
అధిక దిగుబడులు సాధించాలి
సీడీసీ చైర్మన్ రాంరెడ్డి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): వ్యవసాయరంగంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందాలని సీడీసీ చైర్మన్ రాంరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఆత్మకూర్ రైతువేదికలో జరిగిన ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రయానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు తక్కువ మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులను వినియోగించాలన్నారు. సాగునీటిని ఆదా చేసి భవిష్యత్ తరాలకు అందించడం మన అందరి బాధ్యత అన్నారు. పంట మార్పిడిని పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలని సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు విజయ్‌కుమార్, విజయలక్ష్మి, గణపతి షుగర్ పరిశ్రమ జనరల్ మేనేజర్ కృష్ణ మోహన్, ఏఓ రమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్ధన్న, మాజీ సర్పంచ్ గంగన్న, నాయకులు పాల్గొన్నారు.