
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంబలి
చలివేంద్రం నిర్వహిస్తున్న చీలమల్లన్న
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని మాతా బోరంచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఐదేళ్లుగా అంబలి వితరణ గావిస్తున్నారు. ప్రతీ ఏడాది వేసవి కాలంలో ఏప్రిల్, మే రెండు నెలలపాటు ఎండలు అధికంగా ఉంటాయి. పట్టణానికి వివిధ పనులపై వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు అంబలి వితరణ గావిస్తుంటారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు 1200 మందికి అంబలి వితరణ చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఈరంటి సత్యనారాయణ తెలిపారు. ప్రతీ మంగళవారం మెదక్‌లోని ప్రభుత్వ మాతా శిశు ఆస్పత్రిలో అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని తెలిపారు.
సదాశివపేట(సంగారెడ్డి): మాజీ కౌన్సిలర్లు చీల స్వరూప, చీల మల్లన్న ఆధ్వర్యంలో అన్న చీల బస్వరాజ్ జ్ఞాపకార్థం 15 ఏళ్లుగా పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద చలివేంద్రంతోపాటు అంబలి కేంద్రం ప్రారంభించి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ప్రతి రోజూ 250 లీటర్ల వరకు అంబలి తయారు చేసి 1,000 మంది వరకు పంపిణీ చేస్తున్నారు. తన అన్న జ్ఞాపకార్థం ఏదో ఒక రూపంలో సేవ చేయాలని ప్రతీ వేసవి ప్రారంభంలో చలివేంద్రం, అంబలి కేంద్రం ప్రారంభించామని మాజీ కౌన్సిలర్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు చీలమల్లన్న తెలిపారు. ప్రతీ నెలా 30,000 వేల మంది వరకు అంబలి పంపిణీ చేస్తామన్నారు.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంబలి