హలో.. | mehreen pirzada in hindupuram | Sakshi
Sakshi News home page

అభిమానుల ప్రేమానురాగాలు మరువలేనివి

Jan 13 2018 7:31 AM | Updated on Jan 13 2018 7:31 AM

mehreen pirzada in hindupuram - Sakshi

కృష్ణగాడి వీర ప్రేమ గాథతో ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్‌ మెహరీన్‌ శుక్రవారం హిందూపురంలో సందడి చేశారు. తాజాగా రాజా ది గ్రేట్‌లో తన నటనతో ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ ‘బీ న్యూ’ మొబైల్‌ షోరూంను ప్రారంభించారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించి అక్కడి శిల్పకళ తనను కట్టి పడేసిందని సంతోషం వ్యక్తం చేశారు. అభిమాన హీరోయిన్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున గూమికూడారు.

హిందూపురం అర్బన్‌: అభిమానుల ప్రేమానురాగాలు ఎన్నటికీ మరువలేనివని ప్రముఖ సినీ తార మెహ్రీన్‌ పిర్జాడ అన్నారు. పట్టణంలోని డీఎల్‌ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బీన్యూ మొబైల్‌ షోరూమ్‌ను శుక్రవారం ఆమె వేలాది మంది అభిమానుల కేరింతల నడుమ ప్రారంభించారు. బీన్యూ షోరూం అధినేత వై.డి.బాలాజీ చౌదరితో కలిసి షోరూంను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూపురానికి రావడం ఇది రెండవసారి అని, అదే అభిమానాన్ని చూపుతున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

షోరూంలో ఆకర్షణీయమైన సెల్‌ఫోన్లు రూ.499 ధర నుంచి రూ.లక్ష వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. నాణ్యమైన సెల్‌పోన్లతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్న షోరూంను ప్రతి ఒక్కరూ సందర్శించాలన్నారు. షోరూం అధినేత బాలాజీ చౌదరి మాట్లాడుతూ ప్రస్తుతం హిందూపురంలో ప్రారంభించిన షోరూం నవ్యాంధ్రాలో 42వ షోరూం కాగా.. జిల్లాలో నాల్గవదని తెలిపారు. 2018 సంవత్సరం పూర్తయ్యేలోపు ఏపీలో 100 షోరూంలో ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. హీరోయిన్‌ రాక నేపథ్యంలో సీఐలు చిన్నగోవిందు, తమీంఅహమ్మద్‌లు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

లేపాక్షి సందర్శన
లేపాక్షి: పర్యాటక ప్రాంతమైన లేపాక్షి ఆలయాన్ని సినీనటి మెహ్రీన్‌ పిర్జాడ శుక్రవారం ఉదయం సందర్శించారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement