పిడుగుపాటుకు గేదెలు మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు గేదెలు మృతి

Published Wed, May 7 2025 7:35 AM | Last Updated on Wed, May 7 2025 7:35 AM

పిడుగుపాటుకు గేదెలు మృతి

పిడుగుపాటుకు గేదెలు మృతి

చిన్నకోడూరు(సిద్దిపేట): పిడుగు పాటుకు పాడి గేదెలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మెట్‌పల్లిలో సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బొస్సే చంద్రం రోజు మాదిరిగా పాడి గేదెలను వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఇంటికొచ్చాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా రెండు గేదెలు మృతి చెంది ఉన్నాయి. విషయం తెలుసుకున్న పశువైద్యురాలు మంజుల అక్కడకు చేరుకొని పరిశీలించి పిడుగుపా టుతోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. సుమా రు రూ.లక్ష విలువైన పాడి గేదెలు మృతి చెందడంతో రైతు బోరున విలపించాడు. మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

విద్యుదాఘాతంతో మేకలు..

తొగుట(దుబ్బాక): విద్యుదాఘాతంతో మేకలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని లింగంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. తొగుట మండల కేంద్రానికి చెందిన ముచ్చర్ల రమేశ్‌ మేకలను పెంచుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగా ఉదయం మేతకు తీసుకెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికొస్తున్నాడు. లింగంపేట శివారులో పటేల్‌ చెరువు వద్ద ఆదివారం ఈదురు గాలులకు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆ స్తంభాలకు కరెంట్‌ సరఫరా అవుతుంది. నీరు తాగేందుకు చెరువులోకి వెళ్తున్న క్రమంలో వైర్లకు తగిలి మూడు మేకలు మృతి చెందాయి. వాటి విలువ రూ.60 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ

పోటీలు ప్రారంభం

రామచంద్రాపురం(పటాన్‌చెరు): గ్రామస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రతీయేటా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు మాజీ కౌన్సిలర్‌ కొల్లూరి భరత్‌ అన్నారు. మంగళవారం తెల్లాపూర్‌ గద్దర్‌ సర్కిల్‌ వద్ద అమృత, సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ప్రతీయేటా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. మూడు రోజుల పాటు జరిగే కబడ్డీ పోటీల్లో 31 జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఇందులో మొదటి విజేతకు రూ.99,999, రెండో బహు మతి రూ.55,555, మూడో బహుమతి రూ. 33,333 నగదు అందించనున్నట్లు తెలిపారు.

పెట్టుబడి పేరుతో

వ్యాపారి మోసం

రూ.1.74 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

దుబ్బాక : పెట్టిన పెట్టుబడికి తక్కువ కాలంలో రెట్టింపు డబ్బులు వస్తాయంటూ సైబర్‌ మోసగాళ్లు చెప్పిన మాటలు నమ్మి ఓ వ్యాపారి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు కథనం మేరకు.. దుబ్బాక పట్టణానికి చెందిన మహమ్మద్‌ సలాం అనే వ్యాపారి సెల్‌ఫోన్‌కు గతేడాది అక్టోబర్‌లో అమీలియా అనే గ్రూపునకు సంబంధించి లింక్‌ వచ్చింది. దానిని క్లిక్‌ చేయగా డబ్బులు పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో రెట్టింపు డబ్బులు వస్తాయన్న వివరాలు ఉన్నాయి. సలాం దానిలో ఉన్న స్కానర్‌కు మొదట రూ.30 వేలు పంపగా వెంటనే రూ.60 వేలు వచ్చాయి. మరోసారి మళ్లీ రూ.30 వేలు పంపగా అలాగే వచ్చాయి. దీంతో అత్యాశతో రూ.1,74,999 ను ఆ లింక్‌లోని స్కానర్‌కు విడతల వారీగా పంపాడు. అప్పటి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మోసపోయాయని గుర్తించాడు. ఈ విషయాన్ని బాధితుడు 1930 కి కాల్‌చేసి ఫిర్యాదు చేయడంతో రూ.7 వేలు ఫ్రీజ్‌ చేశారు. బాధితు డి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమో దు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement