
నీలగిరి వనాలతో లాభాలు
● టీజీఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్ శ్రావణి
నెన్నెల: నీలగిరి వనాలతో ఎన్నో లాభాలు ఉన్నాయని వీటిపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ టీజీఎఫ్‌డీసీ కాగజ్‌నగర్ డివిజనల్ మేనేజర్ శ్రావణి అన్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని నీలగిరితో స్నేహం పేరిట బుధవారం మండలంలోని బొప్పారం శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పెంచుతున్న నీలగిరి వనంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీలగిరి వనాల ద్వారా కాగితం తయారీకి అవసరమయ్యేలా కలప లభ్యం కావడమే కాక పర్యావరణకు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. ఒకే చోట వేలాదిగా పెంచే నీలగిరి చెట్ల ద్వారా అధిక మొత్తంలో ఆక్సిజన్ వస్తూ కాలుష్యాన్ని నియంత్రిస్తుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు నీలగిరి చెట్లు పెంచే దశ నుంచి కోత వరకు కాగితం తయారీకి అవసరమయ్యే కలపను రవాణా చేసే వివిధ దశల్లో జరిగే పనులను వివరించారు. కార్యక్రమంలో టీజీఎఫ్‌డీసీ మంచిర్యాల రేంజ్ ప్లానిటేషన్ మేనేజర్ గోగు సురేశ్‌కుమార్, బెల్లంపల్లి రేంజ్ ప్లానిటేషన్ మేనేజర్ సునిత, డెప్యూటీ ప్లానిటేషన్ మేనేజర్ దుర్గం నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.