దాడులకు వెరవకుండా పార్టీ కోసం గట్టిగా నిలబడిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను అభినందించారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయని వ్యాఖ్యానించారు. ‘రాబోయే రోజులు మనవే.. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. జగన్ 1.0 పాలనలో కోవిడ్ వల్ల కార్యకర్తలకు చేయాల్సినంత చేయకపోయి ఉండవచ్చు. కానీ.. జగన్ 2.0లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు’ అని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకూడదుమొన్న జెడ్పీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులు, ఉప సర్పంచ్ స్థానాలు కలిపి దాదాపు 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే.. ఏడు చోట్ల అధికార పార్టీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల వాయిదా వేసే పరిస్థితి లేకపోవడంతో అనివార్యంగా ఎన్నికలు జరిపారు. అలా ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. అసలు టీడీపీకి ఎక్కడా కనీసం గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు. అయినా సరే.. మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభ పెట్టి.. ఏకంగా పోలీసులను వాడుకుని దౌర్జన్యాలు చేస్తూ ఎన్నికలు నిర్వహించారు. ఇన్నేళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా బుద్ధీ, జ్ఞానం రెండూ లేవు! సూపర్ సిక్స్‌లు.. మోసాలుగా మిగిలాయిఎన్నికల మేనిఫెస్టోలో 143 హామీలతో కూటమి పార్టీలు ప్రజలను మభ్యపెట్టి, ప్రతి ఇంటికి వారి కార్యకర్తలను పంపించి పాంప్లెట్లు పంచాయి. చంద్రబాబు బాండ్లు పంపించారని ప్రతి ఒక్కరికీ చెప్పి ఎన్నికల్లో గెలిచాయి. చంద్రబాబు పాలన చేపట్టి దాదాపు 11 నెలలు అవుతుంది. మరి ఆయన చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఏమయ్యాయని ఎవరైనా అడగడానికి ధైర్యం చేస్తే.. ఆ స్వరం కూడా వినిపించకుండా చేయాలని తాపత్రయపడుతున్నారు. ఆ హామీలను నెరవేర్చాలనిగానీ, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగానీ చంద్రబాబులో కనిపించడం లేదు. ప్రతి అడుగులోనూ మోసం.. పాలనలో అబద్ధాలే కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్‌లు, సెవెన్లు గాలికెగిరిపోయి మోసాలుగా కనిపిస్తున్నాయి. మాట మీద నిలబడే పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు..సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదు అని అడుగుతుంటే రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అని చంద్రబాబు అంటారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలోనే రాష్ట్రం అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించారు. అందులో రూ.3.13 లక్షల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆయన చేసిన అప్పులే అని తెలుసు. కానీ రాష్ట్రాన్ని భయంకరంగా చూపించాలని రూ.10 లక్షల కోట్లు అని చెబుతున్నారు. మరో రెండు రోజులు పోతే రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అని చెబుతాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను ఎగ్గొట్టడానికే ఈ దిక్కుమాలిన అబద్ధాలు చెబుతున్నారు. ఇలాంటి దిక్కుమాలిన అబద్ధాలు, మోసాలతో రాష్ట్రంలో పాలన చేస్తున్నాడు. ఇలాంటి పాలన పోయి మళ్లీ మాట చెబితే ఆ మాట మీద నిలబడే పాలన రావాలని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను పరిష్కరించాలని తపించే గుండె ఉండే మంచి పాలన రావాలని ప్రజలందరూ ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఉన్నదల్లా రెడ్‌బుక్ రాజ్యాంగమే..మరోవైపు ఇవాళ వలంటీర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. స్కీములూ లేవు. ఉన్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగమే. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. పోలీసులను అధికార పార్టీ కాపలాదారులుగా వాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దారుణ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం..⇒ తిరుపతి కార్పొరేషన్లో మనం 48 స్థానాలు గెలిస్తే వాళ్లు కేవలం ఒక్కటే గెలిచారు. అక్కడ ఇటీవల డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా మన కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డుగుతున్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేశారు. ఇలా చేయడానికి సిగ్గు ఉండాలి. ⇒ విశాఖ కార్పొరేషన్లో 98 స్థానాలకు వైఎస్సార్సీపీ 56 స్థానాలకు పైగా గెలిచింది. అక్కడ ప్రజాస్వామ్యయుతంగా వైఎస్సార్సీపీ మేయర్ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టారు. మన కార్పొరేటర్లు క్యాంపుల్లో ఉంటే.. పోలీసులు వారి ఇళ్ల వద్దకు వచ్చి మీ భర్తలు ఎక్కడున్నారో చెప్పాలని, లేదంటే మిమ్మల్ని స్టేషన్‌కి తరలిస్తామని బెదిరిస్తున్నారు. బుద్ధీ, జ్ఞానం ఉన్నవారు ఎవరైనా పోలీసులను ఈ మాదిరిగా వాడుకుంటారా?