
అకాల వర్షం.. ఆగమాగం
జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. కోతకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. ధాన్యం నేలరాలింది. ఇక కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కోటపల్లి, మందమర్రి, నెన్నెల, చెన్నూర్ మండలాల్లో అకాల వర్షం తీవ్ర నష్టం కలిగించింది. కళ్ల ముందే కొట్టుకుపోతున్న ధాన్యం చూసి రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ధాన్యం కుప్పల మధ్యనే నీరు నిలవడంతో ఉదయం వాటిని తొలగించి ధాన్యం ఆరబోశారు. ఈదురు గాలులకు ఇప్పటికే మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా కురిసిన ఈదురు గాలుల వర్షానికి ఉన్న మామిడి కాయలు కూడా నేల రాలాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. హాజీపూర్ మండలంలో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. మండలంలోని కర్ణమామిడి, టీకానపల్లి, పడ్తనపల్లి, సబ్బేపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వర్షానికి తడిసిపోయింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి వర్షంతో నష్టపోయిన పంటకు పరిహారం అందించాలని కోరుతున్నారు. దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతోపాటు, తూకం వేసిన బస్తాలు తడిశాయి.
– కోటపల్లి/మందమర్రిరూరల్/నెన్నెల/చెన్నూర్‌రూరల్/మంచిర్యాలరూరల్(హాజీపూర్)/దండేపల్లి

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం