breaking news
-
అణచివేతలో.. ఇందిరమ్మకు తీసిపోని లోకేశ్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేశ్ మాటల తీరు, చేష్టలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితులు కూడా 1975 నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి. విపక్ష నేతలందరినీ జైల్లో పెట్టి రాజ్యమేలిన ఇందిరాగాంధీ అప్పట్లోనూ ప్రతిపక్షాలను అభివృద్ధి నిరోధకులుగానే అభివర్ణించారు. పోలీసుల అకృత్యాలకు తట్టుకోలేక ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు చాలా మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ యువజన కాంగ్రెస్ సారథి. ప్రభుత్వాన్ని ఆయనే నడుపుతున్నారా? అనుకునేంత పవర్ ఫుల్. కేంద్ర మంత్రి ఒకరు సంజయ్ గాంధీ చెప్పులు మోశారన్న విమర్శలు వచ్చాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.మీడియాలో అయితే అంతా భజన వార్తలే ఇవ్వాలి. రామ్‌నాథ్ గోయాంకాకు చెందిన ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి పత్రికలే ప్రభుత్వం తప్పులపై విమర్శలతో వార్తలు ఇచ్చేవి. వాటిని కూడా సమాచార శాఖ అధికారులు సెన్సార్ చేసేవారు. దానికి నిరసనగా వార్తల బదులు ఖాళీగా ఉంచి పత్రికలను ముద్రించేవారు. దాదాపు రెండేళ్లపాటు దేశం అంతటా ఇలాంటి పరిస్థితి ఎదుర్కుంది. ఏపీలోనూ ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతమవుతుందా? అన్న భయం కలుగుతోంది. టీడీపీలో చేరకపోతే వైఎస్సార్సీపీ నేతలపై ఏదో ఒక కేసు పెట్టి వేధిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఏ జైలు చూసినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధికంగా కనిపిస్తున్నారట.ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల అరాచకాలను తట్టుకోవడం కష్టంగా ఉంటోంది. చంద్రబాబు ప్రభుత్వం వారిని నియంత్రించడం లేదు. పోలీసులు పట్టించుకోవడం లేదు. మిగతా నేరాల అదుపు చేయడం సంగతి ఎలా ఉన్నా పోలీసులు బృందాలు, బృందాలుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేసే పనిలో బిజీగా ఉంటున్నారట. ఇదంతా లోకేశ్ రెడ్ బుక్ ప్రభావమే. దానిని ఆయన కూడా నిర్ధారిస్తున్నట్లే మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు అడ్డుకుంటే రెడ్ బుక్ లోకి పేరు ఎక్కించి వేధిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక మంత్రి అంటుంటే, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేష్టలుడిగి చూస్తుంటే ఏపీలో ప్రజలను రక్షించేదెవరన్న ప్రశ్న వస్తోంది. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల కన్నా లోకేశ్‌కే అధిక ప్రాధాన్యత లభిస్తోంది. టీడీపీ వారంతా లోకేశ్ దృష్టిలో పడితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. లోకేశ్ జోక్యం చేసుకోని ప్రభుత్వ శాఖ ఉండడం లేదట. వేర్వేరు శాఖల మంత్రులు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు లోకేశ్‌నే ప్రధాన అతిధిగా పిలుస్తూన్నారు.తండ్రి ముఖ్యమంత్రి కాకుంటే, ఈయన మంత్రి అయ్యేవారా? ప్రస్తుతం యువరాజు మాదిరి ఇదంతా తమ సామ్రాజ్యం అన్నట్లు వ్యవహరించ గలిగేవారా?. తన ఆదేశాల మేరకే రెడ్ బుక్ పనిచేస్తోందని, తానే దానికి బాధ్యుడనని మరింత ఓపెన్ గా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు ఎంత వీక్ అయింది అర్థమవుతోంది. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు పాలన ఇంత అధ్వాన్నంగా లేదు. లోకేశ్ అండ్ కో ఆదేశాల మేరకు రాజకీయంగా వ్యతిరేక పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టడం, పోలీసు శాఖ దుర్వినియోగం, ఒక కేసులో బెయిల్ వస్తుందని అనుకుంటే మరికొన్ని కేసులు పెట్టి అరెస్టు చేయడం, రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూలకు తిప్పడం వంటివి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. ఏపీలో ఎవరినైనా ఎక్కువగా వేధించాలని అనుకుంటే వెంటనే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తితో ఒక కేసు పెట్టిస్తున్నారు.నటుడు పోసాని కృష్ణ మురళి వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా దాదాపు నెల రోజుల పాటు వందల కిలోమీటర్ల దూరం ప్రతి రోజు తిప్పుతూ వేధించారంటే ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకు అసలు మానవత్వం ఉందా అన్న ప్రశ్న వస్తుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఒక ఎస్టీ వ్యక్తితో ఫిర్యాదు చేయించారట. మరో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా అదే చట్టం పెట్టి బెయిల్ రాకుండా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లోకేశ్ నేరుగా రెడ్ బుక్ అంటూ ప్రజలను భయపెడుతున్నారు. ఆయన వైఎస్సార్సీపీ వారిని ఉద్దేశించి చెప్పినట్లు కనిపించినా, నిజానికి ఆయన బెదిరించింది ప్రజలనే. ఆయా చోట్ల ప్రాజెక్టులు వచ్చినప్పుడు, స్థానిక ప్రజలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. భూముల పరిహారం, కాలుష్యం తదితర సమస్యలు వస్తాయి. వాటిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెబుతారు. వారికి రాజకీయ పార్టీలు అండగా ఉంటాయి. ఆ సమస్యలలో వాస్తవమైనవి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలి. అంతే తప్ప పోలీసులను పెట్టి కొట్టిస్తామని, వేధిస్తామని అన్నట్లుగా రెడ్ బుక్ తో భయపెడతామన్నట్లుగా స్వయానా ఒక మంత్రి మాట్లాడితే ఏమి చేయాలి? అలాంటివి ఎల్లకాలం సాగవన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఇక్కడ ఇంకో చిత్రం ఏమిటంటే ప్రస్తుతం లోకేశ్ ప్రకాశం జిల్లాలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు గతంలో జగన్ ప్రభుత్వ కాలంలో మంజూరు అయినదే. రిలయన్స్ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ స్వయంగా ఏపీకి వచ్చి జగన్‌తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ పారిశ్రామిక విధానాన్ని మెచ్చుకుంటూ ప్రసంగించారు. అయినా అవేవో తామే తెచ్చినట్లు లోకేశ్ బిల్డప్ ఇచ్చుకున్నారు. అలా చేసినంత వరకు ఆక్షేపించనవసరం లేదు. కానీ, ఆ సందర్భంలో కూడా జగన్ టైమ్ లో పరిశ్రమలు వెళ్లిపోయాయని అంటూ అసత్య ప్రచారాలు చేశారు. ఈ విషయంలో తన తండ్రి చంద్రబాబును మించి అబద్దాలు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే అర్థం అవుతుంది. జగన్ టైమ్‌లో కర్నూలు వద్ద వచ్చిన గ్రీన్-కో ఎనర్జీ ప్లాంట్‌ను ఎద్దేవా చేసింది లోకేశ్ కాదా?. దానిని చెడగొట్టడానికి ఎల్లో మీడియా ఈనాడు ఎన్ని వ్యతిరేక కథనాలు రాసిందీ ఒక్కసారి పాత పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. ఈయన చెప్పినదాని ప్రకారం అయితే ఆ రెడ్ బుక్ ను ప్రయోగించవలసింది వారిపైనే కదా!.అదానీ, తదితరులు రెన్యుబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వస్తే అదానికి రాష్ట్రాన్ని రాసిస్తున్నారని మరో టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిందే. తుని వద్ద జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్కుకు అనుమతి ఇవ్వవద్దని లేఖ రాసింది స్వయంగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కాదా?. తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం గురజాల ఎమ్మెల్యే బెదిరింపులతో రెండు సిమెంట్ పరిశ్రమలు మూతపడ్డాయట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ దావోస్ వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే అవేం కంపెనీలు అంటూ మాట్లాడిన లోకేశ్ తాము అధికారంలోకి వచ్చాక ఆర్భాటంగా దావోస్ వెళ్లి ఉత్తచేతులతో తిరిగి వచ్చారే. పైగా పెట్టుబడుల కోసం వెళ్లలేదని, ఏపీ బ్రాండ్ ప్రచారం కోసమని చెప్పుకున్నారే. ఆ తర్వాత ఆరున్నర లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టడానికి ఒప్పందాలు అయ్యాయంటూ, అవేమిటో చెప్పకుండానే ప్రచారం ఆరంభించారే. ఇప్పుడేమో కర్నూలు గ్రీన్ ఎనర్జీ కంపెనీని, కడప ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తామే తీసుకువచ్చామని చెప్పుకుంటున్నారే. కడపలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ను జగన్ తీసుకువస్తే దానిని అమరావతికి తరలించే యత్నం చేశారా? లేదా?.గతంలో జగన్ పాలనలో అనేక పరిశ్రమలు వస్తే వాటికి అడ్డు పడడానికి తెలుగుదేశం కాని, ఎల్లో మీడియా కాని చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వం ఏ స్కీమ్ చేపట్టినా పచ్చి అబద్దాలు ప్రచారం చేసిందీ వీరే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరికి బ్యాండ్ వాయించే వారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి ఉంటే కొన్ని వందల కేసులు నమోదై ఉండేవి. ఉదాహరణకు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ లోకేశ్ ఎందరిని బెదిరించారో అందరికీ తెలుసు. జిల్లా ఎస్పీలను సైతం పేరుపెట్టి హెచ్చరికలు చేసేవారు. ఇప్పటి మాదిరిగా అడ్డగోలుగా కేసులు పెట్టి ఉంటే లోకేశ్‌పై ఎన్ని కేసులై ఉండేవి. ఇప్పటం వద్ద అనుమతి లేకుండా కారు పైన కూర్చుని పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు. మరోసారి రోడ్డుపై అడ్డంగా పడుకుని పోలీసుల విధులకు ఆటంకం కల్పించిన పవన్‌పై ఆ రోజుల్లో కేసులు పెట్టారా? లేదే!.