⇒ అనంతపురం జిల్లా రామగిరి మండలంలో పదికి తొమ్మిది స్థానాలు మనవే. వాళ్లు ఒక్కటే గెలిచారు. సంఖ్యాపరంగా చూస్తే ఉప ఎన్నికలో మనమే గెలవాలి. కానీ అక్కడ ఎస్ఐ పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చినట్లు నమ్మించి తొమ్మిది మంది మన ఎంపీటీసీలను కిడ్నాప్ చేశాడు. వీడియో కాల్లో లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడిస్తున్నాడు. అయినా సరే మన ఎంపీటీసీలు మాట వినకపోవడంతో మండల కేంద్రంలో నిర్బంధించి బైండోవర్ కేసులు పెడుతున్నాడు. దీనిపై మన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటితో ఆగకుండా.. ఆ మండలంలో భయం రావాలట..! అందుకోసం లింగమయ్య అనే బీసీ నాయకుడిని హత్య చేశారు. పోలీసుల సమక్షంలో చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు చేయిస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం?⇒ స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పంలో 16కి మొత్తం 16 ఎంపీటీసీలను మనం గెలిచాం. ఆరుగురిని ప్రలోభపెట్టగా..మిగిలిన వాళ్లు మనవాళ్లే. అక్కడ మనవాళ్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులతో అడ్డుకుని కౌంటింగ్ దగ్గరకు పంపించకుండా చంద్రబాబు ఆపించారు. అక్కడ కోరమ్ లేకపోయినా.. ఆరుగురే ఉన్నా వాళ్ల మనిషే గెలిచినట్లు డిక్లేర్ చేశాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని.. ఎంపీపీ స్థానంలో బలం లేకపోయినా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇదీ.⇒ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరంలో ఉప సర్పంచ్ ఎన్నికలు చూస్తే.. మనం 19 గెలిస్తే వాళ్లు నలుగురిని ప్రలోభపెట్టారు. మనవాళ్లు 15 మందిని పోలీసులు బందోబస్తు కల్పిస్తామని చెప్పి తీసుకెళ్లి టీడీపీ సభ్యులున్న చోట విడిచిపెట్టారు. అంటే టీడీపీ వాళ్లను దౌర్జన్యం చేయమని వదిలేశారు. కౌంటింగ్ హాల్లోకి మనవాళ్లను లోపలకి పంపించరు కానీ.. వాళ్లను మాత్రం పంపిస్తారు. అక్కడ నకిలీ వార్డు మెంబర్లతో ఐడీ కార్డులు తయారు చేశారు. అదే విషయం ఎన్నికల అధికారికి చెబితే ఎన్నిక వాయిదా వేశారు. మళ్లీ రెండో రోజు.. ఎన్నికల అధికారికి గుండెపోటు అని వాయిదా వేశారు. బలం లేనప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ⇒ ఇక తుని మున్సిపాల్టీలో 30కి 30 కౌన్సిలర్లు మనమే గెలిచాం. వాళ్ల దగ్గర ఏమాత్రం సంఖ్యా బలం లేదు. అయినాకూడా వైస్ చైర్మన్ పోస్టు దక్కించుకునేందుకు కావాలని ఎన్నికలకు అడ్డంకులు సృష్టించి వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరకు మున్సిపల్ చైర్మన్ మహిళను బెదిరించి రాజీనామా చేయించారు.⇒ అత్తిలిలో 20 స్థానాలకు మనం 16 గెలిస్తే.. వాళ్లు 4 గెలిచారు. ఒకరు డిస్ క్వాలిఫై కాగా మన బలం 15 ఉంది. అంటే అక్కడ ఎన్నికల్లో మనం గెలవాలి. వాళ్లకు సంఖ్యా బలం లేదు కాబట్టి ఎన్నిక జరపకుండా వాయిదా మీద వాయిదా వేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో జరుగుతోంది!!⇒ ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య.. మీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. మీరంతా గట్టిగా నిలబడ్డారు. నా అక్కచెల్లెమ్మలు చాలా గట్టిగా నిలబడ్డారు. దీన్ని విన్నప్పుడు చాలా సంతోషం అనిపించిన సందర్భాలున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు చూపించిన గొప్ప స్ఫూర్తితో... చంద్రబాబు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అనే సందేశం మీ ద్వారా వెళ్లింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి చిరస్ధాయిగా నిలబడుతుంది.సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తల కోసం ఎంత గట్టిగా నిలబడతానో చూపిస్తా..‘కష్ట సమయంలో ఉన్న మన కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నా. ఈ కష్ట కాలంలో మీరు చూపించిన ఈ స్ఫూర్తి, నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు. రాబోయే రోజులు మనవే. ఈసారి కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఈ సారి వచ్చినప్పుడు మీ జగన్ కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటాడు. జగన్ 1.0 పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ సమయంలో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం ఎఫర్ట్ పెట్టాం. కాబట్టి కార్యకర్తలకు ఉండాల్సినంత తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కానీ జగన్ 2.0 లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు’ – వైఎస్ జగన్‌విద్య, వైద్యం, వ్యవసాయం అధోగతి..