
సైనికా.. సెల్యూట్!
● ఆపరేషన్ సిందూర్‌పై సర్వత్రా హర్షం.. ● సైనికుల సాహసానికి జిల్లావాసుల జేజేలు
● ఉగ్రవాదం అంతం చేయాలని వినతి
పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ దాయాది దేశాన్ని భారత సైన్యం గట్టి దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి ప్రతీకార చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి ’ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో తొమ్మిది ఉగ్రస్థావరాలపై విరుచుకుపడ్డాయి. భారత సైనికుల సాహసాన్ని యావత్ భారతం కొనియాడుతోంది. జిల్లావాసులు జవాన్ల ధైర్యాన్ని హృదయపూర్వకంగా కొనియాడుతున్నారు. ఉగ్రవాదం అంతమొందించేందుకు చేపట్టే చర్యలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌పై జిల్లాకు చెందిన పలువురు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
● పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలి
భీమారం: కాశ్మీర్‌లోని పహల్గాంలో టెర్రరిస్ట్‌లు అమాయకులైన పర్యాటకులపై జరిపిన దాడికి ప్రతిగా భారత సైన్యం ఆపరేషన్ సిఽందూర్ పేరుతో దాడి చేయడం హర్షనీయం. ప్రతీసారి భారతదేశంపైకి ఉగ్రవాదులతో దాడి చేయిస్తున్న పాకిస్తాన్‌కు ప్రధాని నరేంద్రమోదీ గట్టి బుద్ధి చెప్పాలి. పీవోకేను స్వాధీనం చేసుకోవాలి. – కొమ్ము జయరాజు,
మాజీ సైనికుడు, భీమారం
●ఉగ్రవాదాన్ని సమూలంగా అణిచివేయాలి
భారత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఉగ్రవాదం మన దేశానికే కాకుండా ప్రపంచానికే ముప్పు ఉంది. దీనిని అంతమొందించాల్సిందే. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులను తుదముట్టించే వరకు దాడులు చేయాలి. దేశంలో అక్రమంగా దేశంలో నివాసం ఉంటున్న పాకిస్తానీయులను వారి దేశాలకు పంపించాలి. దేశంలో ఉంటున్నవారే ప్రమాదకరం.
– రమేశ్‌యాదవ్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు
●ఉగ్రవాదులకు సరైన జవాబు
మంచిర్యాలటౌన్: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం గట్టి బదులు ఇచ్చిన ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజల్లో మనోధైర్యం నింపింది. ప్రతీకారం కోసం ఎదురుచూసిన బాధితులు, దేశ ప్రజలకు ఉగ్ర శిబిరాలపై జరిగిన దాడితో కొంత ఊరట లభించింది. భారత దేశం రాక్షసత్వానికి సరైన బదులును ఇస్తుందని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
–సురభి స్వాతి,
మోటివేషన్ స్పీకర్, మంచిర్యాల

సైనికా.. సెల్యూట్!

సైనికా.. సెల్యూట్!

సైనికా.. సెల్యూట్!