మహిళలు మిస్ అయ్యారని తప్పుడు ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టి ఉండవచ్చు కదా?. అయినా అలా చేయలేదే. చంద్రబాబు, లోకేశ్‌లు అప్పటి సీఎం జగన్‌ను సైకో అంటూ, పలు అభ్యంతరకర పదాలు వాడారా? లేదా?. అయినా వారి మీద కేసులు రాలేదు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి పోలీసులు వైఎస్సార్సీపీ వారిపై, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి హింసిస్తున్నారే!. ఏ రాజ్యాంగం వీటికి అనుమతి ఇస్తుంది?. ఈ విషయంలో ఏపీ హైకోర్టు సైతం పలుమార్లు పోలీసులను హెచ్చరించినా వీరి ధోరణి మారడం లేదు. సూపర్ సిక్స్ హామీల గురించి అడుగుతూ ఒక జూనియర్ లెక్చరర్ ప్రశ్నిస్తే ఆయన వద్ద నాటు సారా దొరికిందని కేసు పెట్టారట. ఇలా ఒకటి కాదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో చూశాం.ఇవన్నీ రెడ్ బుక్ లో భాగమేనని లోకేశ్ గర్వంగా ఫీల్ అవుతుండవచ్చు. కానీ షాడో సీఎం స్థాయి నుంచి అసలు సీఎం అవ్వాలని ఆశపడుతున్న లోకేశ్ నిజంగానే ఆ పదవిలోకి వస్తే రాష్ట్రం ఇంకెంత ఘోరంగా తయారవుతుందో అన్న భయం ప్రజలలో ఏర్పడదా?. నిత్యం అబద్దాలు చెప్పడం కాకుండా, కాస్త నిజాయితీగా మాట్లాడుతూ, హుందాగా వ్యవహరిస్తూ, రెడ్ బుక్ పిచ్చిగోలను వదలి వేయకపోతే రాజకీయంగా లోకేశ్‌కే నష్టం కలుగుతుంది. కక్ష పూరిత రాజకీయాలతోనే అధికారంలో కొనసాగాలనుకుంటే అది ఎల్లకాలం అయ్యే పని కాదని ఎమర్జెన్సీ అనుభవం తెలియచేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎవర్నీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం: అవినాష్ రెడ్డి వార్నింగ్
సాక్షి, వైఎస్సార్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఏపీలో వైఎస్సార్సీపీ కేడర్ వినాశమే టార్గెట్‌గా అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం అని హెచ్చరించారు.కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆయన సోదరుడు అహ్మద్ భాషా ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజాద్ భాషాను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది. అభివృద్ధిపై కాకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులే లక్ష్యంగా పెట్టుకున్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష సోదరుడు అహ్మద్ భాషాపై అక్రమ కేసు నమోదు చేశారు. తీవ్రవాది మాదిరి ముంబై వెళ్ళి అహ్మద్ భాషాను అక్రమ అరెస్టు చేసి అత్యుత్సాహంగా కడపకి తెచారు. ఆయన అరెస్ట్ తర్వాత అంజాద్ భాషా ఇంటి సమీపంలో టీడీపీ నాయకులు సంబరాలు చేయడం దారుణం. కడపలో టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడటం దారుణం. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి దగ్గర మెప్పు పొందడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు, వేధింపులకు గురిచేస్తున్న ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం’ అని హెచ్చరించారు. -
సర్కార్ కుట్ర.. జగన్ ఇంటి వద్ద సెక్యూరిటీ తగ్గించారు: గడికోట
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన కనీస భద్రత వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. జగన్ లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. వైఎస్ జగన్ ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని తగ్గించారని మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్. ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లిన సమయంలో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన కనీస భద్రత కూడా ఇవ్వడం లేదు. గతంలో రెండు సార్లు దాడి జరిగింది. పాదయాత్ర సమయంలోనూ అనేక అడ్డంకులు సృష్టించారు. గుంటూరు మిర్చి యార్డులో కార్యకర్తలే వలయంగా మారి భద్రత కల్పించారు. 200 మంది పోలీసులను పెట్టామని ఎస్పీ చెబుతున్నారు. కానీ, హెలీకాప్టర్ వద్ద పది మంది పోలీసులు కూడా లేరు. వేల మంది హెలీకాప్టర్ వద్దకు వచ్చినా పోలీసులు నిలువరించలేకపోయారువైఎస్ జగన్‌ని లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తిగా కూడా జగన్‌ను గుర్తించడం లేదు. జగన్‌కు భద్రత కల్పించలేకపోతే చెప్పండి. ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని తగ్గించేశారు. జగన్ ఇంటి వద్ద ఒక్క కానిస్టేబుల్ కూడా లేకుండా చేశారు. ఆయన భద్రతపై కేంద్ర హోంశాఖకు రిప్రజెంటేషన్ ఇస్తాం. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మండలానికి ఒకరిని చంపితే కానీ భయం రాదు అనేలా భయోత్పాతం సృష్టిస్తున్నారు. చట్టానికి లోబడి పోలీసులకు సెల్యూట్ చేస్తాం. చట్టాన్ని మీరి అన్యాయాన్ని ప్రోత్సహించే వారికి కచ్చితంగా యూనిఫాం లేకుండా చేస్తాం. తప్పుచేయకపోతే భుజాలు తడుముకోవడం దేనికి?. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారు. కొంతమంది పోలీసులకు పార్టీలు అంటగట్టి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ముగ్గురు డీజీలకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. నలుగురు ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారు. డీఎస్పీలను వీఆర్‌లో పెట్టారు. 120మంది సీఐలకు ఇంతవరకూ పోస్టింగ్స్ ఇవ్వలేదు. ఎవరో మెప్పు పొందడానికి పోలీసు సంఘాలు మాట్లాడటం కాదు. పోస్టింగ్స్ కూడా లేకుండా వేధింపులకు గురవుతున్న పోలీసుల కోసం మాట్లాడాలని కోరుతున్నాను. దేశంలోనే సీనియర్ లీడర్ అని చంద్రబాబు చెప్పుకుంటాడు. అన్ని రంగాల్లో ఆదాయం తగ్గితే జీఎస్డీపీ మాత్రం ఎలా పెరిగిందో అర్ధం కావడం లేదు. 14 లక్షల కోట్లు అప్పులు చేసేశారని తప్పుడు ప్రచారం చేశారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారు దొంగతో సమానం. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయాల్లో వేలు పెట్టొద్దని పోలీసులకు స్పష్టంగా చెప్పారు. హోంమంత్రి అనిత మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. భద్రత కల్పిస్తే హెలీకాప్టర్ వద్దకు అంతమంది ఎలా వస్తారు?. జగన్ వస్తున్నాడంటే జనం తండోపతండాలుగా వస్తారు. మెసేజ్‌లు పెట్టి కార్యకర్తలు తరలి రావాలని పిలవాల్సిన అవసరం లేదు. హోంమంత్రి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం సరికాదు.ఏం తప్పుచేశాడని వైఎస్ జగన్‌ను క్రిమినల్ అంటున్నారు. అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. మల్లెల బాబ్జీని ఎవరు చంపారో చెప్పాలి. దశరధ రామయ్యను ఎవరు హత్య చేశారో కూడా చెప్పాలి. చంద్రబాబును క్రిమినల్ అని మాట్లాడటం మాకు పెద్ద విషయం కాదు. మాకు విజ్ఞత ఉంది’ అంటూ చురకలు అంటించారు. -
టీడీపీకి షాక్.. వీగిపోయిన మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానం
సాక్షి, తిరుపతి: వెంకటగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ పట్టు నిలుపుకుంది. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. చైర్మన్‌పై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 20 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఓటు వేశారు. 25 మంది కౌన్సిలర్లలో 20 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో, టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. అయితే, అవిశ్వాస తీర్మానానికి ముందే వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల దెబ్బకు టీడీపీ ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణ చేతులెత్తేశారు. ఇక, టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్సీపీ ఇంచార్జ్ రామ్‌కుమార్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఇక, ఈరోజు ఉదయమే వైఎస్సార్సీపీ కౌన్సిలర్స్ కౌన్సిల్ హాల్‌కు బయలుదేరారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నియోజకవర్గ ఇంచార్జ్ రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వాహనాలలో 20 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. మున్సిపల్ చైర్మన్ నక్కా భాను ప్రియపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ చేసిన కుట్రను వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తిప్పి కొట్టారు. -
ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్‌ను విమర్శించే స్థాయా నీది?
అనంతపురం, సాక్షి: రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని.. ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudurthi Prakash Reddy). మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఎస్సై సుధాకర్ చేసిన కామెంట్లకు ప్రకాశ్‌రెడ్డి బుధవారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్(SI Sudhakar Yadav) ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు. జగన్‌ను విమర్శించే స్థాయి కూడా ఎస్సై సుధాకర్ యాదవ్‌కు లేదు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పని చేస్తున్నారు. తన ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారాయన. ..సుధాకర్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకరే కారణం. సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. గతంలో దళితులను ఆయన కించపరచడం నిజం కాదా?. పరిటాల సునీతకు అనుగుణంగానే పని చేయడం వాస్తవం కాదా?. అసలు ఎస్సై సుధాకర్ సరిగగ్గా పని చేసుంటే లింగమయ్య హత్య జరిగి ఉండేదా?. నీ ధర్మ సందేశలు ఎక్కడికి పోయాయి? ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు?.టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకా నీకు ఖాకీ చొక్కా ఇచ్చింది?.. అంటూ సుధాకర్‌ను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు... ఎస్సై సుధాకర్ యాదవ్ అక్రమాస్తులు అనేకం ఉన్నాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందాలని భావిస్తున్నాడు. కానీ, పరిటాల సునీత(Paritala Sunitha) ఇంకొకరికి టిక్కెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం సుధాకర్ గ్రహించాలి. చంద్రబాబును ఎమ్మెల్యే పరిటాల సునీత దూషించారు. అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా?. పోలీసుల పై చంద్రబాబు దూషణలు వినిపించవా?. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఎందుకు?. చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలూడదీస్తొనన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?. కురుబ లింగమయ్య ను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే... వారి అనుచరులనే కేసులో సాక్షులుగా పెట్టడం కరెక్టా?అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
కూటమిలో కమీషన్ల కొట్లాట!.. ఇన్ఛార్జ్ మంత్రికి షాక్
సాక్షి, అమరావతి / కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో కమీషన్లు, వాటాల పంపకంలో తేడాలతో కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య పొసగక బహిరంగంగానే ఘర్షణలకు దిగుతున్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మంగళవారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత సమక్షంలోనే రెండు వర్గాల నేతలు గొడవకు దిగారు. అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి వర్గాలు ఒకరిపై ఒకరు దూసుకు రావడంతో సమావేశం రసాభాసగా మారింది.ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి వేదికపై నుంచి దిగిపోవాలని బీటెక్ రవి వర్గం గొడవకు దిగడంతోపాటు ఆయనపై దాడికి యత్నించింది. మంత్రి సవిత, ఇతర నేతలు ఎంత సర్దిచెప్పినా, ఇరు వర్గాల మధ్య తోపులాట, తిట్లవర్షం కొనసాగింది. మద్యం, ఇసుక, మైనింగ్‌లో వచ్చిన అవినీతి డబ్బు పంపకాలు, కమీషన్ల తేడాలతో ఇరు వర్గాల మధ్య చాలా రోజులుగా పరస్పరం దూషణలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. అవి శ్రుతిమించడంతో మంగళవారం విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి నిమ్మలను నిలదీసిన ఆదోని టీడీపీ శ్రేణులు కర్నూలు స్టేట్ గెస్ట్‌హౌస్ వేదికగా టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. ఏకంగా మంత్రి నిమ్మల రామానాయుడినే టీడీపీ శ్రేణులు నిలదీశాయి. బీజేపీకి చెందిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తమను పట్టించుకోవడం లేదంటూ టీడీపీ క్యాడర్ ఆందోళనకు దిగింది. ఆదోని ఎమ్మెల్యే డౌన్ డౌన్.. అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఆదోని టీడీపీ ఇన్‌ఛార్జి మీనాక్షి నాయుడు, ఎమ్మెల్యే పార్థసారథి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పార్థసారథి టీడీపీ నేతలను దూరం పెట్టడం, కాంట్రాక్టర్లు, పనుల్లో వారికి వాటాలు ఇవ్వనీయక పోవడంతో వారు తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు.‘ఆదోని నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ బి.పార్థసారథి మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆదోనిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బిచ్చగాళ్లు అయిపోయారు. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. ఏ పనిలోనైనా 70 శాతం టీడీపీ, మిగిలిన 30 శాతం ఎమ్మెల్యేకు అప్పగించాలి. మేము లేకుంటే బీజేపీ ఎలా గెలిచేది? దమ్ముంటే ఆయన రాజీనామా చేసి మళ్లీ బీజేపీ తరఫున గెలవాలని సవాల్ చేస్తున్నాం. ఎక్కడో ఉన్న ఆయన్ను తీసుకువచ్చి మా నెత్తిన కూర్చోబెట్టారు’ అంటూ మంత్రిని చుట్టుముట్టారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూ నాలుగు మాటలు మాట్లాడి, మంత్రి గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు చొచ్చుకు రావడంతో గెస్ట్‌హౌస్ డోర్ ఆద్దాలు పగిలిపోయాయి. తిరువూరులో తారాస్థాయికి విభేదాలు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, అక్కడి పార్టీ క్యాడర్ మధ్య మొదటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. క్యాడర్‌కు వ్యతిరేకంగా కొలికిపూడి నియోజకవర్గంలో వీరంగం వేయడం, వారు తిరుగుబాటు చేయడంతో అక్కడ పరిస్థితి చేయిదాటి పోయింది. క్యాడర్ అంతా కలిసి కొలికపూడి తమకు వద్దని నియోజకవర్గంతోపాటు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆందోళనలు చేసింది. దీంతో రెండు వర్గాలను బుజ్జగించడం, చివరికి కొలికపూడిని పిలిచి విచారించడం మినహా పార్టీ అధిష్టానం ఏమీ చేయలేకపోయింది. వర్మ వర్సెస్ జనసేన కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇటీవల టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన క్యాడర్ మధ్య విభేదాలు రాజుకుంటున్న విషయం తెలిసిందే. వర్మకు వ్యతిరేకంగా జనసేన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం నాగబాబు పిఠాపురంలో పర్యటించగా, టీడీపీ శ్రేణులు ఆయన్ను అడ్డుకుని నినాదాలు చేశాయి. వర్మకు మద్దతుగా వారు నాగబాబును నిలదీయడం చర్చనీయాంశమైంది. అనేక నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల మధ్య వివాదాలు సర్వసాధారణంగా మారాయి.ఇన్‌ఛార్జి మంత్రిని లెక్క చేయని చిత్తూరు ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని ఆ జిల్లా ఎమ్మెల్యేలు అసలు పట్టించుకోక పోవడం చర్చనీయాంశంగా మారింది. తనకు మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆ జిల్లా సీనియర్ నేత, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఇన్‌ఛార్జి మంత్రిని లెక్క చేయడం లేదు. ఇంత వరకు సమన్వయ కమిటీ సమావేశమే మంత్రి నిర్వహించలేకపోయారు. ఏ నియోజకవర్గంలోనూ ఆయన పర్యటించేందుకు ఎమ్మెల్యేలు ఒప్పుకోవడం లేదని సమాచారం. అందుకే టీడీపీ ఎమ్మెల్యే లేని పుంగనూరుకు వెళ్లి, మొక్కుబడిగా మాట్లాడి వచ్చేస్తున్నారు. ఇతరత్రా ఎక్కడికైనా మంత్రి వెళితే ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. మీరు కూడా వెళ్లొద్దంటూ వారి ముఖ్య అనుచరులను ఆదేశిస్తున్నట్లు సమాచారం. -
బిహార్‌ను మించి భయోత్పాతం: వైఎస్ జగన్
చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసులు తమ టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేయకుండా ఆయనకు వాచ్మెన్ల మాదిరిగా పని చేస్తున్నారు. వారికి ఒకటే చెబుతున్నా..! ఎల్లకాలం చంద్రబాబు నాయుడు పరిపాలనే ఉండదు. అలా వ్యవహరించిన పోలీసుల బట్టలూడదీసి ప్రజల ముందు, చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరిస్తున్నా. మీ యూనిఫామ్ తీయించి ఉద్యోగాలు ఊడగొడతామని చెబుతున్నా. మీరు చేసిన ప్రతి పనికీ వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం -వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారు.. సూపర్ సిక్స్ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో.. రెడ్‌బుక్ పాలనతో దాడులు కొనసాగిస్తున్నారు. పోలీసులను ఉపయోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెగబడుతున్న దౌర్జన్య కాండను ప్రజలంతా చూస్తున్నారు. కచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి..’ అని వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. గత నెల 30వ తేదీన టీడీపీ గూండాల పాశవిక దాడిలో మృతిచెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. గతంలో బిహార్.. ఇప్పుడు ఏపీ!! రాప్తాడు నియోజకవర్గంలో ఈ ఘటన ఎందుకు జరిగింది? రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఎందుకు ఉన్నాయి..? అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. భర్తను కోల్పోయిన లింగమయ్య భార్య దిక్కు తోచక తల్లడిల్లిపోతోంది. గతంలో బిహార్ గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువును చంద్రబాబు రోడ్డున పడేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయి. ఇటీవల 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు పార్టీ గెలిచే పరిస్థితి లేదని గ్రహించడంతో పోస్ట్‌పోన్ చేయించారు. అనివార్యం కావడంతో 50 చోట్ల ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభ పెట్టినా.. 39 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. అసలు ఆ 57 చోట్ల చంద్రబాబుకు సంఖ్యా బలమే లేదు. అక్కడ గెలిచిన వారంతా వైఎస్సార్సీపీ సభ్యులే. మా పార్టీ గుర్తు మీద గెలుపొందిన వారే. చంద్రబాబు తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేదని తెలిసి కూడా భయపెడుతూ, పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కంటే కూడా హీనంగా వాడుకుంటూ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. ఒక ఎంపీపీ పోతే ఏమవుతుంది బాబూ? చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి! ఒకచోట ఎంపీపీ పోతే ఏమవుతుంది? ఒకచోట జెడ్పీ చైర్మన్, ఉప సర్పంచ్ పదవి పోతే ఏమవుతుంది? ఆయన సీఎం కాబట్టి.. అధికారంలో ఉన్నారు కాబట్టి.. బలం లేకపోయినా.. తాను ముఖ్యమంత్రినన్న అహంకారంతో ఏ పదవైనా తమకే దక్కాలనే దురుద్దేశంతో శాంతిభద్రతలను పూర్తిగా నాశనం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి రహదారిలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ రామగిరిలో రాక్షసత్వం.. రామగిరి మండలంలో పది మంది ఎంపీటీసీలు ఉంటే వైఎస్సార్సీపీకి చెందిన 9 మంది సభ్యులు గెలిచారు. కేవలం ఒకటి మాత్రమే టీడీపీది. మరి ఇక్కడ ఎంపీపీ పదవికి నోటిఫికేషన్ జారీ అయితే 9 మంది సభ్యులున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పదవి దక్కాలా? లేక ఒకే ఒక సభ్యుడున్న టీడీపీకి రావాలా? తొమ్మిది మంది సభ్యులు చంద్రబాబు ప్రలోభాలకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లి తమకు ప్రాణహాని ఉందని, ఎంపీపీ పదవికి పోటీ చేయాలంటే పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. కోర్టు ఆదేశాలతో సభ్యులను తీసుకొస్తుంటే.. ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసులు మధ్యలో రామగిరి ఎస్ఐ సుధాకర్ అనే వ్యక్తిని వీళ్ల కాన్వాయ్‌లోకి ఎక్కించారు. వీళ్లందరికి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడితో వీడియో కాల్ చేయించారు. నువ్వు ఓటు వేయకుంటే మీ అమ్మనాన్న ఇంటికి రారని భారతమ్మ అనే ఎంపీటీసీని వీడియో కాల్ చేయించి బెదిరించారు. వీటికి లొంగకపోవడంతో కోరం లేదని ఎన్నికలు వాయిదా వేశారు. ఆ తరువాత ఇదే ఎస్ఐ పెనుకొండకు తీసుకెళ్లి ఎంపీటీసీ సభ్యులను బైండోవర్ చేశారు. దీంతో ప్రకాష్‌రెడ్డి (రాప్తాడు మాజీ ఎమ్మెల్యే), ఉషశ్రీ (పార్టీ జిల్లా అధ్యక్షురాలు) మా పార్టీకి చెందిన ఎంపీటీసీలకు మద్దతుగా వెళ్లడంతో వారిద్దరిపై కేసులు పెట్టారు. అసలు వీళ్లిద్దరు ఏం తప్పు చేశారని కేసులు పెట్టారు? వాళ్లు టీడీపీ ఎంపీటీసీలనేమైనా తెచ్చారా? మా పార్టీ సభ్యుల కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు వెళ్లి ధర్నా చేసినందుకు వాళ్ల మీద కేసులు బనాయించారు. భయోత్పాతం సృష్టించారు.. ఈ ఎన్నికల ప్రక్రియ జరగకూడదన్న దురుద్దేశంతో పాపిరెడ్డిపల్లిలో మా పార్టీకి చెందిన జయచంద్రారెడ్డిపై దాడి చేశారు. 28న మళ్లీ దాడి చేశారు. లింగమయ్య అన్న ఈ దాడిని అడ్డుకుని పోలీసులకు కంప్లయింట్ చేశారు. తమపై దాడులను అరికట్టాలని వేడుకుంటే పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలో మార్చి 30న కురుబ లింగమయ్య కుమారుడు బైక్‌పై వెళ్తుంటే రాళ్లతో దాడి చేశారు. కుమారుడు ఈ విషయాన్ని లింగమయ్యకు చెప్పడంతో.. 20 మందికిపైగా టీడీపీ మూకలు మరోసారి లింగమయ్య ఇంటికి వెళ్లి బేస్‌బాల్ బ్యాట్, మచ్చుకత్తులు, కర్రలతో దాడి చేసి హింసించడంతో లింగమయ్య చనిపోయారు. రాష్ట్రం ఈ రోజు బిహార్ కన్నా అధ్వానంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గుతో తల వంచుకునేలా వ్యవహరిస్తున్నారు. 20 మంది దాడి చేస్తే.. ఇద్దరిపై కేసులా? లింగమయ్యపై 20 మంది దాడి చేస్తే కేసులు ఇద్దరి మీదే పెట్టారు. ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్నాయుడుపై ఎందుకు కేసు పెట్టలేదు? మిగిలిన వారిని ఎందుకు వదిలేశారు? నిందితులంతా ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యే బంధువులు. ఎమ్మెల్యే కుమారుడు మార్చి 27న ఆ గ్రామానికి వెళ్లి రెచ్చగొడితే ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేపై గానీ, ఆమె కుమారుడిపైగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎస్ఐ సుధాకర్ భయపెడుతుంటే అతడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? లింగమయ్య కుమారుడు శ్రీనివాస్‌పై కూడా దాడి జరిగింది. కానీ కంప్లయింట్ లింగమయ్య కుమారుడితో కాకుండా.. పోలీసులే ఒక ఫిర్యాదు రాసుకుని వచ్చి నిరక్షరాస్యురాలైన లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్రలు వేయించుకుని వెళ్లారు. వాళ్లు ఏం రాసుకున్నారో తెలియదు..! నిందితులనే సాక్షులుగా చేర్చి.. లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతోనే బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేశారు. పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదులో బేస్‌బాల్ బ్యాట్ ఉన్నట్లు రాయలేదు. చిన్న చిన్న కర్రలతో దాడి చేసినట్లు వక్రీకరించారు. పోలీసులు విచారించిన 8 మందిలో ఐదుగురు మాత్రమే లింగమయ్య కుటుంబీకులు. మిగిలిన ముగ్గురూ టీడీపీకి చెందినవారు. నిందితులనే సాక్షులుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో ఇంతకంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షులను కూడా వీళ్లకు కావాల్సిన వాళ్లను పెట్టుకున్నారు. వీళ్లే తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం చూస్తే.. పోలీసు వ్యవస్థ ఇంతకన్నా దారుణంగా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మీ కుటుంబానికి అండగా ఉంటాం⇒ లింగమయ్య హత్యను మానవ హక్కుల సంఘానికి నివేదిస్తాం⇒ పాపిరెడ్డిపల్లిలో బాధిత కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్ టీడీపీ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన తమ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ నెల 30న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో లింగమయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్నట్లు తెలియడంతో పల్లెలకు పల్లెలు పాపిరెడ్డిపల్లికి తరలివచ్చాయి. హెలిప్యాడ్ నుంచి జగన్ నేరుగా లింగమయ్య ఇంటికి చేరుకుని తొలుత చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం కింద కూర్చుని లింగమయ్య భార్య, కుమారులు, కుమార్తెతో చాలాసేపు మాట్లాడి ఓదార్చారు. లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, పార్టీ తరఫున న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. లింగమయ్య పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. లింగమయ్య అన్న హత్య అత్యంత కిరాతకమన్నారు. టీడీపీ మూకల దుర్మార్గాలను రాష్ట్రవ్యాప్తంగా తెలియచెప్పేందుకు వచ్చామన్నారు. ఈ కేసును మానవ హక్కుల సంఘానికి నివేదిస్తామని ప్రకటించారు. టీడీపీ వాళ్లు మా నాన్నను చంపేశారన్నా..జగన్ పరామర్శిస్తున్న సమయంలో లింగమయ్య కుమార్తె కన్నీటి పర్యంతమైంది. అన్నా..! మా నాన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త.. అందుకే 20 మందితో వచ్చి దాడి చేసి చంపారన్నా..! టీడీపీ వాళ్లు మా నాన్నను చంపేశారన్నా..! అంటూ రోదించింది. మా అమ్మ, తమ్ముళ్లకు ఏమీ తెలియదన్నా..! మీరే అండగా నిలవాలన్నా..! గ్రామంలో టీడీపీ దుర్మార్గాలను తట్టుకోలేకపోతున్నామన్నా..! పండుగలు కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నా..! అంటూ ఆవేదన వ్యక్తంచేసింది. ‘వైఎస్సార్సీపీ హయాంలో ఎలాంటి గొడవలూ లేవన్నా..! ఇప్పుడు ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉందన్నా..’ అంటూ కొందరు మహిళలు ఆందోళన వ్యక్తం చేయగా.. ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రాష్ట్రమంతా.. రెడ్‌బుక్ దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ.. కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపిస్తున్నారు: జగన్ ‘రామగిరిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వీళ్లు చేస్తున్న అన్యాయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏం జరుగుతోందంటే.. ‘దొంగ సాక్ష్యాలను వీళ్లే సృష్టిస్తున్నారు. నచ్చని నేతలను కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ⇒ తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే బస్సులో ఉన్న కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని ఏకంగా పోలీసులే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పం ఎంపీపీ ఉప ఎన్నిక కూడా దౌర్జన్యంగా జరిపించారు. పశి్చమ గోదావరి జిల్లా అత్తిలిలో కూడా ఇలాగే దౌర్జన్యం చేశారు. ఎక్కడా వీళ్లకు సంఖ్యా బలం లేదు. విశాఖలో 98 మంది సభ్యుల్లో 56 మంది వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచారు. అక్కడ కూడా భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నంరాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే.. ఈ నెల 6న ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్లలో ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారు. ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతాప్‌రెడ్డి గుడికి వెళ్లి పూజ చేస్తుండగా ఆయన అన్నను చంపేశారు. మా ప్రభుత్వంలో ప్రతాప్‌రెడ్డికి గన్‌మెన్ సౌకర్యం కల్పిస్తే చంద్రబాబు వచ్చాక తొలగించారు. పసుపులేటి సుబ్బరాయుడును చంపారు.. గతేడాది ఆగస్ట్ 3న శ్రీశైలం నియోజకవర్గం మహానందిలోని సీతారాంపురంలో పసుపులేటి సుబ్బరాయుడిని చంపేశారు. నేను ఆ ఊరికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించా. నంద్యాల హెడ్ క్వార్టర్‌కు కూతవేటు దూరంలో మర్డర్ జరిగినా పోలీసులు స్పందించలేదు. అక్కడే ఎస్పీ ఆఫీసు ఉన్నా ఎలాంటి చర్యలు లేవు. సాంబిరెడ్డిపై దారుణంగా దాడి.. గతేడాది జులై 23న పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఈద సాంబిరెడ్డిని ఇనుప రాడ్లతో కొట్టి కారుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో గతేడాది జూలై 17న వైఎస్సార్సీపీకి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపారు. ఏడేళ్ల తర్వాత పోసానిపై కేసులు సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన తప్పేమిటంటే... ఆయనకు నంది అవార్డు ఇస్తే తీసుకోకపోవడం! కుల వివక్ష పాటిస్తున్నారని ఆయన 2017లో స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు ఆయనపై 18 కేసులు బనాయించి అరెస్టు చేసి నెల రోజులకుపైగా జైల్లో పెట్టించారు. 145 రోజులకుపైగా జైలులో నందిగం సురేష్.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మా మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు మోపి 145 రోజులకుపైగా జైల్లో పెట్టారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజులు జైల్లో పెట్టారు. దాడులు చేసేది టీడీపీ వాళ్లయితే.. జైళ్లలో పెట్టేది మాత్రం వైఎస్సార్సీపీ నాయకులను!! వంశీపై అన్యాయంగా కేసులు.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ.. టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో లేరని ఆ పార్టీకి చెందిన వ్యక్తే కోర్టుకు వచ్చి చెప్పారు. అసలు అక్కడ వంశీ లేడని చెప్పినా.. అన్యాయంగా కేసులో ఇరికించి.. 50 రోజులుగా జైల్లో పెట్టారు.అడుగడుగునా భద్రతా వైఫల్యంరామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీసులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం వైఎస్ జగన్ పర్యటనలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపించాయి. వైఎస్ జగన్‌ను చూసేందుకు హెలికాప్టర్‌ను చుట్టుముట్టిన భారీ జనసందోహం పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదారుల్లో వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్ భద్రత విషయంలో చూపకపోవడం గమనార్హం. హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాదిమంది హెలిప్యాడ్ వద్దకు పోటెత్తారు. జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. హెలికాప్టర్ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభిమానుల తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్ తిరిగి వెళ్లిపోయింది. జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. -
‘ముందు హామీ ఇచ్చి.. తర్వాత మీతో పనిలేదన్నారు’
తాడేపల్లి: వాలంటీర్లీ వ్యవస్థను కొనసాగిస్తామని గతేడాది ఉగాది సందర్భంగా హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు.. గెలిచిన తర్వాత వారితో పని లేదని పక్కన పెట్టేశారని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్ల వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ జగన్ 2 లక్షల 66 వేల మందితో వాలంటీర్ వ్యవస్థ తెచ్చారు. ప్రజలకు ఇంటివద్దకే సేవలు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకలా వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారు వాలంటీర్లకు 5వేలు కాదు 10 వేలిస్తామన్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామని గత ఉగాది రోజు చంద్రబాబు మాటిచ్చి...ఇప్పుడు మాటమార్చేశారువిజయవాడ వరదల్లో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకున్నారు. వరద తగ్గాక మీతో మాకు పనిలేదన్నారు. ప్రభుత్వం నుంచి వాలంటీర్లకు వేతనాలివ్వలేదని వైఎస్సార్సీపీపై నిందలు వేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థకు ఎలాంటి ఆధారాల్లేవని పవన్ మాట్లాడటం విడ్డూరం. ప్రభుత్వం వాలంటీర్లకు వేతనాలిచ్చిన సంగతి కూడా ఒక మంత్రిగా పవన్ కు తెలియదా?, వాలంటీర్ల నియామకం పై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎంత వేతనమివ్వాలో కూడా స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎంగా ఉండి కూడా పవన్ అబద్ధాలాడటం హాస్యాస్పదం. దేశంలో ఎక్కడాలేని విధంగా వాలంటీర్ వ్యవస్థను జగన్ తెచ్చారు. కోవిడ్ సమయంలో వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి వాలంటీర్ల పై చంద్రబాబు, పవన్, టీడీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే. వాలంటీర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. 10 వేల వేతనం ఇచ్చితీరాల్సిందే. పవన్ ను కలిసేందుకు వాలంటీర్లు వెళితే పోలీసులను పెట్టి జులుం ప్రదర్శించారువాలంటీర్లకు ఏం చేయలేకపోతే....చేయలేమని చెప్పండి. మీ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైనా పీఆర్సి ప్రకటించలేదు. ప్రభుత్వం రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పారు. ఐఆర్ కోసం ఉద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగులకు జాబ్ ఇస్తామన్నారు..ఏమైంది జాబ్ క్యాలెండర్ప్రైవేట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయలేదు. ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. రాబోయే క్యాబినెట్ లో పెండింగ్ డీఏ , పీఆర్సీ,ఐఆర్ పై ప్రకటన చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
గెట్ వెల్ సూన్ చిన్నబాబు.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన
తిరుపతి, సాక్షి: పవన్ కల్యాణ్ తనయుడు సింగపూర్‌లో ప్రమాదానికి గురికావడంపై అటు సినీ, ఇటు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. ఆ చిన్నారి ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అంటున్నారు.ఈరోజు పవన్‌కల్యాణ్‌గారి చిన్నబాబు మార్క్ శంకర్(Mark Shankar) ప్రమాద వార్త నా మనసుని ఎంతో కలచివేసింది.ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని రోజా ట్వీట్ చేశారు. ఈరోజు @PawanKalyan గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.#Getwellsoon— Roja Selvamani (@RojaSelvamaniRK) April 8, 2025ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. దీంతో ఈ ఘటన అంతలా హైలైట్ అయ్యింది. పవన్-అన్నాలెజినోవాల చిన్న కొడుకే మార్క్ శంకర్ పవనోవిచ్(mark shankar pawanovich). ఈ ప్రమాదంలో ఆ చిన్నారి చేతికి, కాళ్లకు గాయాలయ్యాయని.. పొగ కారణంగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యకరంగానే ఉన్నట్లు సమాచారం. -
‘హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పై అనుమానులున్నాయ్’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తాజా ఘటనే సాక్ష్యమని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో రోజురోజుకీ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. తాము జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనకు సంబంధించి రెండు రోజులు ముందుగానే సమాచారమిచ్చామని, ఈ ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తుందో అర్థమవుతుందని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. రామగిరిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ విరిగిపోయింది. ఇది మీ వైఫల్యం కాదా.. అసలు హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పైన అనేక అనుమానాలున్నాయ్. వైఎస్ జగన్‌కు భద్రతను తగ్గించారుదేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నేత జగన్మోహన్రెడ్డి. పోలీసులు కనీస భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ భద్రత కుదించారు. ఆయన ఇంటివద్ద భద్రత కుదించారు. జగన్ పర్యటనల్లో సరైన భద్రత కల్పించడం లేదు. కూటమి నేతల ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయ్... పోతుంటాయ్ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. కానీ ఏపీలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదుమళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. కూటమి నేతల మాటలు విని తప్పులు చేసే వారిని విడిచిపెట్టం. ఇటీవల జగన్ పర్యటనల్లో భద్రత లోపం తేటతెల్లమైంది. మా కార్యకర్తలే రోప్ పార్టీగా మారి జగన్‌కు భద్రత కల్పించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యయుతమైన పాలన ఏపీలో కొనసాగడం లేదు వైఎస్సార్సీపీ వారిపై దాడులు జరుగుతున్నాయ్.. జగన్ భద్రత పై కేంద్రం జోక్యం చేసుకోవాలి. జగన్‌కు సరైన భద్రత కల్పించాలి. అభిమానుల ముసుగులో అసాంఘికశక్తులుహెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పైన అనేక అనుమానాలున్నాయ్. మా పార్టీ కార్యకర్తల ముసుగులో ప్రత్యర్ధి పార్టీ వర్గీయులే ఈ పని చేసుంటారని మాకు అనుమానం జగన్ భద్రత పై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకమైన బాధ్యత తీసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. పోలీసులు నిస్పక్షపాతంగా పనిచేస్తే శాంతిభద్రతలు ఎందుకు లోపిస్తాయి. మేం పోలీసులందరినీ అనడం లేదుపచ్చచొక్కాలేసుకున్న అధికారుల గురించి మాత్రమే మేం మాట్లాడుతున్నాం. తప్పుచేసిన వారిని మాత్రమే మేం చట్టం ముందు నిలబెడతామంటున్నాం. తప్పుచేసిన వారు తప్పించుకుపోలేరు గుర్తుంచుకోండి’ అంటూ హెచ్చరించారు లేళ్ల అప్పిరెడ్డిఇది చదవండి:మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు -
అవును పవన్ సర్.. మీ కాన్వాయ్ కారణంగానే పరీక్షకు వెళ్లలేకపోయారు
విశాఖపట్నం, సాక్షి: తన కాన్వాయ్ కారణంగానే విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు నగర పోలీసులు సైతం విద్యార్థులదే తప్పిదమన్నట్లు ప్రకటన ఇచ్చేశారు. అయితే పవన్ కాన్వాయ్ కారణంగానే విద్యార్థులకు ఆలస్యమైందని.. ఇందుకు ఆధారాలతో సహా పక్కగా జనసేన ఎమ్మెల్యే దొరికిపోయారు.జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అత్యుత్సాహం వల్లే 30 మంది ఎమ్మెల్యేలు పరీక్ష రాయలేకపోయారు. పవన్‌కు గజమాల స్వాగతం ఏర్పాటు చేసిన ఆయన.. సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేయించారు. దీంతో సకాలంలో విద్యార్థులు చేరుకోలేకపోయారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా బయటపడింది. -
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్ రాజకీయానికి బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారు. నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే... చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలి. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెప్తారు. .. బాబు మెప్పుకోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా బాబుకు వాచ్‌మెన్‌లా పని చేస్తున్న పోలీసులకు చెబుతున్నా. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. బాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదు. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతాం’’ అని వైఎస్ జగన్ ఘాటుగానే హెచ్చరించారు.ఇదీ చదవండి: ఏపీలో మరీ ఇంతటి ఘోరాలా? ప్రజల్లారా.. ఆలోచించుకోండి -
ఏపీలో శాంతి భద్రతలు లేవు: వైఎస్ జగన్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ఏపీలో పరిస్థితులు పూర్వపు బీహార్‌ను తలపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు. పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం.. వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లింగమయ్య హత్యతో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతలు దిగజారాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభాలు పెట్టిన ఎంపీపీ ఎన్నికల్లోవైఎస్సార్సీపీ గెలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అడుగడుగునా దౌర్జన్యాలకు పాల్పడ్డారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘చంద్రబాబుకు బలం లేదని స్థానిక ఎన్నికలను అడ్డుకున్నారు. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. చంద్రబాబుకు అనుకూలంగా లేదని 7 చోట్ల వాయిదా వేయించారు. టీడీపీ ఎమ్మెల్యే, తనయుడు, రామగిరి ఎస్ఐ దౌర్జన్యాలు చేశారు. లింగమయ్య హత్య కేసును నీరుగార్చుతున్నారు. లింగమయ్య హత్యపై కంప్లైంట్ వాళ్లే రాసుకొచ్చారు. లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్రలు వేయించారు. లింగమయ్య కొడుకు ఫిర్యాదును పక్కన పెట్టారు. తమకు అనుకూలమైన వారినే సాక్షులుగా పెట్టారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ దౌర్జన్యాలు చేశారు. ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలో కూటమి నేతలు కిడ్నాలు చేశారు. రామకుప్పం ఎంపీపీ ఎన్నికల్లో కూడా దౌర్జన్యం చేశారు’’ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
సంపద సృష్టి.. సంపన్నులకు మాత్రమేనా బాబూ!