ఇవాళ స్కూళ్లు నాశనం అయిపోయాయి. ఇంగ్లీషు మీడియం గాలికెగిరిపోయింది. నాడు ృ నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్ తీసేశారు. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ తరగతులు నిర్వహించి పిల్లలను గొప్పగా చదివించాలని ఆరాటపడే ఆలోచనలు గాలికెగిరిపోయాయి. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ లేదు. ఎనిమిదో తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్‌ల పంపిణీ ఆగిపోయింది.మరోవైపు వైద్యం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 11 నెలలకు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 104, 108 ఆంబులెన్సుల గురించి చెప్పాల్సిన పనిలేదు.ఈ రోజు వ్యవసాయం గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతన్న పూర్తిగా దళారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెట్టుబడి సహాయం కింద జగన్ పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 ఇస్తున్నాడు... మేం వస్తే పీఏం కిసాన్ కాకుండా సొంతంగా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఇచ్చిన అమౌంట్ లేదు... బాబు ఇస్తామన్నది కూడా ఇవ్వలేదు. మరోవైపు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తివేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది.పీ4 పేరుతో బాబు కొత్త మోసం..చంద్రబాబునాయుడు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి. చాలామంది చంద్రబాబు మారిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన మారలేదని నిరూపిస్తూ ఈమధ్య పీ4 అని కొత్త మోసం తీసుకొచ్చాడు. పీ4 విధానం ద్వారా సమాజంలో 20 శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అసలు చంద్రబాబుకు రాష్ట్రంలో ఎన్ని తెల్లరేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా? రాష్ట్రంలో 1.61 కోట్ల ఇళ్లు ఉంటే 1.48 కోట్ల వైట్ (తెల్ల) రేషన్ కార్డులున్నాయి. అంటే 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో కేవలం 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్ చేస్తున్నారు. అంటే 8.60 లక్షల మందికి.. 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డు దారులను అప్పగించాలి. అక్కడ కూడా మోసం చేస్తున్నాడు. పేదలు కేవలం 20 శాతం అంటున్నాడు. చంద్రబాబు చెప్పిన దానికి కనీసం వెయ్యి మంది కూడా ముందుకు రారు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. ఆయన డ్రామాలు ఆడుతున్నాడని ప్రజలకు తెలుసు. జనం నవ్వుకుంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మీటింగ్‌ల నుంచి వెళ్లిపోతున్నారు. అయినాసరే నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్లు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: దేశ జనాభాలో ముస్లింలు దాదాపు 15 శాతం ఉన్నారని.. వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. ఆర్టికల్స్ 14, 25, 26లను ఉల్లంఘిస్తుందని చెప్పారు.‘‘ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా చేసే చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 13 స్పష్టం చేసింది. నాన్ ముస్లింలను వక్ఫ్ కమిటీలలో ఎలా చేరుస్తారు. మైనారిటీలు టీడీపీ వాదనలను సమర్థించరు. చంద్రబాబు ముస్లింలను మోసం చేశారు. వక్ఫ్ విషయంలో ముస్లింలకు అండగా నిలబడతామని వైఎస్ జగన్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం’’ అని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ఏపీలో మహిళలకు రక్షణ లేదు: వరుదు కల్యాణి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని.. రాష్ట్రంలో గంటకు మూడు, నాలుగు సంఘటనలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. ఇవి ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే ఈ దారుణాలు జరుగుతున్నాయన్నారు. విశాఖ ఉన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖలోనే ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఆమె సొంత నియోజకవర్గంలో 25 పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి ఘటన జరిగి పది రోజులు అవుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎందుకు నోరెత్తి మాట్లాడలేదు?. వరుసగా ఇన్ని దారుణాలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు?. నిందితులకు రక్షణ కల్పిస్తూ, బాధితులపై కేసులు పెట్టడం దుర్మార్గం’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు.‘‘పోలీసులు మహిళల రక్షణను వదిలేసి రెడ్‌బుక్ రాజ్యాంగం కోసం పని చేస్తున్నారు. ఏపీలో మహిళలు ఇంట్లో ఉన్నా రక్షణ ఉండటం లేదు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఒక్క సమీక్ష కూడా చేయలేదు. హోంమంత్రి, సీఎంల కనీసం సమీక్షలు కూడా ఎందుకు చేయటం లేదు? -
టీడీపీ అరాచకాలు.. వైఎస్ జగన్‌ను కలిసిన చిత్తూరు వైఎస్సార్సీపీ నేత
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చిత్తూరు ఐదో డివిజన్ వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ మురళీధర్‌రెడ్డి బుధవారం కలిశారు. చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో తనపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల సీసీ కెమెరా విజువల్స్‌ను వైఎస్ జగన్‌కు ఆయన చూపించారు.సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అనుచరులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని, ఎమ్మెల్యే అరాచకాలను వైఎస్ జగన్‌కు మురళీధర్‌రెడ్డి వివరించారు. మురళీ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పూర్తి అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మురళీధర్‌రెడ్డి వెంట చిత్తూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ విజయానందరెడ్డి ఉన్నారు. -
లోకేష్.. దమ్ముంటే వారితో సెల్ఫీ తీసుకో చూద్దాం?: రోజా సీరియస్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు.. చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్‌కు ఉందా? అని సవాల్ విసిరారు.మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ఏప్రిల్ ఫూల్ చేశారు. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారు. మూడు లక్షల మందికి పెన్షన్లను తొలగించి వారిని ఇబ్బంది పెడుతున్నారు. జనాన్ని ఫూల్స్ చేయటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వలంటీర్లు, నిరుద్యోగులను ఫూల్స్ చేసి రోడ్డున పడేశారు. అమ్మ ఒడి ఇవ్వకుండా తల్లులు, పిల్లలను ఫూల్స్ చేశారు. ఉచిత బస్సు పేరుతో మహిళలను ఫూల్స్ చేశారు. సూపర్ సిక్స్ ఇవ్వటం కష్టంగా ఉందని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబుకు సూపర్ సిక్స్ ఇవ్వటం చేతకాకపోతే పదవిలో నుండి దిగిపోవాలిలక్షా 52 వేల కోట్ల అప్పులు చేసి విజనరీగా చెప్పుకుంటున్నారు. చెత్త సీఎంగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. రూ.15లక్షల కోట్ల అప్పులు చేశారంటూ వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేశారు. చివరికి తాను చేసింది తప్పుడు ఆరోపణలని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు. హామీలు ఇచ్చి జనాలను ఫూల్స్ చేశారు. రైతులకు భరోసా లేదు, గిట్టుబాటు ధర అసలే లేదు. మీరు అబద్దాలు మాట్లాడి, ఎల్లో మీడియాతో అబద్దాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే గంజాయి పండిస్తున్నారు.ఈవీఎంలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోయారు. కరువుతో జిల్లాలకు జిల్లాలు అల్లాడిపోతున్నాయి. మంత్రి నారా లోకేష్ కామెడీ పాదయాత్ర చేశారు. పెట్రోలు బంకులు, షాపుల దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ వాటి దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము ఉందా?. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఎక్కడపడితే అక్కడ గంజాయి సాగు జరుగుతోంది. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే లిక్కర్ బెల్టుషాపులు ఉన్నాయిరాజమండ్రిలో యువతి ఆత్మహత్యాయత్నం విషయంలో టీడీపీ కుట్రలు చేసింది. దీపక్ అనే నిందితుడు టీడీపీ లీడర్లకు ముఖ్య అనుచరుడు. ఆస్పత్రి కూడా టీడీపీ నేతలదే. అక్కడ సీసీ పుటేజీని ఎవరు మాయం చేశారో ఎందుకు తేల్చలేదు?. యువతి చావు బతుకుల మధ్య ఉంటే ఏజీఎం మీద చర్యలేవీ?. సూసైడ్ లెటర్ దొరికింది కాబట్టి ఏజీఎం అసలు గుట్టు బయటపడింది. బాధిత యువతికి మెడిసిన్ ఎవరు ఎక్కించారు?. ఆ అమ్మాయి జీవితంతో దీపక్ అనేవాడు ఆడుకున్నాడు.త్రిపురాంతకంలో ఎంపీటీసీ సృజనను కిడ్నాప్ చేశారు. మూడు రోజుల పాటు ఆమెను గదిలో బంధించారు. మొన్నటి జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్‌కు నిజమైన సైనికులుగా నిలబడి మావారు పని చేశారు. రెడ్ బుక్కు భయపడలేదు. పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లాగా తయారు అయ్యారు. రూల్స్‌కు విరుద్ధంగా పనిచేస్తే పోలీసులు పర్యావసానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్యాయం చేసిన వారికి పోలీసులు అండగా ఉండొద్దు.రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామంటే ఊరుకోం. పీ-4 కార్యక్రమం వలన చంద్రబాబు కుటుంబమే బాగుపడుతుందే తప్ప ప్రజలు కాదు. తిరుమలలో మద్యం, గంజాయి దొరుకుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లాడు?. తిరుపతి మెట్లు కడిగి ఎందుకు పాశ్చాత్య పడలేదు?. రాజమండ్రి ఘటనపై ఎందుకు స్పందించటం లేదు?. వెకిలి నవ్వులు నవ్వుతూ పవన్ ఎక్కడ దాక్కున్నారు?. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపి ముస్లిం సమాజాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసం చేశారు. వారిద్దరికీ సరైన సమయంలో ముస్లింలు గుణపాఠం చెబుతారు. వైఎస్సార్సీపీలోని స్ట్రాంగ్ లీడర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నన్ను అరెస్టు చేసి సంబరాలు చేసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు. -
తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి. తిరుమల కొండపై నాలుగు సార్లు ఎర్ర చందనం పట్టుకున్నారు. తిరుమలలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరికాయి. మంత్రి నారా లోకేష్ పీఏ పది నుంచి 12 లెటర్లు పంపిస్తున్నారు అంటే అసలేం జరుగుతోంది?. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకొచ్చారు.తాజాగా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి లోకేష్ పీఏ సాంబశివరావు తిరుమల దర్శనాల సిఫార్సు లేఖలతో దందా చేస్తున్నారు. గతంలో నాలుగు వేల లోపు వీఐపీ దర్శనాలు చేయిస్తే నేడు కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు ఎనిమిది వేలకు పైగా వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హిందూ వ్యతిరేకంగా లడ్డుపై వాఖ్యలు చేశారు. ఇదేనా ప్రక్షాళన అంటే.. చంద్రబాబు?. ఎలాంటి ప్రక్షాళన ఇప్పటి వరకు చేశారు చెప్పండి చంద్రబాబుఅటవీ శాఖ పరిధిలో పాపవినాశనం చుట్టూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడరు?. టీటీడీ అధికారిగా కాకుండా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మీ అనుంగు శిష్యుడిగా వ్యవహరిస్తున్నారు. తిరుమలలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది మీ పాలనలోనే. కూటమి పాలన పాపాన్నిపెంచడానికే ఇవన్నీ జరుగుతున్నాయి అని మీరు గుర్తించండి. ధర్మ వ్యతిరేకంగా మీ పాలక మండలి, సభ్యులు వ్యవహరిస్తున్నారు.పీ-4 కార్యక్రమంపై భూమన స్పందిస్తూ.. రెండు లక్షల 80వేల కోట్లు పేదలకు పంచిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కింది. మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా 5 శాతం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. మార్గదర్శి బంగారు కుటుంబం అంటూ నటనలు చేస్తున్నారు, ఆర్థిక ద్రోహమే కానీ, మరొకటి లేదు. ఈ మాయ ధనవంతులు.. పేదలకు సహాయం చేయడం అన్నది సాధ్యం కాని విషయం. పేద వాళ్ళు అందరూ చంద్రబాబు చేస్తున్న మోసాన్ని గమనించాలి. పేదలకు బాసటగా నిలిచిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే. పీ-4 ఫిలాసఫీ మానవాళికి విఘాతమే తప్ప, ఎలాంటి మేలు జరగదు అని తెలిపారు. -
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్లు కథలు చెబుతున్నారా? ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారా? వీరికన్నా ఐపీఎస్‌లే మెరుగ్గా ఉన్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్లో అర్థమేమిటి? ప్రతిగా కలెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తామని అనడం పరోక్షంగా ఎద్దేవా చేసినట్లా?. ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం కొత్త కాదు. కానీ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే అందులో ఆయన సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటారు. తనకు అన్ని అంశాలపై అపారమైన పట్టు ఉందని అనిపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ఎక్కువ సార్లు ఇవి కాలక్షేపం సమావేశాలుగా మిగిలిపోతున్నాయన్న భావన అధికార వర్గాలలో ఉంది. .. కొద్ది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి ఉపన్యాసాలు చెప్పవద్దని అనడం. ప్రజెంటేషన్స్ ఇవ్వద్దని సూచించడం విశేషం. నిజానికి ఇలాంటి వాటిల్లో చంద్రబాబు ఒక ప్రత్యేకత సాధించారని అంటారు. ఉపయోగం ఉన్నా.. లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఇచ్చినన్ని అంకెల ప్రజెంటేషన్లు మరెవ్వరూ ఇచ్చి ఉండకపోవచ్చు. వాటిలో ఎక్కువ భాగం కాకి లెక్కలే. పొంతన లేకుండా అంకెలు చెప్పేస్తూంటారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని కాదు కానీ ప్రజలను గందరగోళపరిచి తను రాజకీయంగా లబ్ది పొందడం లక్ష్యంగా ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ధోరణి అలాగే ఉంటుంది. 