
ముగ్గురి పైకి దూసుకెళ్లిన కారు
మహిళ మృతి, మరో ఇద్దరికి గాయాలు
చిన్నశంకరంపేట(మెదక్): వల్లభాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ముగ్గు రిపైకి దూసుకెళ్లడంతో మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. నార్సింగి పరిధిలోని వల్లభాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు పోచమ్మల మారవ్వ(58), రామయ్యతోపాటు చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన దశరథం పని మీద రామాయంపేటకు వెళ్లి తిరిగి ఇంటికొస్తున్నారు. వల్లభాపూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా కామారెడ్డి వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యా యి. స్థానికులు క్షతగాత్రులను రామాయంపేట ప్రభుత్వ తరలిస్తుండగా మారవ్వ మృతి చెందింది. నార్సింగి పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.