ఏ దేశమైనా అభివృద్ది చెందడం అంటే ఏమిటి? పేదరికం తగ్గడం.. పేదల ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడడం! కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కలిగిన వారికి మరింత సంపద సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. దీన్నే అభివృద్ధి అనుకోమంటున్నారు. విశాఖపట్నంలో ఒక మాల్ నిర్మాణానికి విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టడం చూస్తే ఈ ఆలోచనే వస్తుంది ఎవరికైనా. రాష్ట్రం ఎటు పోయినా ఫర్వాలేదు... అమరావతిని మాత్రం అప్పులు తెచ్చిమరీ నిర్మాణాలు చేపట్టి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరిన్ని డబ్బులు సంపాదించుకుంటే చాలన్నట్టుగా ఉండటం ఇంకో ఉదాహరణ.ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుత పేదలను ఊరించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తరువాత వాటిని మూలన పడేశారు. బాబు గారికి వత్తాసు పలికి ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హామీల ఊసే ఎత్తడం లేదు. లేని వారికి పైసా విదల్చని వీరిద్దరూ లూలూ మాల్‌కు మాత్రం వేల కోట్లు దోచిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కు వద్ద సుమారు 14 ఎకరాల భూమిని లూలూ మాల్‌కు కేటాయించింది. మాల్ నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్, హైపర్ మార్కెట్ వంటివి ఏర్పాటు చేస్తామన్న ఈ సంస్థ ప్రతిపాదనలకు ఊ కొట్టింది. కానీ ఆరేళ్లపాటు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకపోవడంతో 2023లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేసింది.వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించడంపై విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే 2024లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావడం... లూలూ గ్రూప్ తెరపైకి వచ్చింది. మళ్లీ భూముల పందేరం జరిగిపోయింది. మాల్స్ వచ్చిన కొత్తలోనైతే వాటిని ప్రోత్సహించేందుకు భూమి ఇచ్చారంటే ఒక అర్థముంది. విశాఖ, విజయవాడల్లో ఇప్పటికే బోలెడన్ని మాల్స్ ఉన్నాయి. అది కూడా నగరానికి దూరంగా పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించిన ఓకే అనుకోవచ్చు కానీ.. విశాఖ బీచ్ రోడ్లో స్థలమివ్వడమంటే...??? ఈ 14 ఎకరాల స్థలం విలువ రూ.1500 కోట్ల నుంచి రూ. రెండు వేల కోట్ల వరకు ఉండవచ్చు. దీనిని ఏకంగా 99 ఏళ్లకు లీజ్ కు ఇవ్వడం కూడా ఆశ్చర్యమే మరి!వీటన్నింటికీ అదనంగా ఇంకో రూ.170 కోట్ల విలువైన రాయితీలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ మేళ్లన్నింటికీ లూలూ ప్రభుత్వానికి ఇచ్చేదెంత? నెలకు ముష్టి నాలుగు లక్షల చొప్పున ఏడాదికి రూ.50 లక్షలు మాత్రమే. ఇంకో విషయం.. లూలూ ఏమీ ఆషామాషీ కంపెనీ కాదు. కావాలనుకుంటే సొంతంగా భూములు కొనుక్కోగల ఆర్థిక స్థోమత ఉన్నదే. హైదరాబాద్‌లో ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండానే ఈ సంస్థ భారీ మాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదంతా లూలూ గ్రూపు సంపద మరింత పెంచేందుకే అన్నది లోగుట్టు!లూలూ ఏమీ పరిశ్రమ కాదు. కేవలం షాపింగ్ ఏరియాకు సదుపాయాలు కల్పించే సంస్థ. ఇలాంటి మాల్స్ వల్ల చిన్న, చిన్న వ్యాపారులంతా ఉపాధి కోల్పోయే అవకాశాలెక్కువ. పోనీ మాల్లో తక్కువ అద్దెకు షాపులిచ్చి సామాన్య దుకాణదారులను ఏదైనా ఆదుకుంటారా? అంటే అదీ లేదు. దుకాణాల అద్దెలపై ప్రభుత్వానికి నియంత్రణే లేదు. అందుకే శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఈ కంపెనీకి ఇచ్చే రాయితీల మొత్తం రూ.170 కోట్లతో ప్రభుత్వమే షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు.బీచ్ సమీపంలోని రిషికొండపై జగన్ సర్కార్ ప్రతిష్టాత్మక ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే నానా రచ్చ చేసిన కూటమి పెద్దలు లూలూ గ్రూప్ కు ఇంత భారీ ఎత్తున విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. అమరావతి విషయానికి వస్తే, గత ప్రభుత్వం అక్కడ పేదల కోసం ఇచ్చిన ఏభై వేల ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చాలా గట్టిగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని అంటున్నారు కానీ అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. మరో వైపు సుమారు ఏభై వేల కోట్ల అప్పు తెచ్చి ఖర్చు పెడతామంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన పెద్దలు బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు కేటాయించడం ద్వారా వారు అసత్యాలు చెబుతున్న విషయం తేటతెల్లమైంది. ఇక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకుండా, ధనికులు, బడా భూ స్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చి, వారి సంపద పెంచే దిశగా చంద్రబాబు సర్కార్ సన్నాహం చేస్తోంది.రాజధాని పనుల టెండర్లు తమకు కావల్సినవారికి కేటాయించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం, సిండికేట్ల ద్వారా కథ నడిపించడంపై విమర్శపూర్వక వార్తలు వస్తున్నా, ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. కనీసం అందులో వాస్తవం లేదని చెప్పే యత్నం చేయడం లేదంటే ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు. అమరావతి గురించి మాత్రం ఎల్లో మీడియాలో నిత్యం ఊదరగొట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. ఉదాహరణకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, పది లక్షల కోట్ల పెట్టుబడులు అని, ఏడున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే దానిని బ్యానర్ కథనాలుగా వండి వార్చారు.ఇలాంటివన్నీ కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఒక పక్క ఐఐటీ విద్యార్థులకే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోందని వార్తలు వస్తుంటే చంద్రబాబు మాత్రం లక్షల ఉద్యోగాలు అమరావతికి తరలి వస్తాయని అంటున్నారు. అమరావతి గ్రామాలలో రూ.138 కోట్లతో 14 స్కూళ్లు, 17 అంగన్ వాడీలు, 16 వెల్ నెస్ సెంటర్లను ఆధునికంగా తయారు చేస్తోందని ఎల్లో మీడియా బాకా ఊదింది. మరి ఇదే విధంగా మిగిలిన రాష్ట్రం అంతటా ఎందుకు ఏర్పాటు చేయరు? గత జగన్ ప్రభుత్వం పట్టణం, గ్రామం, ప్రాంతం అన్న తేడా లేకుండా స్కూళ్లను, ఆస్పత్రులను బాగు చేస్తే దానిపై విష ప్రచారం చేసిన ఈ మీడియాకు ఇప్పుడు అంతా అద్భుతంగానే కనిపిస్తోంది. కూటమి సర్కార్ సంపద సృష్టి అంటే బడాబాబులకే అన్న సంగతి పదే, పదే అర్థమవుతోందన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జీఎస్డీపీపై ఇన్ని బోగస్ మాటలా బాబూ?
సాక్షి, అమరావతి: ‘‘గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16 శాతం మాత్రమే నమోదైతే... రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీయమేనా?’’ అని సీఎం చంద్రబాబును ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఈ అంకెలను ఎవరైనా ఆర్థికవేత్త లోతుగా పరిశీలిస్తే.. మీ ప్రభుత్వ మొదటి ఏడాది పనితీరు, ఆర్థిక అరాచకాలను కప్పి పుచ్చేందుకే జీఎస్డీపీ వృద్ధి రేటును పెంచారన్న వాస్తవం వెల్లడవుతుందని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రం విశ్వసనీయతను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర విశాల ప్రయోజనాలు, ప్రతిష్ట, విశ్వసనీయతను కాపాడేందుకు.. జీఎస్డీపీలో అతిగా వేసిన అంచనాలను సరిదిద్దుకోవాలని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. ఈమేరకు సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో ఏమన్నారంటే..è చంద్రబాబూ..! మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని.. మీ అనుభవం, సమర్థతతో వాటిని అధిగమించి రాష్ట్రం పురోగమిస్తుందని ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా సంస్థలతో కలసి మీరు విశ్రాంతి లేకుండా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎలా పని చేసిందన్న దానికి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. ⇒ నాడు కోవిడ్ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2019–24లో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పెరుగుదలలో వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 13.57 శాతం మాత్రమే. అదే 2014–19లో కోవిడ్ లాంటి ఇబ్బందులు ఏవీ లేకున్నా సరే రాష్ట్ర అప్పుల వార్షిక వృద్ధి రేటు 22.63 శాతంగా ఉంది. వీటిని బట్టి చూస్తే.. 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరు ప్రశంసించ దగ్గదన్నది స్పష్టమవుతోంది. ⇒ కోవిడ్ ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ 2019–24 మధ్య ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలలో దేశ వృద్ధి రేటును రాష్ట్ర వృద్ధి రేటు అధిగమించింది. 2025 మార్చిలో విడుదలైన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదిక, ఎంవోఎస్పీఐ నివేదికలే అందుకు నిదర్శనం. అయినప్పటికీ 2019–24లో రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం ఉందని మీరు చెబుతున్నారు.⇒ మరోవైపు మీ పాలనలో మొదటి సంవత్సరంలో చాలా ఆందోళనకరమైన ధోరణి ఆవిష్కృతమైంది. కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ.. 2024–25లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు, పన్నేతర ఆదాయాల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. కేంద్ర పన్నుల్లో వాటా పెరగకపోతే, అప్పులు చేయకపోతే.. మీ ప్రభుత్వం ప్రాథమిక ఖర్చులను కూడా తీర్చలేకపోయేది. మీ అసమర్థ పాలన.. అసంబద్ధ విధానాల వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఇంకా ప్రధానమైన విషయం ఏమిటంటే .. మీ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో మూలధన వ్యయం 42.78 శాతం తగ్గింది.⇒ రాష్ట్ర ఆర్థిక పనితీరును బలోపేతం చేయడానికి దిద్దుబాటు చర్యలు ప్రారంభించాల్సిన అవసరాన్ని పూర్తిగా విస్మరించి.. రాష్ట్ర ఆర్థిక పనితీరుపై తప్పుడు ప్రచారం చేయడానికి మీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేస్తుండటం ఆందోళనకరం. రాష్ట్ర ఆర్థిక పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే.. ఎంత ఇబ్బంది, దోపిడీ జరుగుతుందో తెలుస్తుంది. అయినప్పటికీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని మీరు అబద్ధం చెబుతున్నారు.⇒ ఎంవోఎస్పీఐ విడుదల చేసిన డేటా ప్రకారం రాష్ట్రం ఈమేరకు పనితీరు కనబరుస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడిస్తోంది. నిజానికి ఎంవోఎస్పీఐ విడుదల చేసే డేటాకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక, గణాంకాల డైరెక్టరేట్ డేటానే మూలం. దీన్ని బట్టి చూస్తే.. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన డేటా మినహా మరొకటి కాదు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన ముందస్తు అంచనాలు మాత్రమే. వాటిని ఎంవోఎస్పీఐ వంటి ఏ స్వతంత్ర సంస్థ ధృవీకరించలేదు. ⇒ 2024–25లో కేంద్ర పన్నుల ఆదాయాలు ఫిబ్రవరి 25 వరకూ 10.87 శాతం వృద్ధిని నమోదు చేశాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2024–25లో దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 6.48 శాతంగా అంచనా వేసింది. ఇది సమర్థనీయమే. ⇒ తమిళనాడు ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024–25లో ఫిబ్రవరి 2025 వరకు 13.01 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు జీఎస్డీపీ వృద్ధి రేటు 9.69 శాతంగా అంచనా వేసింది. ఇది కూడా సమర్థనీయమే.⇒ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024–25లో ఫిబ్రవరి వరకు 2.16 శాతం మాత్రమే పెరిగితే.. జీఎస్డీపీ వృద్ధి రేటు 8.21 శాతంగా ఉంటుందని మీ ప్రభుత్వం అంచనా వేసింది. మరి ఇది సమర్థనీయమైనదేనా? పన్ను ఆదాయాల వృద్ధి రేటు.. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దాదాపు సమానంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయం 33.35 శాతం తగ్గింది. మూలధన వ్యయం 42.78 శాతం తగ్గింది. ⇒ గత సంవత్సరం మీ ప్రభుత్వ ఆర్థిక పనితీరు పేలవంగా ఉండటం ఆదాయాల తీరును బట్టి స్పష్టంగా కనిపిస్తున్నందున.. ఈ సంవత్సరం ఇంత బలమైన ఆర్థిక పనితీరు గురించి మీ ప్రభుత్వ అంచనాను మీరు ఎలా సమర్థిస్తారు? ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్ను ఆదాయంలో పెరుగుదల ముందస్తు జీడీపీ వృద్ధి అంచనా కంటే ఎక్కువగా ఉంది. ఇది సముచితం. ఎందుకంటే, ప్రస్తుత ధరల వద్ద వినియోగం, పెట్టుబడి వ్యయంపై పన్నులు విధిస్తారు కాబట్టి.. ఇది వాస్తవ జీడీపీ వృద్ధి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తుంది. -
ఆక్వా ఆక్రందన పట్టదా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే.. ఆ పేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతులను దోచుకు తింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఆక్వా ధరలు రోజు రోజుకూ పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు..?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ‘ప్రభుత్వ స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించి గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘రైతులంతా గగ్గోలు పెడితే.. మీడియా, వైఎస్సార్సీపీ నిలదీస్తే కేంద్రానికి ఓ లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? వంద కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200– 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్ హాలిడే మినహా వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?’ అని సీఎం చంద్రబాబును నిలదీస్తూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే..⇒ చంద్రబాబూ..! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా.. ఇలా ప్రతి పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. దళారులు రైతుల కష్టాన్ని దోచుకు తింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలను ప్రస్తావిస్తే మీ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది గానీ ఎక్కడా బాధ్యత తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆక్వా విషయంలోనూ అంతే! ⇒ ఎగుమతుల్లోనూ, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వా రంగం దేశంలోనే నంబర్ వన్. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి మా హయాంలో ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాం. ఆక్వా సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించడంతోపాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తెచ్చాం. సిండికేట్‌గా మారి దోపిడీ చేసే విధానాలకు చెక్ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించాం. దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ సమయంలో 100 కౌంట్‌కు కనీస ధరగా రూ.210 నిర్ణయించి ఆ విపత్తు రోజుల్లో రైతులకు బాసటగా నిలిచాం. మా ప్రభుత్వం అధికారంలో ఉండగా మూడుసార్లు ఫీడ్ ధరలు తగ్గించాం. ఇప్పుడు ఫిష్ ఆయిల్, సోయాబీన్ సహా ముడిసరుకుల దిగుమతులపై సుంకం దాదాపు 15 నుంచి 5 శాతం తగ్గినా ఈ కూటమి ప్రభుత్వంలో ఫీడ్ ధరలు ఒక్క పైసా కూడా తగ్గలేదు. మేం ఏర్పాటు చేసిన నియంత్రణ బోర్డు అందుబాటులో ఉన్నా సరే రేట్లు తగ్గడం లేదు.⇒ గతంలో చంద్రబాబు హయాంలో ఆక్వాజోన్ పరిధిలో కేవలం 80 – 90 వేల ఎకరాలు మాత్రమే ఉంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 4.22 లక్షల ఎకరాలు ఆ జోన్ పరిధిలోకి తెచ్చాం. ఆక్వా రంగంలో మొత్తం 64 వేల విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో జోన్ పరిధిలో ఉన్న 54 వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందించాం. దీనికోసం రూ.3,640 కోట్లు సబ్సిడీ కింద ఖర్చు చేశాం. ఆక్వా జోన్లలో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి ఎప్పుడు సమస్య తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కారం చూపించాం. ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థను నాశనం చేయడంతోపాటు అత్యధికంగా ఆర్జిస్తున్న రంగాన్ని దెబ్బ తీస్తున్నారు. ⇒ చంద్రబాబూ..! ఇప్పటికైనా కళ్లు తెరవండి. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి. అమెరికా టారిఫ్‌ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ టారిఫ్‌లు కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు. ఇక ముందు కూడా ఇవి కొనసాగుతాయి కాబట్టి ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం సరికాదు. -
‘ఆదాయం లేకుండా జీడీపీ ఎలా పెరిగింది చంద్రబాబు?
విశాఖ: ఏపీ రాష్ట్ర వృద్ధిరేటు 8.2 శాతం ఉందని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్పడం, దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలు రాయడంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రోజు(సోమవారం) మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. ‘ ప్రజలను మభ్య పెట్టే విధంగా వార్తలు రాయడం ఏమిటి?. వార్తలు రాయడంలో వాస్తవికత ఉండాలి. కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32 శాతం తగ్గింది. 10 నెలల కాలంలో లక్ష 40 వేల కోట్లకు పైగా అప్పు చేశారు. అప్పులు చేసిన రాష్ట్రానికి వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది. ఆదాయం లేకుండా జీడీపీ ఎలా పెరుగుతుంది.తప్పుడు రాతలు వలన ప్రజలకు ఉపయోగం ఏమిటి?, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా?, అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ అన్నారు.. ఇప్పుడు సిక్స్ లేదు సెవెన్ లేదు.ప్రతి సారి చెవిలో పూలు పెడితే ఎవరు నమ్ముతారు. చెత్త పన్ను తీయడం కాదు. వీధుల్లో టన్నుల్లో ఉన్న చెత్త తీయంచాలి. వచ్చిన ప్రతి పేదవాడికి వైద్యం అందించాలి. ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వలేని రాష్ట్రం వృద్ధిరేటులో రెండో స్థానంలో ఉందట. ప్రతి పేదవాడికి వైద్యం అందించాలన్నది వైఎస్సార్సీపీ విధానం. జగన్ పాలనలో 2.78 కోట్లు ప్రజలకు ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్తలు జిల్లా పేపర్ లో వేస్తున్నారు.చంద్రబాబు తప్పుడు వార్తలను మెయిన్ పేజీలో వేస్తున్నారు. డిప్యూటీ సీఎంపై వివక్ష ఎందుకు చంద్రబాబు? అని ప్రశ్నించారు. -
ఆక్వా కుదేలు.. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే కూటమి ప్రభుత్వం చేతులెత్తేయడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేవలం కేంద్రానికి లేఖ రాస్తే సరిపోదని.. అమెరికా టారిఫ్‌ల పేరుతో దోచుకుంటున్నవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారాయన. అక్వా రంగం సంక్షోభంలో(Aqua Sector Crisis) ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?. రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ చేసి, గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? రైతులంతా గగ్గోలు పెడితే, మీడియా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? 100 కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?చంద్రబాబుగారూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా ఇలా ప్రతి పంటకూ గిట్టూబాటు ధర లేకుండా పోయింది. దళారులు రైతుల కష్టాన్ని దోచుకుతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలను ప్రస్తావిస్తే మీ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది తప్ప ఎక్కడా బాధ్యత తీసుకోవడంలేదు. ఇప్పుడు ఆక్వా విషయంలోనూ అంతే.ఎగుమతుల్లోనూ, అలాగే విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వారంగం దేశంలోనే నంబర్ వన్. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని మా హయాంలో ఏర్పాటు చేశాం. ఆక్వా సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించడంతోపాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చాం. సిండికేట్‌గా మారి దోపిడీచేసే విధానాలకు చెక్ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించాం. కోవిడ్ సమయంలో దాదాపు ఐదేళ్ల క్రితం 100 కౌంట్‌కు, ఆ రోజుల్లో కనీస ధరగా రూ.210లు నిర్ణయించి రైతులకు బాసటగా నిలిచాం. మూడుసార్లు ఫీడ్ ధరలు తగ్గించాం. ఇప్పుడు ఫిష్ ఆయిల్, సోయాబీన్ సహా ముడిసరుకుల దిగుమతులపై సుంకం దాదాపు 15% నుంచి 5% తగ్గినా ఈ కూటమి ప్రభుత్వంలో ఫీడ్ ధరలు ఒక్కపైసా కూడా తగ్గలేదు. మేం ఏర్పాటు చేసిన నియంత్రణ బోర్డు అందుబాటులో ఉన్నాసరే రేట్లు తగ్గడంలేదు.గతంలో చంద్రబాబు హయాంలో ఆక్వాజోన్(Aqua Zone) పరిధిలో కేవలం 80-90వేల ఎకరాలు ఉంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జోన్ పరిధిలోకి 4.22 లక్షల ఎకరాలు తీసుకువచ్చాం. ఆక్వా రంగంలో మొత్తం 64వేల విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో జోన్ పరిధిలో ఉన్న 54వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందించాం. దీనికోసం రూ.3,640 కోట్లు సబ్సిడీ కింద ఖర్చుచేశాం. ఆక్వాజోన్స్‌లో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి, ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపించాం. ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థను నాశనం చేసి, అత్యధికంగా ఆర్జిస్తున్న రంగాన్ని దెబ్బతీస్తున్నారు.చంద్రబాబుగారూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి, ధరల పతనాన్ని అడ్డుకోండి. అమెరికా టారిఫ్‌ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ టారిఫ్‌లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయి. ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం కాదు అని వైఎస్ జగన్ కూటమి సర్కార్‌కు హితవు పలికారు. 1.@ncbn గారూ.. ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 7, 2025 -
ఈ ప్రైవేటు పిచ్చి ఏంటి చంద్రబాబు?’
శ్రీకాకుళం : రాష్ట్రంలో ఆరోగ్య శ్రీని ఆపేసి పేదలను పీల్చి పిప్పిచేసే ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత సీదిరి అప్పలరాజు విమర్శించారు. 20 ఏళ్లు వివిధ పేర్లతో నిరాటంకంగా సాగిన ఆరోగ్య శ్రీ.. చంద్రబాబు నేతృత్వంలో నేడు ఆగిపోయిందన్నారు. ఈరోజు(సోమవారం) ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీదిరి అప్పలరాజు.. ‘ కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి ప్రజలకు ఇది శిక్ష. వైద్య సేవలు ఆపేస్తామని ముందు నుంచీ నెట్ వర్క్ ఆస్పత్రులు చెబుతుంటే.. చంద్రబాబుకు బాధ్యత లేదా?, ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. కరోనా సమయంలో చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా ఉండి ఉంటే ఏపీ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదో ఆయన చర్యలతో ఊహించుకోవచ్చు. పీపీపీ మోడ్ లో నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ పెడతామంటున్నారు. అప్పుడు ప్రస్తుతమున్న సీహెచ్ సీలు, ప్రభుత్వ ఆస్పత్రులను ఏం చేస్తారు. మెడికల్ కాలేజీలు అమ్మేస్తారా.. వీటన్నింటికీ టు లెట్ బోర్డు పెట్టేయండి. నీకు ఈ ప్రైవేటు పిచ్చి ఏంటి చంద్రబాబు?. ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందా?, లేక ప్రైవేటు వ్యక్తుల కోసం పని చేస్తుందా?, అని నిలదీశారు సీదిరి అప్పలరాజు. -
ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ బృందం
విజయవాడ: తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసింది వైఎస్సార్‌సీపీబృందం. ఈ ఎన్నికపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అవిశ్వాసం పెట్టి తద్వారా ఎన్నిక వాయిదా వేయాలని కుట్రకు తెరలేపిన నేపథ్యంలో వైఎస్సార్సీపీసభ్యులు మల్లాది విష్ణ/, వైఎస్సార్సీపీఎంప్లాయిస్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావులు ఎన్నికల కమిసనర్ ను కలిశారు.అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉపఎన్నిక పై ఈసీని కలిశాం. వెంకటగిరిలో 25 కార్పోరేటర్లను వైఎస్సార్ సీపీ గెలిచింది. ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా అవిశ్వాసం ప్రవేశపెట్టింది. దీని ద్వారా మరొకవైపు ఎన్నిక వాయిదా వేసేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోంది. ఈనెల 9వ తేదీన జరగబోయే ఎన్నిక వాయిదా వేయాలని చూస్తోంది. ఎన్నిక వాయిదా పడకుండా చూడాలని ఈసీని కోరాం. 9వ తేదీనే జరిగేలా చూడాలిన కోరాం. భయపెట్టి...బెదిరించి గెలవాలని చూడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కలెక్టర్లకు సరైన ఆదేశాలివ్వాలని కోరాం. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో ఎన్నిక జరపాలి’ అని ఈసీని కోరామన్నారు మల్లాది విష్ణు. -
మీడియాపై ఊగిపోయిన సీఎం చంద్రబాబు
అమరావతి, సాక్షి: ఆరోగ్యశ్రీ పథకం(Aarogyasri Scheme) కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం దాదాపుగా చేతులెత్తేసింది. సోమవారం మీడియాతో పలు అంశాలపై మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(74).. ఆరోగ్యశ్రీ కొనసాగింపు కష్టమన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు తీవ్ర అసహనం వ్యక్తం చేశారాయన.‘‘ఆరోగ్య శ్రీ నిలిపేస్తాం అని ఆస్పత్రుల యజమానులు చెప్పారు. వాళ్లకి డబ్బులు ఇవ్వాలి. వాళ్లకి డబ్బులు ఇమ్మంటే మా ఆర్థిక శాఖ సెక్రెటరీ డబ్బులు ఎక్కడున్నాయని అంటున్నారు?’’ అని సీఎం చంద్రబాబు(CM Chandrababu) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో.. పీ 4 బాగా సక్సెస్ అయ్యింది అని ఆయన అనగానే.. పీ 4 లో మంత్రులు భాగస్వాములయ్యారా..? అని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో.. మీడియాపై ఎదురుదాడికి దిగారారాయన. మీరు భాగస్వామి అయ్యారా..? మీరు ముఖ్యమంత్రే చెయ్యాలి...మంత్రులే చెయ్యాలి అంటే ఎలా..?. మీ ఆలోచనా విధానం మారాలి. మీరు భాగస్వాములయ్యారా..? మీరు క్రిటిక్స్ గానే మిగిలిపోతారా..? అంటూ ఆవేశంతో సీఎం చంద్రబాబు ఊగిపోయారు. అదే సమయంలో ఆక్వా రంగ సంక్షోభం(Aqua Crisis)పైనా వింత వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్షోభానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమన్న సీఎం చంద్రబాబు.. తనకేం చేయాలో అర్థం కావడం లేదని, కేంద్రానికి లేఖ రాయడం మాత్రమే తాను చేయగలిగిందంటూ వ్యాఖ్యానించారు.విజయవాడ: నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఈ ఉదయం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. రూ.3,500 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ ఆసుపత్రులు సమ్మెకు దిగాయి. 26 సార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆ ఆస్పత్రులు చెబుతున్నాయి. మరోవైపు.. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. -
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
తాడేపల్లి: ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు మంచి నీళ్లకు అల్లాడిపోతుంటే మరొకవైపు మద్యం మాత్రం ఏరులై పారుతోందని మాజీ మంత్రి , వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. 10 నెలల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా అవుతుందని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ సీపీ దిగిపోయే నాటికి గోదాంల్లో ఉన్న మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం అమ్మింది. గోదాంల్లో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయించలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన మీరు ఆ డిస్టరీలను ఎందుకు రద్దు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటైనా డిస్టలరీను రద్దు చేసిందా?’ అని ప్రశ్నించారు పేర్ని నాని. ఇంకా ఆయన ఏమన్నారంటే..వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో.. ‘లెల్ట్’ పెట్టుకో..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వైఎస్సార్ సీపీకి చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. కేరళ, బెంగళూరు మద్యం ఏపీలో ఎందుకు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ రెడ్ బుక్ రూల్ ప్రకారమే నడుస్తోందా?. వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యే డబ్బు కొట్టుకో.. బెల్ట్ పెట్టుకో అన్నట్లే ఉంది ఏపీలో పాలన. సూపర్ సిక్స్ హామీల అమలు లేదు కానీ.. మద్యం మాత్రం యధేచ్ఛగా సరఫరా అవుతుంది. బెల్ట్ షాపులుంటే తోలుతీస్తానన్న సీఎం.. మద్యం ఆఖరికి బడ్డీ కొట్టుల్లో దొరుకుతున్నా మాట్లాడటం లేదు ఎందుకు?. శుక్రవారం మధ్యాహ్నం డిఫ్యాక్ట్ సీఎం(లోకేష్ ఉద్దేశిస్తూ) ఏపీలో ఉండడు’ అని విమర్శించారు. కొన్నిసార్లు అపరిచితుడు.. మరొకసారి దశావాతారాలుపవన్ కళ్యాణ్ ని చూస్తే అపరిచితుడిలా కనిపిస్తాడు.. కొన్నిసార్లు దశావతారాల్లో కనిపిస్తాడు.తోలు తీస్తా.. తాట తీస్తా అంటాడు. ఊళ్లో మాత్రం ఉండడు.. సమీక్షలు రాడు.. క్యాబినెట్ మీటింగ్ లకు రాడు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఈ మూడు నియోజవర్గాల్లో మద్యం విచ్చలవిడిగా దొరకుతోంది. బడ్డీ కొట్టులోని ఫ్రిజ్ లో మద్యం ఉంటుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చురాష్ట్రాన్ని పొడిచేస్తామంటారు.. ఈ ముగ్గురు.. కానీ వీళ్ల నియోజకవర్గాల్లోని మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. ఇది రాష్ట్రంలో పరిస్థితి’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.ఆ ఐదేళ్లు చంద్రబాబు, పవన్‌లు విషం వైఎస్సార్సీపీ హయాంలో వరుసగా ఐదేళ్లు మదం పాలసీపై చంద్రబాబు, పవన్ విషంకక్కారు. చంద్రబాబు,పవన్,లోకేష్ బూటకపు ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేశారు. గడచిన 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాల్లో ఏరులైపారిస్తున్నారు, గ్రామాల్లో పచ్చచొక్కాలు మద్యాన్ని పాడికుండలా మార్చుకున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్తీమద్యాన్ని అమ్ముతోందని విషపు ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం నిల్వలను ఈ ప్రభుత్వం రాగానే అమ్ముకుంది. కల్తీమద్యం అయినప్పుడు మీరెందుకు అమ్ముకున్నారు’ అని నిలదీశారు.ఇది కూడా తిరుపతి లడ్డూ కల్తీ మాదిరి తప్పుడు ప్రచారమేనాలడ్డూలో పంది కొవ్వు కలిపారని చేసిన తప్పుడు ప్రచారం లాంటిదేనా?, అధికారంలోకి రాగానే ఆస్తులు ధ్వంసం చేశారు... తగలబెట్టారు...దాడులు చేశారుమద్యం కల్తీదోకాదో ఎందుకు టెస్ట్ లు చేయించలేదని ప్రశ్నిస్తున్నా. ఒక్క డిస్టిలరీ మీదైనా చర్య తీసుకున్నారా ?, రాష్ట్రంలోని 20 డిస్టిలరీలు గతంలో చంద్రబాబు తెచ్చినవే. జగన్ హయాంలో ఒక్క డిస్టిలరీ కూడా తీసుకురాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు మారారుకేరళ ,బెంగుళూరు మద్యమే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు 1500 ఇస్తామన్నారు. చంద్రబాబు మొదటి సంతకానికే దిక్కులేదు. చెప్పిన మాట అమలుకాకపోతే చొక్కాపట్టుకోమన్నాడు డిఫ్యాక్టర్ సీఎం. చొక్కాపట్టుకుందామంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచే కనిపించడుఇంకో ఆయన కాలర్ లేని చొక్కాలేసుకుని కనిపించకుండా పోతాడు. సీఎం ,సీఎం కొడుకు..డిఫ్యాక్టర్ సీఎం కనిపించకపోతే వార్తలు రాయడానికి ఈనాడు,జ్యోతికి చేతులు రావా.. ఈ రాష్ట్రానికి లోకేష్ నాయుడు అనధికార ముఖ్యమంత్రి కుప్పం,పిఠాపురం,మంగళగిరిలో మద్యం ఏరులై పారుతోందిప్రతీ బడ్డీ కొట్టులో మద్యం దొరుకుతోంది. ఏపీలో టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారు. ప్రభుత్వం నిర్ధేశించినదానికంటే 30% శాతం అధికంగా అమ్మాలనేదే ఏపీలో మద్యం పాలసీ’ అని మండిపడ్డారు. -
జనసేన నేతల మధ్య రగడ.. అర్ధరాత్రి ఉమ ఇంటిపై దాడి
సాక్షి, కోనసీమ జిల్లా: ఏపీలో జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో రెండు వర్గాల నేతల మధ్య దాడి ఘటన చోటుచేసుకుంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన నాయకుడిపై దాడి చేసిన ఘటనలో పార్టీ మండల అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నాయకుడు తొలేటి ఉమకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లిలో జనసేన పార్టీ నేతల మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. పార్టీ నాయకుడు తోలేటి ఉమపై జనసన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, ఆయన అనుచరులు దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి రాజేష్, అనుచరులు.. ఉమ ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడి చేశారు. ఈ దాడి సందర్భంగా ఉమను తప్పించే ప్రయత్నం చేసిన ఆయన భార్యపై కూడా వారు దాడి చేయడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.రాజేష్ వర్గం.. ఉమపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అర్ధరాత్రి హుటాహుటిన ఉమను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. ఉమపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న అతడి అనుచరులు.. రాజేష్ కారును ధ్వంసం చేశారు. దాడి ఘటన కారణంగా ఉద్రిక్తత నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆదివారం మధ్యాహ్నం పి.గన్నవరం పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కారణంగానే దాడి జరిగినట్టు పలువురు చెబుతున్నారు. -
రాప్తాడుకు వైఎస్ జగన్.. పోలీసుల ఆంక్షలు!
సాక్షి, అనంతపురం: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అనంతపురం పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వెళ్లనున్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అయితే, వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు అనుమతి ఇచ్చారు. అలాగే, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావద్దని పోలీసులు హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఇది కూడా చదవండి: రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఏపీకి గుడ్‌బై!