👉మంచి జరిగితే తన ఖాతాలోకి, తప్పు జరిగితే అధికారుల అకౌంట్లలోకి జమ చేయడం ఆయన వైఖరి. కావచ్చు. కొన్ని జిల్లాల తలసరి ఆదాయం బాగోలేదని అంటూ కోనసీమ గురించి ప్రస్తావించారు. ఏలూరు జిల్లా తలసరి ఆదాయం బాగుందట. నిజంగానే అక్కడ అభివృద్ది జరిగి ఆదాయం పెరిగిందా? లేదంటే చంద్రబాబుకు నచ్చుతుంది కనుక ఆ విధంగా అంకెలు తయారు చేశారా? అనేది చెప్పలేం. చంద్రబాబు మాట్లాడితే వృద్ది రేటు అని అంటారు. అదేమిటో మామూలు ప్రజలకు అర్థం కాదు. కానీ పదే, పదే వాడడం ద్వారా ఏదో జరుగుతోందన్న భావన కలిగించడం ఆయన లక్ష్యం. పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తేనే సంక్షేమం, అభివృద్ది చేయగలుగుతామని చంద్రబాబు చెప్పారు. అది నిజమే అనుకుందాం. కానీ ఇంత సీనియర్ అయిన చంద్రబాబుకు ఎన్నికల ముందు ఆ విషయం తెలియదా? ఇష్టం వచ్చిన రీతిలో హామీలు అడ్డగోలుగా ఎలా ఇచ్చారు? అనే ప్రశ్నకు ఏనాడైనా జవాబు ఇచ్చారా? కలెక్టర్లకు ఆ విషయం తెలియదా? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలు ఎన్ని కథలు చెప్పింది వారు కూడా వినే ఉంటారు కదా? ఇప్పుడు దాన్నంతా కలెక్టర్ల మీద తోసేసి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదా?.👉ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక, వండర్ పుల్ సర్, మిరాకిల్ సర్ అని వారు చెప్పవచ్చు. అనవచ్చు. కాని అర్థం చూస్తే అవేవో జరగడం సాధ్యం కాని అద్భుతాలు అన్నమాట. వాటిపై సీఎం కథలు చెబుతూ తమను అలా అంటారేమిటని కలెక్టర్లు అనుకోకుండా ఉంటారా! కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సైతం గత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, తోచినన్ని అబద్దాలు చెప్పడం, చివరికి వివేక హత్య కేసు వంటివాటిని కూడా అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన యత్నించారు. కలెక్టర్లు మెదడుకు పదును పెట్టాలని అంటున్నారు. ఎక్కువ సందర్భాలలో కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికే టైమ్ చాలదు. అందులోను మారిన రాజకీయ వాతావరణంలో కూటమి నేతల పైరవీలను తట్టుకోవడమే కలెక్టర్లకు ఇతర అధికారులకు పెద్ద సవాల్ అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 👉ఆయా చోట్ల అధికారులపై దురుసుగా వ్యవహరిస్తున్న కూటమి ఎమ్మెల్యేలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. వాటిపై స్పందించలేని నిస్సహాయ స్థితిలో కలెక్టర్లు ఉంటున్నారు. లేకుంటే ఒక తెలుగుదేశం పత్రిక కొందరు ఐఎఎస్‌ల భార్యలు స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారని, ఆయా పనులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక కథనాన్ని ఇస్తే.. ఐఎఎస్ అధికారుల సంఘం కనీసం ఖండించినట్లు లేదు. చంద్రబాబు కార్యాలయం దానిపై స్పందించలేదు. దీన్ని బట్టే ఐఎఎస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్(Red Book) పిచ్చిగోలకు భయపడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే కొందరు ఐఎఎస్, ఐపిఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా, ఎదురు కేసులు పెడుతూ, సస్పెన్షన్లు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న తీరు ఎదురుగా కనిపిస్తున్నప్పడు వారు మాత్రం ఏమి చేస్తారు?. ప్రజా ప్రతినిధులను కలుపుకుని వెళ్లండి, సొంతంగా ఆలోచించండి, సమస్యలు పరిష్కరించి క్రెడిట్ రాజకీయ నేతలకు ఇవ్వండని చంద్రబాబు అంటున్నారు. అంటే గతంలో చెప్పిన రాజకీయ పాలనను పరోక్షంగా మరోసారి చెప్పడమే కదా! కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కలెక్టర్లను సొంతంగా పని చేసుకోనివ్వడం లేదని ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. 👉ఉదాహరణకు.. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఎక్సైజ్ కార్యాలయంలో తిష్టవేసి నిరసన చెబితే అధికారులు ఏమీ చేయలేకపోయారు. అసెంబ్లీలో సీఎం ఆఫీస్ వద్దే విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అధికారులపై దూషణలకు దిగినా అదేమిటని ప్రశ్నించ లేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఐఏఎస్‌లకన్నా ఐపీఎస్‌లు నచ్చారట. అవును..నిజమే.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను సంతోషపెడుతున్నందున బహుశా వారే బాగా నచ్చారేమో!. 👉ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వంపై అప్పుల విషయంలో ఎన్ని అసత్యాలు చెప్పారో అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చాక సైతం అవే అబద్దాలను కొనసాగిస్తున్నారు. సంపద సృష్టిస్తానని, అప్పులు చేయనని చెప్పేవారు. కాని ఇప్పుడు ఏమంటున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలుకు కొంతమేర అప్పులు చేస్తామని చెబుతున్నారు. కలెక్టర్లు, ఐఏఎస్‌లు దీనిని గమనించలేనంత అమాయకులా?. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తిడుతుంటే దానికి కలెక్టర్లు ఎలా జవాబుదారి అవుతారు?. ఎన్నికల సమయంలో చెప్పిన హామీల అమలుకు నిధులు కేటాయించి, వాటిని విడుదల చేస్తే, అప్పుడు అమలు చేయకపోతే కలెక్టర్లు బాధ్యులవుతారు తప్ప, నిధులు ఇవ్వకుండా సీఎం అది చేయండి.. ఇది చేయండి అని చెబితే వారు కూడా ఎస్ సార్ అంటూ వినయం నటించక తప్పదు కదా!. గతంలో జగన్ టైమ్‌లో హామీలు, స్కీమ్‌ల వారీగా సమీక్షలు చేసేవారు ఎన్నికల మానిఫెస్టోని వారి ముందు పెట్టి ఏ మేరకు అమలు చేయగలిగాం.. ఎంత ఖర్చు అయింది? ఎంత డబ్బు అవసరం అన్నదానిపై చర్చించి విడుదల చేసేవారు. అలా సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికను అధికారులకు ఇచ్చి అమలు చేయాలని చెప్పే సాహసం చంద్రబాబు చేయగలరా?. మాట్లాడితే అధికారుల ఆలోచన తీరు మారాలని చెబుతారు?. అదేమిటో చెప్పరు! పడికట్టు పదాలు వాడి ప్రసంగం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. తల్లికి వందనం కింద మే నెలలో డబ్బులు ఇస్తామని అంటున్నారు. అది ఇప్పుడు గడచిపోయిన సంవత్సరానికా? లేక వచ్చే సంవత్సరానికా అని జనం అడిగితే అధికారులు ఏమి చెప్పాలి? పైగా స్కూళ్లు తెరవక ముందే పిల్లలందరికి డబ్బులు ఇస్తామని అనడంలో మతలబు ఏమిటి? జూన్ లో కొత్తగా నమోదయ్యే పిల్లలకు కూడా ఇస్తారా? ఇవ్వరా? ఇలాంటి వాటిపై కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఇదే సమస్య అన్నదాత సుఖీభవ స్కీముకు కూడా వస్తుంది కదా?. 👉అమరావతి నిర్మాణంపై కూడా పాత అసత్యాలే మళ్లీ చెప్పినట్లు అనిపిస్తుంది. ఒకపక్క బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు పెట్టి, రూ.31 వేల కోట్ల వరకు అప్పు తెచ్చి వ్యయం చేస్తున్నా, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో రోడ్లు తదితర నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నట్లుగా ఉంది. కలెక్టర్లు.. అధికార దర్పం వద్దని చంద్రబాబు అన్నారట. అంటే ఏమిటి? మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని వచ్చినా, టీడీపీ ఐడీ కార్డులు పెట్టుకుని వచ్చినా, వారికి ఎదురేగి స్వాగతం పలకాలని సూచించడమా? లేక వైఎస్సార్సీపీ అభిమానులు ఎవరైనా తమ సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వారికి ఏమీ చేయవద్దని చెప్పడమా? ఆయన మనసులోని మాటను గుర్తెరిగి అధికారులు వ్యవహరిస్తే సరిపోతుందా? ఏపీలో మాట ఇచ్చినట్లే మంచి పాలన జరుగుతోందని చంద్రబాబు అన్నట్లుగా ఎల్లో మీడియా బానర్ కథనాలు ఇచ్చినంత మాత్రాన వాస్తవాలు అధికారులకు తెలియకుండా ఉంటాయా? నిజమే..అధికారులు క్షేత్ర స్థాయిలో బాధ్యతగా ఉండాలి. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చాలి. అంతవరకు చంద్రబాబు అయినా, మరెవరైనా చెప్పడం తప్పు కాదు. కాని తాము ఇచ్చిన హామీలన్నిటికి ఐఏఎస్ అధికారులు జవాబుదారులు అయినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను వారిపైకి నెట్టివేస్తే, అర్థం చేసుకోలేని అమాయకులుగా అధికారులు ఉండరు కదా! కాకపోతే ఇప్పటికైతే ప్రభుత్వ పెద్దలు చేసే అవమానాలను మౌనంగా భరించక తప్పదేమో!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పోలీసుపై రెడ్ బుక్ రూల్
టీడీపీ కూటమి పెద్దల పైశాచికత్వం..శాంతిభద్రతలు అస్తవ్యస్తం ఓవైపు వేటు వేసి.. మరోవైపు కొత్తవారు కావాలంటూ కేంద్రానికి లేఖలు ‘రెడ్‌బుక్ కుట్ర’కు సెల్యూట్ చేస్తేనే పోస్టింగ్... నిబంధనలు పాటిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్’ తాము చెప్పినవారిని వేటాడితేనే పోస్టింగ్.. విధులు నిక్కచ్చిగా నిర్వర్తిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్.. పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తామంటేనే పోస్టింగ్.. ఖాకీ చొక్కా వేసుకున్నాం కదా .. చట్టం ముందు అందరూ సమానం అంటే మాత్రం నో పోస్టింగ్..ఇదీ పోలీసు శాఖపై చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తున్న దుర్నీతి. సాక్షి, అమరావతి: సీనియర్ అధికారులను.. వెంటాడి వేటాడి పోస్టింగ్‌లు ఇవ్వకుండా మనో వ్యథకు గురిచేస్తూ.. మంచి అధికారులను కుట్రలు చేసి పక్కనపెట్టి పాలన సాగిస్తూ.. ఉన్న అధికారులను రెడ్ బుక్ రూల్ కోసం వాడుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. శాంతిభద్రతల పరిరక్షణకు ఉద్దేశించిన పోలీసు వ్యవస్థతో ఆడుకుంటోంది. రాజకీయ స్వార్థంతో భ్రషు్టపట్టిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉందన్నదీ సంబంధం లేకుండా విధులు నిర్వర్తించే పోలీసులపై కక్ష కట్టి వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల తర్వాత కూడా రాష్ట్రంలో ఏకంగా 199 మంది పోలీస్ అధికారులకు పోస్టింగులు లేవంటే రెడ్ బుక్ కుట్ర ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. ⇒ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే పోలీస్ శాఖలో హోదా ఉన్న అధికారే. అయితే, చంద్రబాబు ప్రభుత్వ వేధింపులకు బలైనవారిలో అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులే కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే నలుగురు ఐపీఎస్‌లు, నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలు ఉండడం గమనార్హం. వీరందరికీ పోస్టింగులు ఇవ్వలేదని సాక్షాత్తు రాష్ట్ర శాసనసభకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఇంతమంది పోలీసు అధికారులను వెయిటింగ్లో ఉంచడం దేశ చరిత్రలోనే లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక కక్షపూరితంగా ఐదుగురు ఐపీఎస్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది కూడా.వెయిటింగ్లో నలుగురు ఐపీఎస్‌లు2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యలకు తెగించింది. 24 మంది ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. అధికారంలో ఉన్న పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ విధానాలను అమలు చేసే ఐపీఎస్‌పై ప్రతాపం చూపించింది. ఐదు నెలల తరువాత దశలవారీగా కొందరు ఐపీఎస్‌లకు అదీ అప్రాధాన్యమైన పోస్టింగులు ఇచ్చింది. కానీ, నేటికీ నలుగురిని వెయిటింగ్‌లోనే ఉంచింది. సీనియర్ ఐపీఎస్‌లు కొల్లి రఘురామ్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, జాషువాలు అందుబాటులో ఉన్నా సరే వారి సేవలను వినియోగించుకోవడం లేదన్నది సుస్పష్టం.కుట్ర పన్ని.. కక్షకట్టి రెడ్‌బుక్ కుట్రతో ఐదుగురు ఐపీఎస్‌లపై చంద్రబాబు ప్రభుత్వం కక్షకట్టింది. సీనియర్ ఐపీఎస్‌లు పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్‌కుమార్, ఎన్.సంజయ్, టి.కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేసింది. వలపు వల విసిరి బడా బాబులను బ్లాక్‌మెయిలింగ్ చేయడమే పనిగా పెటు్టకున్న కాదంబరి జత్వానీ అనే ముంబై మోడల్‌తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేయడం అందర్నీ విస్మయపరిచింది. ⇒ చంద్రబాబు రాజగురువు రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను వెలికితీశారనే కక్షతోనే ఎన్.సంజయ్‌పై అక్రమ కేసులు బనాయించి సస్పెండ్ చేశారు. కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కళ్లల్లో ఆనందం చూడడం కోసం డీజీ పీవీ సునీల్‌కుమార్‌ను వివరణ కూడా కోరకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించిన అభియోగాలపై ఆయనను సస్పెండ్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం.తమ కుట్రల అమలు కోసం కేంద్రానికి లేఖలు ఉన్న అధికారులనేమో వేధిస్తూ.. తమకు మరో ముగ్గురు ఐపీఎస్‌లు కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. మరీ ముఖ్యంగా యూపీ కేడర్‌లో పనిచేస్తున్న అధికారి కోసం పట్టుబడుతోంది. ఆయనైతే తమ కుట్రల అమలుకు, ప్రత్యర్థులను వేటాడేందుకు సమర్థంగా ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. అయితే, డిప్యూటేషన్ నిబంధనలు అనుమతించకపోవడంతో కేంద్రం నుంచి స్పందన రాలేదు. కీలకమైనప్పటికీ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే క్షేత్రస్థాయి పోలీసులను కూడా చంద్రబాబు సర్కారు వేధిస్తోంది. నాన్ క్యాడర్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు కలిపి మొత్తం 195 మందికి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి పోస్టింగులు ఇవ్వకపోవడమే దీనిని నిదర్శనం. పాలనాపరమైన అంశాలతో నలుగురైదుగురిని స్వల్ప కాలం వెయిటింగ్లో ఉంచడం సాధారణం. తర్వాత ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సద్వినియోగం చేసుకోవడం రివాజు. ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసింది. ఇలా పక్కనపెట్టినవారిలో నాన్ క్యాడర్ ఎస్పీలు పి.సత్తిబాబు, పి.వెంకటరత్నం, బి.లక్ష్మీనారాయణ, ఎ.సురేశ్‌బాబు ఉన్నారు. 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలనూ వెయిటింగ్లో పెట్టింది.జీతాలివ్వకుండా ‘పచ్చ’ పైశాచికత్వం ఏకంగా 199 మంది పోలీసులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. వెయిటింగ్లో ఉన్నారని చెప్పి వీరికి 10 నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఆర్ధికంగా పోలీసు అధికారులు ఇబ్బందులు పడుతూ ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీసు అధికారులు ఇంతటి దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.